SUBRAMANYA SWAMY HOMAM CONCLUDES AT SRI KT _ శ్రీ కపిలేశ్వరాలయంలో ముగిసిన శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారి హోమం

Tirupati, 20 Nov. 20: The Subramanya Swami Homam organised by TTD as part of a month long Karthikamasa Homa Mahotsavams at Sri Kapileswara Swamyi temple concluded on Friday.                         

The festivities began in the morning at yagashala with Homam, Maha Purnahuti, Kalasha Udwasana, and Abhisekam for Sri Subramanya Swamy, Kalashabhisekam, Nivedana and Harati.

Later in the evening Sri Navagraha Kalasha Sthapana, Homam, Laghu Purnahuti, Visesha Deeparadhana were also performed.

Thereafter the TTD has also conducted the Divya Kalyana Mahotsavam for utsava idols of Sri Valli Devasena sameta Sri Subramanya Swamy in Ekantham.

NAVAGRAHA HOMAM ON NOVEMBER 21

As part of ongoing Homa Mahotsavams the TTD plans to conduct Navagraha Homa on Saturday November 21 and Sri Kalabhairava Swamy Homa on Sunday at the temple.

Temple Deputy EO Sri Subramaniam, Superintendent Sri Bhupathi, temple inspector Sri Reddy Sekhar, temple Archakas and other officials were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI 

శ్రీ కపిలేశ్వరాలయంలో ముగిసిన శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారి హోమం

తిరుపతి, 2020 నవంబరు 20: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో శుక్ర‌వారం శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారి హోమం ముగిసింది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆలయంలో నెల రోజుల పాటు ఏకాంతంగా ప్ర‌త్యేక కార్య‌మాలు నిర్వహిస్తున్న విష‌యం విదిత‌మే.

ఇందులో భాగంగా యాగశాలలో ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పూజ, హోమం, మహాపూర్ణాహుతి, కలశ ఉద్వాసన, శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారికి మహాభిషేకం, కలశాభిషేకం, నివేదన, హారతి నిర్వహించారు. సాయంత్రం 6 నుండి 8 గంటల వరకు శ్రీ నవగ్రహ కలశస్థాపన, హోమం, లఘుపూర్ణాహుతి, విశేష దీపారాధన చేపట్టనున్నారు.

 శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారి స్కంద ష‌ష్ఠ ‌సందర్భంగా సాయంత్రం 5.30 నుండి 7 గంట‌ల వ‌ర‌కు శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి దివ్యకల్యాణ మహోత్సవం ఏకాంతంగా నిర్వ‌హిం‌చ‌నున్నారు.

నవంబరు 21న నవగ్రహ హోమం :

హోమ మహోత్సవాల్లో భాగంగా నవంబరు 21వ తేదీ శ‌నివారం నవగ్రహ హోమం జరుగనుంది. నవంబరు 22వ తేదీ ఆదివారం శ్రీ కాల‌భైర‌వ స్వామివారి హోమం నిర్వహించనున్నారు.

 ఈ కార్యక్రమంలో ఆలయాల ఉపకార్యనిర్వహణాధికారి శ్రీ సుబ్రమణ్యం, సూప‌రిండెంట్ శ్రీ భూప‌తి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ రెడ్డి శేఖ‌ర్‌, ఆలయ అర్చకులు, అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.