SRIVARI LADDU TO REACH ALL DEVOTEES – TTD EO _ శ్రీవారి లడ్డూ ప్రసాదాలు భక్తులందరికీ అందుబాటులోకి తీసుకురావాలి-టీటీడీ ఈవో శ్రీ జె. శ్యామల రావు
Tirumala, 06 September 2024: TTD EO Sri J Syamala Rao said it is the endeavour of TTD to ensure that the delicious Srivari laddu Prasadam reach every devotee.
Addressing media persons after the monthly Dial-your -EO program at Annamaiah Bhavan in Tirumala on Friday the TTD EO said henceforth Srivari Laddu Prasadam will be made available at all TTD temples and information centers across the world.
Steps are being contemplated to roll out to install infrastructure at all outside temples and TTD information counters to commence the sale of Srivari laddus.
He said there is a popular demand from devotees for the availability of Srivari laddus in other regions but due to several logistics, it was not done so far.
However now TTD has contained the menace of middlemen in Tirumala, and now planning to send Srivari laddus to other places on a regular basis.
Later he briefed on August pilgrim data.
Darshan: 22.42 lakh devotees
Hundi collection: ₹125.67 crore
Laddu sale: 1.06 crore
Anna Prasadam: 24.33 lakh
Kalyana Katta: 9.49 lakh tonsures
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీవారి లడ్డూ ప్రసాదాలు భక్తులందరికీ అందుబాటులోకి తీసుకురావాలి
• టీటీడీ ఈవో శ్రీ జె. శ్యామల రావు
తిరుమల, 2024 సెప్టెంబరు 06: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలను భక్తులందరికీ అందుబాటులోకి తీసుకురావాలని టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు చెప్పారు.
తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం డయల్ యువర్ ఈవో కార్యక్రమం అనంతరం మీడియా సమావేశంలో ఈవో మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ఉన్న టిటిడి ఆలయాలు సమాచార కేంద్రాలలో లడ్డూ ప్రసాదాలను శాశ్వతంగా విక్రయించేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఆయా ఆలయాలలో ఇందుకు అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు కార్యాచరణ ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు.
బయట ప్రాంతాల నుండి చాలా కాలంగా భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారని, తిరుమలకు విచ్చేసే భక్తులకు లడ్డూలు సరిపోతున్నందున బయట ప్రాంతాలలో లడ్డూ ప్రసాదాలను విక్రయించలేదన్నారు. తిరుమలలో లడ్డూ దళారులను కట్టడి చేయడం ద్వారా, బయట ప్రాంతాలకు లడ్డూ ప్రసాదాలు పంపుతున్నట్లు వివరించారు.
అనంతరం ఆగస్టు నెల దర్శనం, హుండీ, అన్న ప్రసాదం, తల నీలాలు, లడ్డూల విక్రయం తదితర వివరాలను వెల్లడించారు.
దర్శనం :
• శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య ` 22.42 లక్షలు.
హుండీ :
• హుండీ కానుకలు ` రూ.125.67 కోట్లు.
లడ్డూలు :
• విక్రయించిన శ్రీవారి లడ్డూల సంఖ్య ` 1.06 కోట్లు.
అన్నప్రసాదం :
• అన్నప్రసాదం స్వీకరించిన భక్తుల సంఖ్య ` 24.33 లక్షలు.
కల్యాణకట్ట :
• తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య ` 9.49 లక్షలు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.