SUPREME LORD TO COME UP IN AMARAVATHI IN NEXT TWO YEARS-HONOURABLE CM OF AP_ అమ‌రావ‌తిలో శ్రీ‌వారి ఆల‌యం మ‌న అదృష్టం

AMARAVATHI, 31 January 2019: The ultimate lord of Kaliyuga is Lord Venkateswara and the temple of the Supreme almighty is all set to come up in Amaravathi in the next couple of years, said Sri N Chandra Bahu Naidu, the Honourable CM of Andhra Pradesh.

The Honourable CM of the state took part in the Bhookarshanam and Beejaavapanam ceremony which took place in the auspicious Meena Lagnam between 9.15am to 9.40am in the village of Venkatapalem.

SPREADING VENKATESWARA BHAKTI CULT

After the ceremony the CM addressed the huge gathering of devotees comprising local devotees, Srivari Seva volunteers, Dasa artistes, Hindu Dharma Prachara troupes from across the state of AP. He said the temple of Sri Venkateswara Swamy in Venkatapalem will come up in next couple of years. The intention is to spread Venkateswara Bhakti cult across the country. Temples have already come in to existence in Kurukshetra, Kanya kumari and are in offing at Hyderabad, Kolkata, Bhubaneswar and also coming up in agency areas like Sitampeta, Parvathipuram, Rampachodavaram etc.I “Adding further he said, “I feel blessed for having performed Bhoomipooja for the capital city of Andhra Pradesh, Amaravathi and for taking part in Bhookarshanam for Sri Venkateswara temple today”, he maintained.

SRIVARI SEVAKULU SHOULD ACT THE TORCH BEARERS OF HINDU SANATANA DHARMA

Complimenting the services of Srivari sevakulu, the CM said, the volunteers are doing impeccable services at different places in Tirumala like in managing queue lines at Vaikuntham Complex, outside lines inside temple, at Anna prasadam complex, laddu counters, parakamani and at different places in Tirumala and Tirupati. So far 6.33 lakh srivari Sevakulu from Andhra Pradesh have rendered service in Srivari Seva since 2000. The sevakulu should take forward the Hindu Sanatana Dharma ahead in future by taking part in dharmic services. A twin building for srivari sevakulu at Rs.100crores was also constructed by TTD. He said that Bhajana artistes from HDPP, Dasa Sahitya projects of TTD are also doing spiritual services by reciting keerthanalu.

AMARAVATHI TEMPLE TO BE A PRESTIGIOUS ONE

The temple which is to come up in 25 acres of land in Amaravathi in the next two years at a cost of Rs.150 crores is going to be a prestigious one.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

అమ‌రావ‌తిలో శ్రీ‌వారి ఆల‌యం మ‌న అదృష్టం
ఆల‌య నిర్మాణానికి టిటిడికి ఉచితంగా 25 ఎక‌రాలు కేటాయింపు
రాష్ట్ర ముఖ్య‌మంత్రివ‌ర్యులు గౌ.. శ్రీ నారా చంద్ర‌బాబునాయుడు
ఆల‌య స్థలంలో వైభ‌వంగా భూక‌ర్ష‌ణం, బీజావాప‌నం

అమరావతి, 31 జనవరి 2019: ప్ర‌పంచానికి శాంతిని, సుభిక్షాన్ని ప్ర‌సాదించే దైవం శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివార‌ని, అలాంటి శ్రీ‌వారి ఆల‌యం అమ‌రావ‌తిలో నిర్మాణం కావ‌డం మ‌నంద‌రి అదృష్ట‌మ‌ని రాష్ట్ర ముఖ్య‌మంత్రివ‌ర్యులు గౌ.. శ్రీ నారా చంద్ర‌బాబునాయుడు ఉద్ఘాటించారు. ఈ సంద‌ర్భంగా ఆల‌య నిర్మాణానికి సిఆర్‌డిఏ నుండి 25 ఎక‌రాల స్థ‌లాన్ని టిటిడికి ఉచితంగా కేటాయిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. అమ‌రావ‌తిలోని వెంక‌ట‌పాళెంలో గురువారం నాడు గౌ.. ముఖ్య‌మంత్రి చేతుల‌మీదుగా శ్రీ‌వారి ఆల‌య నిర్మాణానికి ఆగ‌మోక్తంగా భూక‌ర్ష‌ణం, బీజావాప‌నం కార్య‌క్ర‌మాలు జ‌రిగాయి.

