ASTABANDHANA JEERNODHARANA MAHA SAMPROKSHANAM IN APPALAYAGUNTA FROM SEPTEMBER 2 TO 6_ శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయ అష్టబంధన జీర్ణోద్ధారణ మహాసంప్రోక్షణకు శాస్త్రోక్తంగా అంకురార్పణ
ANKURARPANAM OBSERVED ON SATURDAY
Appalayagunta, 1 September 2018: Ankurarpanam for Astabandhana Jeernodharana Maha Samprokshanam was observed in the famous temple of Sri Prasanna Venkateswara Swamy temple at Appalayagunta, on Saturday evening.
The Jeernodharana Maha Samprokshanam will be observed in the temple from September 2 to 6.
It may be mentioned here that the renovation works commenced in the temple on August 6 after setting up Daru Vigraham of the main deity. The sanctum sanctorum ia closed since then and will be opened only after observing Purnahuti on September 6 by 7am.
Meanwhile from September 2 to 5 religious events will be observed in Yagashala which includes Ksheeradhivasam, Jaladhivasam, Kalapakarshana, Sarva Devataradhana etc.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయ అష్టబంధన జీర్ణోద్ధారణ మహాసంప్రోక్షణకు శాస్త్రోక్తంగా అంకురార్పణ
సెప్టెంబరు 01, తిరుపతి, 2018: టిటిడికి అనుబంధంగా ఉన్న అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయ అష్టబంధన జీర్ణోద్ధారణ మహాసంప్రోక్షణకు శనివారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. సాయంత్రం 6.30 నుండి రాత్రి 8 గంటల వరకు మేదినిపూజ, సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణ కార్యక్రమాలు నిర్వహించారు.
ఆలయంలో ఆగస్టు 6వ తేదీ నుండి నెల రోజుల పాటు శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి గర్భాలయం, ద్వారపాలకులు, గరుడాళ్వారు, ఆళ్వార్లు, ధ్వజస్తంభం, శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, శ్రీ ఆండాళ్ అమ్మవారి ఆలయం, శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామివారి ఆలయాలలో జీర్ణోద్ధారణ (ఆధునీకరణ పనులు) చేపట్టారు. అనంతరం సెప్టెంబరు 2వ తేదీ ఆదివారం నుండి 6వ తేదీ వరకు వైఖానస ఆగమోక్తంగా అష్టబంధన జీర్ణోద్ధారణ మహాసంప్రోక్షణ కార్యక్రమాలు జరుగనున్నాయి. టిటిడి ఆగమసలహాదారు శ్రీ సుందరవరదన్ పర్యవేక్షణలో కంకణబట్టర్ శ్రీసూర్యకుమారాచార్యులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారు. మొత్తం 30 మంది వేద పండితులు పాల్గొంటారు.
ఇందులో భాగంగా సెప్టెంబరు 2న కళాపకర్షణం, సెప్టెంబరు 3న అష్టబంధనం, సెప్టెంబరు 4న క్షీరాధివాసం, జలాధివాసం, వివిధ హోమాలు, సెప్టెంబరు 5న మహాశాంతి అభిషేకం నిర్వహిస్తారు. సెప్టెంబరు 6న ఉదయం 7 గంటలకు మహాపూర్ణాహుతి, ఉదయం 7.50 నుండి 8.30 గంటల వరకు మహాసంప్రోక్షణం కార్యక్రమాలు ఆగమోక్తంగా నిర్వహిస్తారు. అనంతరం రాత్రి 7 నుండి 8 గంటల వరకు పెద్దశేష వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.