“SUBHAPRADHAM” TO LEAD A MORAL LIFE-TTD CHAIRMAN _ విద్యార్థులకు నైతిక విలువలు నేర్పేందుకే శుభప్రదం : తితిదే పాలకమండలి అధ్యకక్షులు శ్రీ కనుమూరి బాపిరాజు

TIRUMALA, APRIL 8:   The “Subhapradham” summer training classes for the students aged between 15-17years is aimed to spruce up the children on how to lead a life of moral and ethical values by learning them the principles of ethics embedded in the Hindu Sanatana Dharma said, TTD Chairman Sri K Bapiraju.
 
Addressing the orientation programme for co-ordinators of Supadham at SVETA building in Tirupati on Monday, the Chairman called up on the co-ordinators to take a oath to train the children to take up the right path in their life which is not only useful for their self but for the good of the country. “Mere academics will not make a child a complete human being unless he or she is trained in moral values. Subhapradham which is the brain child of our EO Sri LV Subramanyam is a boon to the youth and the students should make use of these moral classes”, he maintained.
 
Earlier in his address, TTD EO Sri LV Subramanyam said, during the first phase of subhapradham last year, TTD organised the programme in only seven centres wherein about 3500 pupils have attended the moral  classes. This year the figure crossed five times with over 16000 students are expected to take part in this summer classes which are to be organised in 35 centres across 23 districts in the state from May 12 to May 18 which is a welcoming gesture”, he asserted. The EO also said, taking the inspiration from Subhapradham, the hon’ble President of Mauritius has expressed his willingness to organise Subhapradham programme in his country for his youth in the month of May (likely May 16) for which TTD will be supplying the Subhapradham booklets”, the EO maintained.
 
Tirupati JEO Sri P Venkatrami Reddy, CVSO Sri GVG Ashok Kumar, CE Sri Chandra Sekhar Reddy, former HDPP Secretary Sri K Venkat Reddy, OSD HDPP Sri S Raghunath and others were also present.
 
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
 
 

విద్యార్థులకు నైతిక విలువలు నేర్పేందుకే శుభప్రదం : తితిదే పాలకమండలి అధ్యకక్షులు శ్రీ కనుమూరి బాపిరాజు

తిరుపతి, ఏప్రిల్‌  08, 2013: భావి భారత పౌరులైన విద్యార్థులకు నైతిక, మానవీయ విలువలు నేర్పేందుకే శుభప్రదం పేరిట వేసవి శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్టు తితిదే పాలకమండలి అధ్యకక్షులు శ్రీ కనుమూరి బాపిరాజు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా శుభప్రదం శిక్షణ కేంద్రాల నిర్వహణపై తిరుపతిలోని శ్వేత భవనంలో సోమవారం అధికారులకు, బోధకులకు అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా తితిదే ఛైర్మన్‌ మాట్లాడుతూ మే 12 నుండి 18వ తేదీ వరకు నిర్వహించనున్న వేసవి శిక్షణ తరగతులను మహాయజ్ఞంగా భావించి విద్యార్థులను సమాజానికి ఉపయోగపడేలా తీర్చిదిద్దాలన్నారు. బోధకులు చిత్తశుద్ధితో తరగతులు నిర్వహించి స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. స్వామివారి సొమ్ముతో నిర్వహిస్తున్న ఈ తరగతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని, ధార్మిక సమాజ నిర్మాణానికి పాటు పడాలని పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా 23 జిల్లాల్లోని 35 కేంద్రాల్లో 16 వేల మంది విద్యార్థులు ఈ శిక్షణ తరగతుల్లో పాల్గొననున్నట్టు వివరించారు.

తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం ప్రసంగిస్తూ నైతిక విలువలు కరువవుతున్న నేటి సమాజంలో విద్యార్థులకు ఇలాంటి శిక్షణ తరగతుల ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. మన సంస్కృతి, సంప్రదాయాల్లో వస్తున్న మార్పులను దీటుగా ఎదుర్కోవడానికి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. బోధకులు స్ఫూర్తిదాయకమైన తమ అనుభవాలను విద్యార్థులతో పంచుకోవాలని, అప్పుడే ఈ కార్యక్రమం విజయవంతం అవుతుందని అన్నారు. మారిషస్‌లో మే 16వ తేదీన ఆ దేశాధ్యకక్షుడు శుభప్రదం కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని ఆయన తెలిపారు. ఇందుకోసం తితిదే తరపున బోధకులతోపాటు పుస్తక సామగ్రిని పంపుతున్నామన్నారు.  

ఈ కార్యక్రమంలో తితిదే తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ పి.వెంకట్రామిరెడ్డి, ముఖ్య నిఘా మరియు భద్రతాధికారి శ్రీ జివిజి.అశోక్‌కుమార్‌, చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీ చంథ్రేఖర్‌రెడ్డి,  హిందూ ధర్మ ప్రచార పరిషత్‌ పూర్వ కార్యదర్శి ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి, ప్రత్యేకాధికారి శ్రీ ఎస్‌.రఘునాధ్‌, అన్ని విభాగాల అధికారులు, శిక్షణ కేంద్రాల బాధ్యులు, బోధకులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.