ఈ సంద‌ర్భంగా గౌ.. ముఖ్య‌మంత్రి మాట్లాడుతూ అమరావతి నేలలోనే ఏదో విశేషం ఉందని, అందుకే ఈ భూమి చరిత్రలో రెండుసార్లు రాజధానిగా నిలిచిందని తెలిపారు. క్రీ.శ 2వ శతాబ్దంలో శాతవాహనుల రాజధానిగా, ప్రపంచ ప్రఖ్యాత బౌద్ధారామంగా అమరావతి విరాజిల్లింద‌ని, ఇప్పుడు మరోసారి నవ్యాంధ్ర ప్రదేశ్ రాజధానిగా మారిందని వివ‌రించారు. ప్రజారాజధానిగా శంకుస్థాపన జరిగిన వేళ దేశం నలుమూలల్లోని దివ్య క్షేత్రాలు, పుణ్యతీర్ధాల నుంచి తెచ్చిన పవిత్రమైన మట్టి, జలాలతో ఈ నేల ఇప్పటికే పునీతమైంద‌ని, ఇప్పుడు ఒక మహా పుణ్యక్షేత్రమే కొలువుతీర‌డం శుభకరమ‌న్నారు. ఈ పవిత్రమైన దైవకార్యం త‌న‌ చేతుల మీదుగా జరగడం పూర్వ‌జ‌న్మ‌సుకృతమ‌న్నారు. త‌న చేతుల మీదుగా ప్రపంచస్థాయి రాజధాని నిర్మాణం జరపాలని ఆ దేవుడు సంకల్పించి ఉంటార‌ని, అందుకే 2003లో అలిపిరి ఘటనలో త‌న‌కు బోనస్ జీవితాన్ని ప్రసాదించార‌ని అన్నారు. నూత‌న రాజ‌ధానిలో కృష్ణా న‌ది తీరాన ఒక వైపు దుర్గ‌మ్మ‌, మ‌రోవైపు శ్రీ‌వారు ఉన్నార‌ని, ఈ ఇద్ద‌రి ఆశీస్సులతో రాష్ట్రం పురోభివృద్ధి సాధిస్తుంద‌ని పేర్కొన్నారు. శ్రీ‌వారి దివ్యాశీస్సుల‌తోపాటు ఆ ప్రాంతంలోని కూచిపూడి నృత్యాన్ని ప్ర‌పంచానికి అందించేందుకు కృషి జ‌రుగుతోంద‌న్నారు. రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు మెరుగైన సేవ‌లు అందించేందుకు, జీవ‌న‌ప్ర‌మాణాలు పెంచేందుకు శ‌క్తిని ఇవ్వాల‌న ప్ర‌తిరోజూ స్వామివారిని ప్రార్థిస్తున్నాన‌ని చెప్పారు. శ్రీ‌వారిని కొలిస్తే మాన‌సిక ప్ర‌శాంత‌త‌, ఆనందం చేకూరుతాయ‌న్నారు. భూకర్షణంలో భాగంగా ఆగమశాస్త్ర బద్ధంగా భూమిని దున్ని ధాన్యం చల్లుతారని, ధాన్యం మొలకలను గోవులు మేసిన తరువాత చదును చేసి ఆలయ నిర్మాణ ప‌నులు ప్రారంభిస్తారని వివ‌రించారు.

అమరావతిలో తిరుమల తిరుపతి దేవస్థానములు రూ.150 కోట్ల వ్యయంతో ఈ ఆలయ నిర్మాణాన్ని చేపట్టిందని, ఈ ఆలయ స్థలానికి స్టాంపు రుసుం, రిజిస్ట్రేషన్‌ రుసుం నుంచి పూర్తి మినహాయింపు ఇచ్చామ‌ని, త‌ద్వారా టిటిడికి కోటి రూపాయలకు పైగా ప్రయోజనం కలిగిందని గౌ.. ముఖ్య‌మంత్రి తెలియ‌జేశారు. ఈ స్థలంలో ఇప్పుడు జరుగుతున్న వైదిక కార్యక్రమాలన్నీ పూర్తయిన తరువాత ఫిబ్రవరి 10వ తేదీ నుంచి ఆలయ నిర్మాణ పనులు ప్రారంభం అవుతాయ‌న్నారు. రెండేళ్ల కాలంలో అంతర ప్రాకారం, బాహ్య ప్రాకారం, మహారాజ గోపురం, కల్యాణోత్సవ మండపం, ఉత్సవ మండపం, పుష్కరిణి, శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయం తదితర నిర్మాణాలన్నీ పూర్తవుతాయ‌ని తెలిపారు.

శ్రీవారి సేవ – స్వచ్ఛంద సేవ:

