STRIVE TO MAKE SVIMS THE BEST HOSPITAL IN THE ENTIRE COUNTRY _ స్విమ్స్ ను దేశంలోని అత్యుత్తమ ఆసుపత్రుల్లో ఒకటిగా తయారు చేయాలి – టీటీడీ ఈవో శ్రీ ఎ వి ధర్మారెడ్డి

EARN PATIENTS CONFIDENCE IN THE HOSPITAL- TTD EO

 LAUDS THE DEDICATED SERVICES OF DR SRINATH REDDY AND HIS TEAM IN PAEDIATRIC HOSPITAL

 Tirupati, 25 July 2022: TTD EO Sri AV Dharma Reddy exhorted the doctors and medical staff of SVIMS to endeavour to make the super speciality hospital as the best medical institution for treatment and research in the entire country.

Addressing the doctors of SVIMS at Sri Padmavati Auditorium the TTD EO asserted that TTD had promoted all sophisticated medical infrastructure and doctors should make all efforts to win the confidence of the patients who could afford to pay for medical services. He observed that in excepting Arogyasree patients, the hospital is unable to attract the affordable section for treatment.

He said SVIMS doctors had unique skills and there are 30 payment rooms with modern facilities which are not available even in corporate hospitals but only16% of rooms were occupied in the last six months.

He said the image of TTD institution should grow to a level of patients directly seeking services on par with the demand.

Recalling the services of TTD hospitals during Covid pandemic, he said only through track record of friendly behaviour with patients, quality treatment and 100% success rates, SVIMS can win the credibility of the affordable section to prefer the hospital for treatment.

He said at BIRRD Hospital besides facilities, and quality of treatment have been improved and as a result the there are no vacancies in the 36 payment rooms and now we are getting recommendations for allotment of rooms, he added.

“All these developments are due to quality and dedicated services by doctors and an friendly atmosphere”, he maintained.

He also lauded the commitment and dedication of Dr Srinath Reddy, the Director of Sri Padmavati Hrudayalaya for carrying out 500 successful surgeries in the last six months of its inception with their seamless efforts.

He appealed that a similar environment of quality treatment and friendliness be created at the SVIMS as well to attract patients who opt for corporate hospitals like Apollo and others.

TTD JEOs Smt Sada Bhargavi and Sri Veerabrahmam, FA& CAO Sri Balaji, SVIMS Director Dr Vengamma, Medical Superintendent Dr Ram and other doctors were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUMALA

స్విమ్స్ ను దేశంలోని అత్యుత్తమ ఆసుపత్రుల్లో ఒకటిగా తయారు చేయాలి- టీటీడీ ఈవో శ్రీ ఎ వి ధర్మారెడ్డి

తిరుపతి 25 జూలై 2022: స్విమ్స్ ఆసుపత్రిని దేశంలో అత్యుత్తమమైన ఆసుపత్రుల్లో ఒకటిగా తీర్చిదిద్దాలని టీటీడీ ఈవో శ్రీ ఎ వి ధర్మారెడ్డి డాక్టర్లకు పిలుపునిచ్చారు. ఇందుకోసం టీటీడీ అవసరమైన సదుపాయాలు కల్పిస్తుందని, బిల్లు చెల్లించి సర్జరీలు, ఇతర వైద్య సేవలు పొందగలిగే శక్తి ఉన్న రోగులు స్విమ్స్ వచ్చేలా వైద్య సేవలు ఉండాలని కోరారు.

స్విమ్స్ ఆసుపత్రిలోని శ్రీ పద్మావతి ఆడిటోరియంలో సోమవారం సాయంత్రం ఈవో డాక్టర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్విమ్స్ లో ఎయిమ్స్ తరహా సదుపాయాలు బ్రహ్మాండమైన అనుభవం కలిగిన డాక్టర్లు ఉన్నారన్నారు. కొన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో కూడా లేని విధంగా సదుపాయాలతో 30 పేయింగ్ రూమ్ లు నిర్మించామని, ఆరు నెలల్లో 16 శాతం మాత్రమే రోగులు ఈ గదులు పొందారని ఆయన తెలిపారు. రోగులు నేరుగా వచ్చి తమకు ఈ గదులు కావాలని, ఇక్కడ ఉండి వైద్యం చేయించుకుంటామని ఒత్తిడి చేసే స్థాయికి చేరాలని చెప్పారు. కోవిడ్ సమయంలో స్విమ్స్ లో బెడ్ ల కోసం ఎంత డిమాండ్ ఏర్పడిందో, అలాంటి పరిస్థితి స్విమ్స్ కు ఎప్పుడూ ఉండేలా చేయగలిగిన శక్తి డాక్టర్లకు మాత్రమే ఉందన్నారు. రోగుల పట్ల ప్రేమగా వ్యవహరించడం, మంచి ట్రీట్మెంట్ ఇవ్వడం, 100 శాతం సక్సెస్ రేట్ సాధించడం వల్లే ఇది సాధ్యం అవుతుందన్నారు.

బర్డ్ ఆసుపత్రిలో గత రెండేళ్ళుగా అనేక మార్పులు చేసి నాణ్యమైన వైద్యం అందిస్తున్నారని చెప్పారు.దీని వల్ల అక్కడ డబ్బులు చెల్లించి ఆపరేషన్లు చేయించుకోవడానికి కూడా రోగులు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని శ్రీ ధర్మారెడ్డి వివరించారు. బర్డ్ లో వసతులు పెంచి కార్పొరేట్ ఆసుపత్రుల కంటే మంచి వైద్యం అందిస్తున్నందువల్ల రోగుల్లో విశ్వసనీయత పెరిగిందని ఆయన తెలిపారు. అక్కడ ఉన్న 36 పేయింగ్ రూమ్ లు ఎప్పుడూ ఖాళీగా ఉండవని, గదుల కోసం సిఫారసులు వచ్చే పరిస్థితి ఏర్పడిందన్నారు. అక్కడ డాక్టర్ల బృందం అంకిత భావంతో సేవలు అందించడమే కారణమన్నారు. ఆరు నెలల క్రితం ప్రారంభించిన శ్రీ పద్మావతి హృదయాలయం లో 500 సర్జరీలు విజయవంతంగా చేసి దేశంలోనే అత్యుత్తమ ఆసుపత్రిగా పేరు సాధించారని ఈవో వెల్లడించారు. ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ రెడ్డి వారి బృందం అంకితభావం, నిబద్ధత ఇందుకు కారణమని ఈవో చెప్పారు.
సిమ్స్ వైద్యులు కూడా ఆసుపత్రి తమదిగా, రోగులను తమ బిడ్డలుగా భావించి ఉత్తమమైన వైద్య సేవలు అందిస్తే ఆసుపత్రిని దేశంలోని అత్యుత్తమ ఆసుపత్రుల్లో ఒకటిగా చేయడం కష్టం కాదన్నారు. రాబోయే ఆరు నెలల్లో అపోలో లాంటి ఆసుపత్రులకు వెళ్ళే రోగులు కూడా స్విమ్స్ కు వచ్చేలా చేయాలని ఆయన కోరారు.

జెఈవో లు శ్రీమతి సదా భార్గవి, శ్రీ వీర బ్రహ్మం, ఎఫ్ఎ సీఎవో శ్రీ బాలాజి, స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ వెంగమ్మ, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ తో పాటు పలువురు వైద్యులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.