SRIVARI TEMPLE FOR NORTH DEVOTEES-TTD CHAIRMAN _ ఉత్తరాది భక్తుల కోసం ప్రయాగ్ రాజ్ లో శ్రీవారి నమూనా ఆలయం

Tirumala, 20 January 2025: All devotees should take advantage of this opportunity as TTD has set the model temple of Srivaru has at Maha Kumbha Mela in Prayag Raj, especially for the devotees of the North, said TTD Chairman Sri B.R. Naidu.

Earlier, on his arrival to the temple on Monday morning, the HDPP Secretary Sri Sriram Raghunath and Deputy EO Sri Guna Bhushan Reddy welcomed him.  

After darshan, Thirtha Prasadams were given.  Later under the supervision of Sri Venugopala Deekshitulu, one of the chief priests of Srivari Temple performed Chaturveda Havanam and performed pooja.

Speaking on the occasion, the Chairman said that he was happy to set up a model temple of Srivaru in the Maha Kumbha Mela at Prayag Raj which is held for 45 days from January 13 to February 26 from Sankranti to Shivratri.  

He also said 250 staff have been deputed in Prayagraj and congratulated the officials of Hindu Dharma Prachara Parishad for making elaborate arrangements for Dharmic propagation in the North.  

All the devotees of the North are requested to take advantage of this opportunity visiting the Srivari Temple and beget His divine blessings, he added.

He also said, that it is for the first time silk clothes were presented to Sri Ram in Ayodhya on behalf of TTD, and on this occasion, a large number of devotees came to the Snapana Thirumanjanam program which was grandly organized by TTD on the banks of Sarayu river.

AEO Sri Prabhakar Reddy, Bokkasam in-charge Sri Gururaja Swamy and other officers participated in this program.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఉత్తరాది భక్తుల కోసం ప్రయాగ్ రాజ్ లో శ్రీవారి నమూనా ఆలయం

భక్తులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి

అయోధ్యలో స్నపన తిరుమంజనానికి విశేష స్పందన

ప్రయాగ్ రాజ్ లో టీటీడీ చైర్మన్ శ్రీ బి.ఆర్.నాయుడు

తిరుమల, 2025 జనవరి 20: ఉత్తరాది భక్తుల కోసం ప్రయాగ్ రాజ్ లో మహా కుంభ మేళా సందర్భంగా శ్రీవారి నమూనా ఆలయం ఏర్పాటు చేసినట్లు టీటీడీ చైర్మన్ శ్రీ బి.ఆర్.నాయుడు తెలియజేశారు. ప్రయాగ్ రాజ్ లోని శ్రీవారి నమూనా ఆలయాన్ని టీటీడీ చైర్మన్ శ్రీ బి.ఆర్. నాయుడు దంపతులు సోమవారం సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు.

ఆయనకు హెచ్ డీపీపీ సెక్రెటరీ శ్రీ శ్రీరామ్ రఘునాథ్, డిప్యూటీ ఈవో శ్రీ గుణ భూషణ్ రెడ్డి, స్వాగతం పలికారు. దర్శనానంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆయన ఆలయ ప్రాంగణంలో శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ వేణుగోపాల దీక్షితులు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చతుర్వేద హవనంలో పాల్గొని పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనవరి 13 నుండి ఫిబ్రవరి 26వ తేది సంక్రాంతి నుండి శివరాత్రి వరకు 45 రోజుల పాటు జరుగుతున్న ప్రయాగ్ రాజ్ లోని మహా కుంభ మేళాలో శ్రీవారి నమూనా ఆలయం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని అన్నారు. 250 మంది టీటీడీ సిబ్బంది డిప్యూటేషన్ పై శ్రీవారి నమూనా ఆలయంలో విధులు నిర్వహిస్తున్నారు. ఉత్తరాదిలో ధర్మ ప్రచారం కోసం చక్కటి ఏర్పాట్లు చేసిన హిందూ ధర్మ ప్రచార పరిషత్ అధికారులకు అభినందనలు తెలిపారు. ఉత్తరాది భక్తులందరూ శ్రీవారిని నమూనా ఆలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకునే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

అయోధ్య శ్రీరాముడికి టీటీడీ తరఫున తొలిసారిగా పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగిందని, ఈ సందర్భంగా సరయూ నదీ తీరంలో స్వామివారికి వైభవంగా నిర్వహించిన స్నపన తిరుమంజనం కార్యక్రమానికి విశేష సంఖ్యలో భక్తులు తరలి వచ్చారని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ఏఈవో శ్రీ ప్రభాకర్ రెడ్డి, బొక్కసం ఇన్ ఛార్జ్ శ్రీ గురురాజ స్వామి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడినది.