SRIVANI TRUST TO GET A BOOST-TTD ADDITIONAL EO_ శ్రీ‌వాణి ట్ర‌స్టుకు విరాళాలిచ్చే దాత‌ల‌కు విఐపి బ్రేక్ ద‌ర్శ‌న టికెట్లు : టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి

NEW APP FOR THE TRUST TO BE LAUNCHE IN NOVEMBER 

Tirumala, 21 Oct. 19: The Sri Venkateswara Alaya Nirmana Trust (SRIVANI) which was commenced by TTD in the mid of this year will soon get a boost by extending the privileges of VIP Break Darshan to the donors of the Trust, said TTD Additional EO Sri AV Dharma Reddy.

Briefing media persons in Gokulam Rest House Conference Hall at Tirumala on Monday evening, the Additional EO said the Trust was launched with a unique concept of construction of Sri Venkateswara Swamy temples through donations received in SRIVANI Trust particularly in SC, ST and BC areas to avoid religious conversions and preserve, promote and propagate Hindu Sanatana Dharma.

He said the board also appreciated the innovative idea during the last meeting. The privilege of VIP darshan will be a onetime grant to the donors who donate a minimum of Rs.10,000 and a maximum of Rs.99,999. For each Rs.10,000 one VIP ticket will be allotted and the donor is entitled for Protocol darshan as a onetime grant with a ceiling limit of nine tickets. If the donations cross Rs.1lakh and Rs.1lakh to Rs.5lakhs and above the uniform privileges which are existing now for other Trusts will apply to this Trust also”, the Additional EO added.

Adding further he said, a Stand Alone Counter will be opened at Gokulam Rest House and the VIP ticket will be generated to the Donor then and there itself for  dashan on next day and to redeem the privileges of VIP Beginning Break Darshan, the donor should pay Rs.500 per ticket. The mode of payment for off-line donations at Tirumala will be through card swiping and also by cash in a counter exclusively set up for the purpose.

The Day-wise quota for a month will be released one month in advance and the quota will be decided by the authorities from time to time. 

IT Head Sri Sesha Reddy was also present. 

CHENNAITE DONATES

As soon as the Trust was launched on Monday evening, Sri Ramaiah, a donor from Chennai donated Rs.40,000 towards SRIVANI Trust. Additional EO Sri AV Dharma Reddy explained the donor about the privileges and congratulated him and his family. The donor also expressed his immense pleasure in receiving the first ticket as soon as the launch of the Trust.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

 

శ్రీ‌వాణి ట్ర‌స్టుకు విరాళాలిచ్చే దాత‌ల‌కు విఐపి బ్రేక్ ద‌ర్శ‌న టికెట్లు : టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి

తిరుమ‌ల‌, 2019 అక్టోబ‌రు 21: ధ‌ర్మ‌ప్ర‌చారంలో భాగంగా ఎస్‌సి, ఎస్‌టి ఇత‌ర వెనుక‌బ‌డిన‌ ప్రాంతాల్లో శ్రీ‌వారి ఆల‌యాల నిర్మాణానికి, పురాత‌న ఆల‌యాల ప‌రిర‌క్ష‌ణ‌కు శ్రీ‌వాణి ట్ర‌స్టు ద్వారా విరాళాలు స్వీక‌రిస్తున్నామ‌ని, విరాళాలిచ్చే దాత‌ల‌కు ప్రివిలేజ్‌గా విఐపి బ్రేక్ ద‌ర్శ‌నం క‌ల్పిస్తామ‌ని టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి తెలిపారు. తిరుమ‌ల‌లోని గోకులం విశ్రాంతిగృహంలో గ‌ల స‌మావేశ మందిరంలో సోమ‌వారం అద‌న‌పు ఈవో మీడియా స‌మావేశం నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా అద‌న‌పు ఈవో మాట్లాడుతూ శ్రీ‌వాణి ట్ర‌స్టుకు విరాళాలిచ్చే దాత‌ల‌కు బ్రేక్ ద‌ర్శ‌న టికెట్లు ఇచ్చే విధానాన్ని సోమ‌వారం నుండి న‌లుగురు దాత‌ల‌తో ప్రారంభించామ‌ని వెల్ల‌డించారు. ఇందుకోసం గోకులం విశ్రాంతి గృహంలో ఆఫ్‌లైన్‌లో సింగిల్ విండో కౌంట‌ర్‌ను ప్రారంభించామ‌ని తెలిపారు. న‌వంబ‌రు మొద‌టి వారంలో ఇందుకోసం ప్ర‌త్యేకంగా యాప్‌ను ప్రారంభిస్తామ‌ని, ఆ త‌రువాత ప్ర‌పంచం న‌లుమూల‌ల నుండి భ‌క్తులు ఆన్‌లైన్‌లో విరాళాలందించ‌వ‌చ్చ‌ని చెప్పారు. శ్రీ‌వాణి ట్ర‌స్టుకు రూ.10 వేలు విరాళ‌మిచ్చే దాత‌ల‌కు ఒక బ్రేక్ ద‌ర్శ‌న టికెట్ ప్రివిలేజ్‌గా ఒక‌సారి మాత్ర‌మే అందిస్తామ‌ని, వెంట‌నే స‌ద‌రు దాత‌లు రూ.500/- చెల్లించి బ్రేక్ ద‌ర్శ‌న టికెట్ కొనుగోలు చేయ‌వ‌చ్చ‌ని వెల్ల‌డించారు. శ్రీ‌వాణి ట్ర‌స్టుకు దాత‌లు ఒక రూపాయి నుండి ఎంత‌మొత్త‌మైనా విరాళంగా అందించవ‌చ్చ‌ని రూ.10 వేల నుండి టిటిడి క‌ల్పించే ప్ర‌యోజ‌నాలు వ‌ర్తిస్తాయ‌ని తెలిపారు. రూ.10 వేల‌కు ఒక బ్రేక్ ద‌ర్శ‌న టికెట్ చొప్పున 99 వేల వ‌ర‌కు 9 టికెట్ల‌ను దాత‌లు పొందే అవ‌కాశ‌ముంద‌న్నారు. ఒక ల‌క్ష పైన విరాళాందించే దాత‌ల‌కు టిటిడి ఇదివ‌ర‌కే ప‌లు ట్ర‌స్టులు, స్కీమ్‌లకు అందిస్తున్న త‌ర‌హాలోనే ప్ర‌యోజ‌నాల‌ను వ‌ర్తింప‌చేస్తామ‌ని వివ‌రించారు. ప్ర‌స్తుతం ప్ర‌యోగాత్మ‌కంగా ప్రారంభించామ‌ని, భ‌క్తుల స్పంద‌న‌ను దృష్టిలో ఉంచుకుని కోటా నిర్ణ‌యిస్తామ‌ని, ఒక నెల ముందే ఈ కోటాను తెలియ‌జేస్తామ‌ని అద‌న‌పు ఈవో తెలియ‌జేశారు.

కాగా, శ్రీ‌వాణి ట్ర‌స్టుకు చెన్నైకి చెందిన శ్రీ రామ‌య్య రూ.40 వేలు విరాళంగా అందించారు. దీంతోపాటు ఒక్కో టికెట్‌కు రూ.500/- చెల్లించి 4 బ్రేక్ ద‌ర్శ‌న టికెట్లు పొందారు.

మీడియా స‌మావేశంలో టిటిడి ఐటి విభాగాధిప‌తి శ్రీ శేషారెడ్డి పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.