తిరుమలలో శ్రీవారి సేవ చేసేందుకు సామాన్యులకు గొప్ప అవకాశం కల్పించార‌ని, శ్రీవారి సేవ పేరుతో వినూత్న సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని కొనియాడారు. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్‌ నుంచి 6.33 లక్షల మంది, తెలంగాణ నుంచి 1.06 లక్షల మంది శ్రీవారి సేవకులు సేవలందించారని చెప్పారు. తిరుమలలో సాధారణ రోజుల్లో ప్రతిరోజూ 1500 మంది, పర్వదినాలలో నిత్యం మూడు వేల మంది శ్రీవారి సేవకులు సేవలు అందిస్తుండ‌డం సంతోష‌క‌ర‌మ‌న్నారు. శ్రీవారి ఆలయం, వైకుంఠ క్యూకాంప్లెక్స్‌, క్యూలైన్లు, కల్యాణకట్ట, అన్నప్రసాద భవనం, ఫుడ్‌ కౌంటర్లు, తిరునామధారణ తదితర విభాగాల్లో శ్రీవారి సేవకులు చ‌క్క‌గా భక్తులకు సేవలందిస్తున్నార‌ని, ఈ సంద‌ర్భంగా వారికి అభినంద‌న‌లు తెలియ‌జేశారు. డాక్ట‌ర్లు త‌దిత‌ర వృత్తి నిపుణులు కూడా తిరుమ‌ల‌లో భ‌క్తుల‌కు సేవ‌లందించాల‌ని కోరారు. శ్రీవారి సేవకుల కోసం తిరుమలలో దాదాపు రూ.100 కోట్లతో నూతన భవనం త్వరలో ప్రారంభం కానుందన్నారు.

హిందూ ధర్మ ప్రచార పరిషత్:

సనాతన ధర్మ పరిరక్షణ, పరివ్యాప్తి కోసం టిటిడి హిందూ ధర్మ ప్రచార పరిషత్‌ను ఏర్పాటుచేసింద‌ని, ఆంధ్రప్రదేశ్‌లో 86,925 మంది, తెలంగాణలో 26,670 మంది ఇందులో సభ్యులుగా ఉన్నారని తెలిపారు.

ఒంటిమిట్టలో రామాలయ అభివృద్ధి:

టిటిడి ఆధ్వర్యంలో కడప జిల్లా ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామాలయాన్ని అభివృద్ధి చేసేందుకు రూ.100 కోట్లతో మాస్టర్‌ప్లాన్‌ రూపొందించారని, ఇందులో రూ.60.65 కోట్లతో వివిధ రకాల అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయ‌ని వివ‌రించారు.

దేశంలో వివిధ నగరాల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణం:

హర్యానా రాష్ట్రం కురుక్షేత్రలో రూ.34.60 కోట్లతో, తమిళనాడులోని కన్యాకుమారిలో రూ.22.50 కోట్లతో శ్రీవారి ఆలయాలు నిర్మించార‌ని, హైదరాబాద్‌లో రూ.25 కోట్లతో నిర్మించిన శ్రీవారి ఆలయంలో మార్చి 13న విగ్రహ ప్రతిష్ఠ చేస్తున్నారని తెలిపారు. అదేవిధంగా, విశాఖపట్నంలో రూ.7.90 కోట్లతో, శ్రీకాకుళం జిల్లా సీతంపేట, విజయనగరం జిల్లా పార్వతీపురం, తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతాల్లో రూ.13.50 కోట్లతో శ్రీవారి ఆలయ నిర్మాణ పనులు జరుగుతున్నాయ‌న్నారు. చెన్నైలో రూ.5.75 కోట్లతో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ నిర్మాణం జరుగుతోందని తెలిపారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో రూ.7.5 కోట్లు వ్య‌యంతో నిర్మించ‌నున్న శ్రీవారి ఆలయ నిర్మాణానికి టెండ‌ర్లు పూర్త‌య్యాయ‌ని, కోల్‌కతాలో శ్రీవారి ఆలయాన్ని నిర్మించేందుకు ఓ దాత 3 ఎకరాల స్థలం ఇవ్వడానికి అంగీకరించారని వెల్ల‌డించారు.

ఈ కార్యక్రమంలో ఎపి శాసనసభ స్పీకర్ శ్రీ కోడెల శివప్రసాదరావు, రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పి.నారాయణ, శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు, శ్రీ‌మ‌తి ప‌రిటాల సునీత‌, శ్రీ దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు, శ్రీ సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి, శ్రీ జ‌వ‌హ‌ర్‌, శ్రీ సిద్ధా రాఘ‌వ‌రావు, టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్, ఈఓ శ్రీ అనిల్ కుమార్ సింఘాల్, ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీ రుద్రరాజు పద్మరాజు, శ్రీ పెద్దిరెడ్డి, శ్రీ ర‌మేష్‌బాబు, శ్రీ డొక్కా జ‌గ‌న్నాథం, శ్రీ బోండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు, శ్రీ బికె.పార్థ‌సార‌ధి, ప్రత్యేక ఆహ్వానితులు శ్రీ రాఘవేంద్రరావు, చిత్తూరు ఎమ్మెల్యే శ్రీ‌మ‌తి స‌త్య‌ప్ర‌భ‌, తిరుప‌తి ఎమ్మెల్యే శ్రీ‌మ‌తి సుగుణ‌మ్మ‌, టిటిడి తిరుమల జెఈఓ శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు, తిరుపతి జెఈఓ శ్రీ పోల భాస్కర్, సివిఎస్వో శ్రీ గోపీనాథ్ జెట్టి ఇతర అధికారులు పాల్గొన్నారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.