SUPRABHATAM TO RESUME IN TIRUMALA TEMPLE _ జనవరి 15 నుండి శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ పునఃప్రారంభం
Tirumala, 14 Jan. 22: After almost a month-long break due to Dhanurmasam, Suprabhatam will resume in Tirumala temple from January 15 onwards.
It may be mentioned here that Tiruppavai has replaced Suprabhatam in Tirumala temple from December 17 onwards with the advent of Dhanurmasam on December 16 last.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
జనవరి 15 నుండి శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ పునఃప్రారంభం
తిరుమల, 2022 జనవరి 14: పవిత్రమైన ధనుర్మాసం జనవరి 14వ తేదీ శుక్రవారం ముగియనుండడంతో శనివారం నుండి తిరుమల శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ పునఃప్రారంభం కానుంది.
గత ఏడాది డిసెంబరు 16వ తేదీ నుంచి ధనుర్మాస ఘడియలు ప్రారంభం కావడంతో డిసెంబరు 17వ తేదీ నుంచి శ్రీవారి ఆలయంలో సుప్రభాతం స్థానంలో గోదా తిరుప్పావై పారాయణం కొనసాగింది. అయితే జనవరి 14వ తేదీ ధనుర్మాస ఘడియలు పూర్తికావడంతో, జనవరి 15వ తేదీ నుండి యథాప్రకారం శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ పునఃప్రారంభం కానున్నది.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.