SRIVARI SEVA SET TO CREATE HISTORY-TIRUMALA JEO_ నూతన శ్రీవారి సేవా సదనాలను పరిశీలించిన టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు
Tirumala, 1 September 2018: Srivari Seva voluntary service which has commenced by TTD about 18 years ago is set to create history with the new twin buildings which going to be inaugurated by Honourable CM of AP Sri N Chandra Babu Naidu during the ensuing brahmotsavams, said Tirumala JEO Sri KS Sreenivasa Raju.
The JEO inspected the twin buildings which are coming up at a cost of almoat Rs.100crores behind Kalyana Vedika in Tirumala.
Speaking to media persons on this occasion he said, Srivari Seva volunteers have been rendering commendable services to pilgrims. “Recently to encourage more youth, employee and educated in to voluntary service we have introduced 3-day and 4-day services in on-line also. So in future Srivari Seva would emerge as a role model to all the voluntary organisations”, he said.
Adding further the JEO said, to strengthen and promote quality of service we have constructed this Seva Gramam exclusively for volunteers with two buildings to accommodate male and female volunteers separately. There 16 halls with a dining hall in each building. There is a Satsangam hall to orient sevaks on behavioural attitude, soft communication skills while dealing with pilgrims etc.”, he said.
CVSO In-charge Sri Siva Kumar Reddy, SE II Sri Ramachandra Reddy, SE Electrical Sri Venkateswarulu, Catering Officer Sri Shastry and others were also present.
ANNUAL BRAHMOTSAVAMS FROM SEP 13
The annual Brahmotsavams of Lord Venkateswara in Tirumala will commence from September 13 onwards and concludes on September 21 with Chakrasnanam, said Tirumala JEO Sri KS Sreenivasa Raju.
He said the Honourable CM of AP will present silk vastrams on first day evening and the procession starts from Sri Bedi Anjaneya Swamy temple at 6.45pm. Later he will take part at the beginning of Pedda Sesha Vahana Seva. All the arrangements for brahmotsavams are almost over and we are ready for the big event.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీవారి సేవ చరిత్రలో నూతన అధ్యాయానికి నాంది
నూతన శ్రీవారి సేవా సదనాలను పరిశీలించిన టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు
సెప్టెంబరు 01, తిరుమల, 2018: తిరుమలలో నిర్మిస్తున్న శ్రీవారి సేవా సదనాల ద్వారా శ్రీవారిసేవ వ్యవస్థ చరిత్రలో నూతన అధ్యాయానికి నాంది పలికినట్లయిందని టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు తెలిపారు. శ్రీవారి సేవాసదనాల పనులను శనివారం వివిధ విభాగాల అధికారులతో కలిసి జెఈవో పరిశీలించారు.
ఈ సందర్భంగా జెఈవో మీడియాతో మాట్లాడుతూ మహిళలకు, పురుషులకు ప్రత్యేకంగా నిర్మించిన శ్రీవారి సేవా సదన్ భవనాలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. గడిచిన 17 సంవత్సరాలుగా శ్రీవారి సేవ వ్యవస్థ ఎదుగుతోందని, ప్రస్తుతం సాధారణ రోజుల్లో 2 వేల మంది, పర్వదినాల్లో 4 వేల మంది శ్రీవారి సేవకులు భక్తులకు సేవలందిస్తున్నారని వివరించారు. శ్రీవారి సేవ వ్యవస్థ ప్రపంచధార్మిక పటం మీద ప్రత్యేకస్థానాన్ని పొందగలిగే అవకాశముందన్నారు. దాదాపు రూ.100 కోట్ల వ్యయంతో ఈ రెండు భవనాలను మూడు అంతస్తుల్లో నిర్మించినట్టు వెల్లడించారు. ఒక్కో భవనంలో 16 హాళ్లు, 2 డైనింగ్ హాళ్లు ఉన్నాయని, అన్నప్రసాద భవనం నుండి అన్నపానీయాలు తీసుకొచ్చి ఇక్కడ భోజనశాలలో వడ్డిస్తారని చెప్పారు.
శ్రీవారి సేవకులకు సౌకర్యవంతంగా ఉండేందుకు మంచాలు, వేడినీటి సదుపాయం కల్పించామని జెఈవో తెలిపారు. ఇక్కడ ఆధ్యాత్మిక వాతావరణం ఉండేలా భక్తిసంగీతం వినిపిస్తామని, ఈ పరిసరాలు ఆహ్లాదంగా ఉండేలా చుట్టూ పచ్చికబయళ్లు పెంచుతున్నామని వివరించారు. భద్రతను పర్యవేక్షించేందుకు పురుషుల సేవా సదన్‌లో సిసిటివి కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. తిరుమలలో వివిధ ప్రాంతాల్లో సేవలందించేందుకు ఈ భవనాలు అనుకూలంగా ఉంటాయి. భవిష్యత్తులో యువకులు, విద్యావంతులు ప్రేరణ పొంది శ్రీవారి సేవకు వస్తారని జెఈవో విశ్వాసం వ్యక్తం చేశారు.
సెప్టెంబరు 13న గౌ|| ముఖ్యమంత్రి పట్టువస్త్రాల సమర్పణ :
రాష్ట్ర ముఖ్యమంత్రి గౌ|| శ్రీ నారా చంద్రబాబునాయుడు సెప్టెంబరు 13న ధ్వజారోహణం నాడు సాయంత్రం 6.45 గంటలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని జెఈవో తెలిపారు. ముందుగా శ్రీ బేడి ఆంజనేయస్వామివారి ఆలయం వద్దకు చేరుకుంటారని, అక్కడి నుండి ఉరేగింపుగా శ్రీవారి ఆలయానికి వెళతారని చెప్పారు. పట్టువస్త్రాల సమర్పణ అనంతరం పెద్దశేష వాహనసేవలో పాల్గొంటారని తెలిపారు.
బ్రహ్మోత్సవాల్లో భక్తులు సంతృప్తికరంగా వాహనసేవలను దర్శించుకునేలా ఏర్పాట్లు పూర్తి చేశామని జెఈవో తెలిపారు. ఈ సారి మాడ వీధుల్లో రెండు చోట్ల గ్యాలరీల సామర్థ్యం పెంచామన్నారు. రూ.28 కోట్లతో తిరుమలలో ఉన్న మరుగుదొడ్ల సంఖ్యను రెట్టింపు చేసేందుకు పనులు జరుగుతున్నాయని, ఈ బ్రహ్మూెత్సవాలకు మాడ వీధులు, ఫిల్టర్ హౌస్ సర్కిల్ నుండి అన్నప్రసాద భవనం వరకు అదనపు మరుగుదొడ్లను వినియోగంలోకి తెస్తామని వెల్లడించారు.
ఈ తనిఖీల్లో టిటిడి ఇన్‌చార్జి సివిఎస్‌వో శ్రీ శివకుమార్‌రెడ్డి, ఎస్‌ఇ-2 శ్రీరామచంద్రారెడ్డి, ఎస్‌ఇ(ఎలక్ట్రికల్స్) శ్రీ వేంకటేశ్వర్లు, క్యాటరింగ్ అధికారి శ్రీ శాస్త్రి ఇతర అధికారులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.