2100 SRIVARI SEVAKULU RENDER SERVICES IN MADA STREETS_ భక్తులలో భగవంతుణ్ణి దర్శిస్తూ సేవలందించిన శ్రీవారి సేవకులు
Tirumala, 12 Feb. 19: A total of 2100 Srivari Sevakulu were pressed into service in four mada streets on the occasion of Radhasapthami in Tirumala.
In East mada street 345, West 598, South 296 and in North 870 Sevakulu were allotted duties for distribution of Annaprasadam, water, pilgrim crowd management under the supervision of Annaprasadam, Health and Vigilance departments respectively.
Meanwhile under the instructions of EO Sri Anil Kumar Singhal, in the supervision of Tirumala JEO Sri KS Sreenivasa Raju about 3500 sevakulu hailing from AP, TS, TN, Karnataka, Maharashtra and Orissa took part in the service.
On the other hand 382 sevakulu rendered services in packing over 3 lakh food packets to be distributed to the pilgrims.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI
భక్తులలో భగవంతుణ్ణి దర్శిస్తూ సేవలందించిన శ్రీవారి సేవకులు
తిరుపతి, 2019 ఫిబ్రవరి 12: రథసప్తమిని పురస్కరించుకొని టిటిడి అనుబంధ ఆలయాలలో వాహన సేవలు వీక్షించేందుకు విచ్చేసిన వేలాది మంది భక్తులలో భగవంతుణ్ణి దర్శిస్తూ శ్రీవారి సేవకులు విశేష సేవలందించారు.
దాదాపు 280 మంది శ్రీవారి సేవకులు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం, ఇతర అనుబంధ ఆలయాలలో అన్నప్రసాదం, ఆరోగ్యశాఖ, విజిలెన్స్ విభాగాలకు సంబంధించిన వివిధ ప్రాంతాలలో భక్తులకు సేవలందించారు. మంగళవారం ఉదయం నుండి మాడ వీధులలో వేచి ఉండే భక్తులకు త్రాగునీరు, మజ్జిగ పంపిణీ చేశారు.
టి.టి.డి హిందూధర్మ ప్రచార పరిషత్ ముద్రించిన రథసప్తతమి, గోవిందనామాలు, సుప్రభాతం, లలితాసహస్రనామం, విష్ణు సహస్రనామం పుస్తక ప్రసాదాలను కూడా శ్రీవారి సేవకుల ద్వారా భక్తులకు అందిస్తున్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.