JEO RELEASES TONDAMANADU POSTERS_ తొండమనాడు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల గోడపత్రికల ఆవిష్కరణ

Tirupati, 20 Feb. 19: TTD JEO for Tirupati, Sri B Lakshmikantham on Wednesday released the posters of annual brahmotsavams of Tondamanadu temple.

This event took place in JEO Chamber in TTD administrative building in Tirupati. Along with Tondamanadu temple, the Maha Sivarathri festival posters of Sri Seshachala Lingeswaraswamy temple were also released.

Meanwhile the important days in Sridevi Bhudevi Sametha Sri Venkateswara Swamy in Tondamanadu includes Dhwajarohanam on March 5, Kalyanam and Garuda Seva on March 9, Pushpa yagam on March 14.

While there will special abhishekam, Kalyanam and Nandi Vahanam in Seshachala Lingeswara Swamy temple in Chandragiri on March 4 and 5.

Local temples DyEO Sri Subramanyam was also present during the poster release.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

తొండమనాడు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల గోడపత్రికల ఆవిష్కరణ

తిరుపతి, 2019 ఫిబ్రవరి 20: టిటిడి అనుబంధ ఆలయాలు అయిన తొండమనాడులోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు, చంద్రగిరి మండలం శేషాపురం గ్రామంలోని శ్రీ శేషాచల లింగేశ్వరస్వామివారి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాల గోడపత్రికలు, కరపత్రాలను టిటిడి తిరుపతి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం బుధవారం సాయంత్రం ఆవిష్కరించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల జెఈవో కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది.

తొండమనాడులోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయం..

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ తొండమనాడులోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మార్చి 1 నుండి 4వ తేదీ వరకు ఆలయ రాజగోపుర ప్రతిష్ఠ మహోత్సవం శాస్త్రోక్తంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు మార్చి 5 నుండి 13వ తేదీ వరకు వైభవంగా నిర్వహిస్తామన్నారు. శ్రీవేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు మార్చి 4వ తేదీన అంకురార్పణం, మార్చి 5న ధ్వజారోహణం, మార్చి 9న స్వామి, అమ్మవార్ల కల్యాణోత్సవం, గరుడసేవ, మార్చి 13న చక్రస్నానం, మార్చి 14న పుష్పయాగం జరుగనున్నాయని తెలిపారు. పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి స్వామి, అమ్మవారి కృపకు పాత్రులు కావాలని ఈ సందర్భంగా జెఈవో కోరారు.

శేషాపురం శ్రీ శేషాచల లింగేశ్వరస్వామివారి ఆలయం…

చంద్రగిరి సమీపంలోని శేషాపురం శ్రీ శేషాచల లింగేశ్వరస్వామివారి ఆలయంలో మార్చి 4, 5వ తేదీలలో మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తామన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఇందులో భాగంగా మార్చి 4న స్వామివారికి అభిషేకాలు, మార్చి 5న శివపార్వతుల కల్యాణం, నంది వాహనంపై ఊరేగనున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో టిటిడి స్థానిక ఆలయాల డెప్యూటీ ఈవో శ్రీ సుబ్రమణ్యం, ఏఈవో శ్రీనాగరాజు, సూపరింటెండెంట్‌ శ్రీ రాజ్‌కుమార్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.