SRIVARI ANNUAL TEPPOTSAVAM FROM MARCH 16 TO MARCH 20_ మార్చి 16 నుంచి 20వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు

Tirupati, 20 Feb. 19: The prestigious five day Float festival of Srivari Temple will commence from March 16-20.

On all five days the utsava idols will be taken around the glittering float one round scaled up each day to conclude with seven rounds on final day.

All arjita sevas of Vasabtotsavam ans Sahasradeepilankaram on March 16,17 and the Arjita Brahmotsavams, Vasabtotsavam ans Sahasradeepilankaram have been cancelled by the TTD.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

మార్చి 16 నుంచి 20వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు

ఫిబ్రవరి 20, తిరుమల, 2019: తిరుమలలో మార్చి 16 నుంచి 20వ తేదీ వరకు ఐదు రోజులపాటు శ్రీ‌వారి సాలకట్ల తెప్పోత్సవాలు జరుగనున్నాయి.

తెప్పోత్సవాలను ప్రతిరోజూ రాత్రి 7 నుంచి 8 గంటల వరకు నిర్వహిస్తారు. తొలిరోజు సాయంత్రం శ్రీ సీత లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరామచంద్రమూర్తి, రెండో రోజు రుక్మిణీ సమేత శ్రీకృష్ణస్వామివారు మాడ‌వీధుల ప్రదక్షిణంగా ఊరేగుతూ వచ్చి పుష్కరిణిలో తెప్పపై మూడు చుట్లు విహరిస్తారు. ఇక చివరి మూడురోజులు శ్రీదేవి, భూదేవి స‌మేత మలయప్పస్వామివారు తెప్పపై మూడో రోజు మూడు చుట్లు, నాలుగో రోజు ఐదు చుట్లు, ఐదో రోజు ఏడు చుట్లు విహరించి భక్తులను కటాక్షిస్తారు.

ఆర్జితసేవలు రద్దు :

తెప్పోత్సవాల కారణంగా మార్చి 16, 17వ తేదీల్లో వసంతోత్సవం, సహస్రదీపాలంకార సేవ, మార్చి 18, 19, 20వ తేదీల్లో ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది. భ‌క్తులు ఈ విష‌యాన్ని గ‌మ‌నించ‌గ‌ల‌రు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.