SUPRABHATA SEVA RESUMES _ శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ పునఃప్రారంభం
TIRUMALA, 15 JANUARY 2025: The Suprabhatam Seva resumed in Tirumala temple on Wednesday almost after a month.
Due to the auspicious Dhanurmasam which commenced on December 16 at 6:57am, Tiruppavai replaced Suprabhata Seva from December 17 onwards in Srivari temple.
With the completion of Dhanurmasam on January 14, the first and fore most awakening seva of Sri Venkateswara Swamy, the Suprabhata Seva resumed from January 15 onwards.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ పునఃప్రారంభం
తిరుమల, 2025 జనవరి 15: పవిత్రమైన ధనుర్మాసం మంగళవారం ముగియడంతో బుధవారం ఉదయం నుండి తిరుమల శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ పునఃప్రారంభమైంది.
గత ఏడాది డిసెంబరు 16వ తేదీ ఉదయం నుండి ధనుర్మాస ఘడియలు ప్రారంభం కావడంతో డిసెంబరు 17వ తేదీ నుండి శ్రీవారి ఆలయంలో సుప్రభాతం స్థానంలో గోదా తిరుప్పావై పారాయణం కొనసాగింది. అయితే జనవరి 14వ తేదీ ధనుర్మాస ఘడియలు పూర్తికావడంతో, జనవరి 15వ తేదీ నుండి యథాప్రకారం శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ పునః ప్రారంభమైంది.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.