SRIVARI ANNUAL BRAHMOTSAVAMS IN EKANTHAM IS LORD’s WISH- PONTIFF _ శ్రీవారి సంకల్పంతోనే ఏకాంతంగా సాలకట్ల బ్రహ్మోత్సవాలు: శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర స్వామి

Tirumala, 6 Sep 2020: The conduction of annual Brahmotsavams of Lord Venkateswara at Tirumala in Ekantam was as per the wish of the Supreme Lord Himself, said HH Sri Swaroopanandendra Saraswathi Swamy of Visakha Sarada Peetham.

TTD Chairman Sri Y V Subba Reddy along with EO Sri Anil Kumar Singhal and Additional EO Sri A V Dharma Reddy called on the pontiff at his ashram in Rishikesh on Sunday. The Visakha pontiff has been performing Chaturmasa Diksha along with Junior Pontiff Sri Swatmanadendra Saraswathi Swamy since last three months.

The TTD officials presented Srivari Thirtha Prasadams to the Pontiff on the occasion of their courtesy call and received blessings from him.

Speaking on the occasion the Pontiff lauded the COVID-19 prevention and precautionary steps taken up by the TTD at Tirumala providing convenient and hassle-free darshan to pilgrims.

He also complemented TTD for its spiritual and religious programs like Sundarakanda and Viratparva Parayanams which have received global applause during the pandemic period.

The Pontiff also admired the stellar services provided by the religious staff and other employees of TTD to the pilgrims when darshan resumed.

Later he said the TTD management decision to conduct the annual Brahmotsavam in Ekantham in view of the safety of the archakas, staff and also devotees this year is noteworthy. He said he is confident that the board will take an appropriate decision to conduct the Navaratri Brahmotsavam in October also depending on the prevailing situation during that time.

 ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీవారి సంకల్పంతోనే ఏకాంతంగా సాలకట్ల బ్రహ్మోత్సవాలు: శ్రీశ్రీశ్రీ  స్వరూపానందేంద్ర స్వామి
 
తిరుమల, 2020 సెప్టెంబరు 06: ఈ సృష్టిలో శ్రీవారి అనుగ్రహంతోనే అన్ని కార్యాలు జరుగుతాయని, స్వామివారి సంకల్పంతోనే తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా జరుగనున్నాయని విశాఖ శ్రీ శారద పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ  స్వరూపానందేంద్ర స్వామి ఉద్ఘాటించారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన రిషికేశ్ లోని విశాఖ శ్రీ శారద పీఠం ఆశ్రమంలో మూడు నెలలుగా చాతుర్మాస్య దీక్షలో ఉన్న స్వామీజీని ఆదివారం నాడు టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి, ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో శ్రీ ఏవి.ధర్మారెడ్డి కలిసి  తిరుమల శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేసి ఆశీస్సులు పొందారు. స్వామీజీ వెంట శ్రీ శారద పీఠం ఉత్త‌రాధికారి శ్రీ‌శ్రీ‌శ్రీ స్వాత్మానందేంద్ర స‌ర‌స్వ‌తి స్వామివారు ఉన్నారు.
 
ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ టీటీడీ చేపడుతున్న కరోనా వ్యాధి వ్యాప్తి నివారణ చర్యలను అభినందించారు. 
 
ముఖ్యంగా, ఈ విపత్కర పరిస్థితులలో టీటీడీ చేపట్టిన అనేక ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు,  సుందరకాండ, విరాటపర్వ పారాయణములు ప్రపంచవ్యాప్తంగా  శ్రీవారి భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయన్నారు. 
 
అదే విధంగా, శ్రీవారి దర్శనం పునఃప్రారంభమైన తరువాత,  దర్శనానికి విచ్చేస్తున్న భక్తులకు టిటిడి యాజమాన్యం, సిబ్బంది చక్కటి సేవలందిస్తున్నారని కొనియాడారు. కరోనా సమయంలో అర్చకులకు, భక్తులకు, ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ నెలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహించాలని టిటిడి బోర్డు నిర్ణయం తీసుకోవడం హర్షణీయమన్నారు. అక్టోబరులో కరోనా తీవ్రతను, అప్పటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని భక్తులకు కరోనా వ్యాధి వ్యాప్తి చెందకుండా తగిన చర్యలు తీసుకుని,  నవరాత్రి బ్రహ్మోత్సవాలను సంప్రదాయబద్ధంగా నిర్వహించాలని సూచించారు.
      
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.