SRIVARI SILVER DOLLARS AND CITATIONS TO 30 OFFICERS & 219 TTD EMPLOYEES _ 30 మంది అధికారులు, 219 మంది ఉద్యోగులకు శ్రీవారి వెండి డాలర్, ప్రశంసాపత్రం
* 76th INDEPENDENCE DAY CELEBRATIONS IN TTD
* ATTRACTIVE HORSE DISPLAYS AND CULTURAL ACTIVITIES
Tirupati,15, August,2023: The 76th Independence Day celebrations were held at the parade grounds with flag hoisting by TTD chairman Sri Bhumana Karunakar Reddy and guard of honour presented b the TTD vigilance corps led by Parade commander Sri K Shailendra Babu.
After the Chairman’s speech, 30 TTD officials and 219 TTD employees including 7 SVBC were presented with Srivari silver dollars and certificates for their meritorious services. Similarly, bright children of TTD employees 26 ( inter ) and 32 (SSLC) of TTD were given cash awards of ₹2116 and ₹1115 respectively.
The dog show by Vigilance and the horse show by NCC students of SV Arts College were thrilling. While dogs put up bouquet handing, fire jump, high jump etc the riding stunts by Horses Mapel Goodluck, Oliver and Rani Jhansi earned wows from citizens of Tirupati.
ATTRACTIVE CULTURAL SHOW
The students of SV music and dance college presented devotional and patriotic songs and dances and the compère was the S Padmavati degree college teacher Dr V Krishnaveni.
TTD EO Sri AV Dharma Reddy’s, JEOs Smt Sada Bhargavi and Sri Veerabrahmam, DLO Sri Veeraju, CE Sri Nageswar Rao, FA and CAO Sri OBalaji, AdditionalCVSO Sri Shivkumar Reddy, SVBC CEO Sri Shanmugha Kumar, CAO Sri Shailendra and heads f all other departments and employees were present.
ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
టీటీడీ పరిపాలనా భవనంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవం
– 30 మంది అధికారులు, 219 మంది ఉద్యోగులకు శ్రీవారి వెండి డాలర్, ప్రశంసాపత్రం
– ఆకట్టుకున్న అశ్వ విన్యాసాలు, సాంస్కృతిక ప్రదర్శనలు
తిరుపతి, 2023 ఆగస్టు 15: తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలో భారత స్వాతంత్ర్య వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. ఇక్కడి పరేడ్ మైదానంలో టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేసి వందనం చేశారు. భద్రతా సిబ్బంది నుండి గౌరవ వందనం స్వీకరించారు.
ఈ సందర్భంగా టీటీడీ భద్రతా సిబ్బంది చేసిన కవాతు ఆకట్టుకుంది. ఎవిఎస్‌వో శ్రీ కె.శైలేంద్రబాబు పెరేడ్ కమాండర్‌గా వ్యవహరించారు. అనంతరం టీటీడీ ఛైర్మన్ ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ తరువాత విధుల్లో ఉత్తమసేవలు అందించిన వివిధ విభాగాలకు చెందిన 30 మంది అధికారులు, 219 మంది ఉద్యోగులకు, ఎస్వీబీసీలో ఏడుగురు ఉద్యోగులకు ఐదు గ్రాముల శ్రీవారి వెండి డాలర్, ప్రశంసాపత్రం అందజేశారు. అదేవిధంగా ఉద్యోగుల పిల్లలకు సంబంధించి ఇంటర్లో ప్రతిభ కనబరిచిన 26 మంది విద్యార్థులకు 2,116/-, 10వ తరగతిలో ప్రతిభ కనబరిచిన 32 మంది విద్యార్థులకు 1,116/- నగదు బహుమతులు అందజేశారు.
టీటీడీ నిఘా మరియు భద్రత విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన జాగిలాల ప్రదర్శన ఆకర్షణగా నిలిచింది. జాగిలం బొకే అందించడం, ఫైర్ జంప్, హై జంప్ విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఎస్వీ ఆర్ట్స్ కళాశాల ఎన్.సి.సి విద్యార్థుల అశ్వ విన్యాసాలు అలరించాయి. మాపెల్, గుడ్ లక్, అలీవర్, రాణీ ఝాన్సీ పేర్లు గల అశ్వాల రైడింగ్, హైజంప్ ఆకట్టుకున్నాయి.
ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఎస్వీ సంగీత, నృత్య కళాశాల విద్యార్థినులు “భరతఖండమే నా దేశం…..”, ” వందేత్వం భూదేవి…”, “తంబూరి మీటెదవా…..” తదితర దేశభక్తి, ఆధ్యాత్మిక గీతాలకు చక్కటి నృత్యం ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి శ్రీ పద్మావతి డిగ్రీ కళాశాల అధ్యాపకురాలు డా|| వి.కృష్ణవేణి వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
స్వాతంత్ర్య వేడుకల్లో ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి, జెఈవోలు శ్రీమతి సదా భార్గవి, శ్రీ వీరబ్రహ్మం, ఎస్వీ బీసీ సిఈవో శ్రీ షణ్ముఖ్ కుమార్, సిఏఓ శ్రీ శేషశైలేంద్ర, డిఎల్ వో
శ్రీ వీర్రాజు, ఎఫ్ఏ అండ్ సిఏఓ శ్రీ బాలాజి, సిఈ శ్రీ నాగేశ్వరరావు, అదనపు సివిఎస్వో శ్రీ శివ కుమార్ రెడ్డి అన్ని విభాగాల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.