DHANURMASA PARAYANAM CONCLUDED _ శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి మఠంలో ముగిసిన తిరుప్పావై పారాయణం
Tirumala, 14 Jan. 22: The month-long Dhanurmasa Pravachanam programme held at HH Sri Pedda Jeeyar mutt in Tirumala concluded on a grand note on Friday.
Renowned scholar Sri Narasimhan rendered the meaning for each Pasuram every day.
On the last day HH Sri Pedda Jeeyar Swamy blessed women devotees who have participated in Tiruppavai Pasura Parayanam with Goda Devi Sare and Prasadam.
SVBC telecasted the program every day between 8:30am and 9:30am for the sake of global devotees.
VISHNU SAHASRA NAMAM PARAYANAM COMMENCES
After the completion of Bhagavat Gita Parayanam which won global devout accolades, TTD commenced Vishnu Sahasranama Parayanam in Nada Neerajanam at Tirumala on Friday evening.
Scholars Sri Kuppa Narasimham will narrate the essence and Sri Raghavendra will render the shlokas. The program will be live telecasted in SVBC everyday between 6pm and 7pm.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి మఠంలో ముగిసిన తిరుప్పావై పారాయణం
తిరుమల, 2022 జనవరి 14: తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి మఠంలో గత ఏడాది 17వ తేదీ నుండి నిర్వహిస్తున్న తిరుప్పావై పారాయణం శుక్రవారం ఉదయం ముగిసింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తుల కోసం శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రతిరోజూ ఉదయం 8:30 నుండి 9:30 వరకు ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేసింది.
ప్రఖ్యాత పండితుడు శ్రీ నరసింహన్ ప్రతి రోజు ఒక్కో పాశురానికి అర్థాన్ని వివరించారు.
కాగా చివరి రోజు తిరుప్పావై పాసుర పారాయణంలో పాల్గొన్న మహిళా భక్తులకు గోదాదేవి సారె, ప్రసాదాలు అందించి శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ తిరుమల చిన్నజీయర్‌స్వామి, ఇతర పండితులు పాల్గొన్నారు.
తిరుమలలో విష్ణు సహస్ర నామ పారాయణం ప్రారంభం
ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల మన్ననలు పొందిన భగవద్గీతా పారాయణం ముగిసిన అనంతరం శుక్రవారం సాయంత్రం తిరుమలలో నాద నీరాజనం వేధికపై విష్ణు సహస్రనామ పారాయణాన్ని టిటిడి ప్రారంభించింది.
తిరుమల ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం శాస్త్ర పండితులు శ్రీ కుప్పా నరసింహ శర్మ ఫలశృతిని, శ్రీ రాఘవేంద్ర శ్లోక పారాయణం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రతిరోజూ సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్య శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.