SRIRANGAM VASTRAMS OFFERED _ శ్రీరంగం నుండి తిరుమల శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పణ

TIRUMALA, 16 JULY 2024: On the auspicious occasion, following the tradition, special vastrams from Sri Rangam temple of Tamil Nadu were offered to Sri Venkateswara Swamy. In a procession which commenced at Sri Pedda Jeeyar Mutt in Tirumala, Tamil Nadu Endowments Minister Sri Sekhar Babu, Endowments Special Commissioner Sri Kumara Guru Balan, Joint Commissioner Sri Rangam Sri Mariyappan presented the silks.

Both the senior and junior Pontiffs of Tirumala, JEO Sri Veerabrahmam were present in this ceremony.

ISSUED BY THE CHIEF PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీరంగం నుండి తిరుమల శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పణ

తిరుమల, 2024, జూలై 16: ఆణివార ఆస్థానం పర్వదినం సందర్భంగా తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీరంగం శ్రీ రంగ‌నాథ‌స్వామి తరఫున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు.

మంగళవారం ఉదయం శ్రీ బేడి ఆంజనేయస్వామివారి ఆలయం పక్కన గల తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్‌స్వామి మఠంలో శ్రీవారి సారెకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడినుండి తమిళనాడు దేవాదాయ శాఖ మంత్రి శ్రీ శేఖర్ బాబు, తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్‌స్వామి, టీటీడీ జేఈవో శ్రీ వీరబ్రహ్మం కలిసి పట్టువస్త్రాలను మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా నాలుగు మాడ వీధుల ప్ర‌ద‌క్షిణ‌గా ఆలయంలోకి తీసుకెళ్లారు. అనంతరం స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.

ఈ కార్యక్రమంలో తమిళనాడు దేవాదాయ శాఖ ప్రత్యేక కార్యదర్శి శ్రీ కుమార గురుబాలన్, శ్రీరంగం ఆలయ ఆలయ జాయింట్ కమిషనర్ శ్రీ మారియప్పన్, తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.