THOUSANDS WITNESS CELESTIAL WEDDING_ శ్రీ‌నివాస క‌ల్యాణంతో పుల‌కించిన భ‌క్తులు

PREMISES DON FESTIVE LOOK WITH SRIVARI SEVAKULU AND BHAJANA BRINDAMS

AMARAVATHI, 31 January 2019: The entire 25 acre premises which is earmarked to construct the temple of Sri Venkateswara Swamy temple in Venkatapalem of Tullur mandal on Guntur district donned festive look on Thursday.

Thousands of devotees including Srivari Sevakulu and Bhajana artistes of Dharma Prachara and Dasa Sahitya projects wearing orange colour and yellow colour dress code sarees thronged the premises from different parts of the state of Andhra Pradesh.

KALYANAM PERFORMED

After Bhookarshanam and Beejaavapanam programmes, Srinivasa Kalyanam was performed with utmost religious fervour.

After Vishwaksena Aradhana, Punyahavachanam, Ankurarpanam for the celestial marriage were performed by religious staffs amidst chanting of relevant hymns.

Later Agnipratistha, Kankanadharana, kanyadanam, Mangalydharana, Akshataropana, Varanamayiram, Harathi Nivedana were performed marking the divine wedding ceremony of Sri Bhi and Malayappa Swamy.

The devotees converged in large numbers and witnessed the event and later received mini laddu and anna prasadams.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI–

అమరావతిలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి ఆగ‌మోక్తంగా భూకర్షణం
శ్రీ‌నివాస క‌ల్యాణంతో పుల‌కించిన భ‌క్తులు
గోవింద‌నామ‌స్మ‌ర‌ణ‌తో మారుమోగిన ఆల‌యనిర్మాణ స్థ‌లం

అమరావతి, 31 జనవరి 2019: ఆంధ్రప్రదేశ్‌ నూతన రాజధాని అమరావతిలో శ్రీవారి నూతన ఆలయ నిర్మాణం కోసం గురువారం నాడు రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌ.. శ్రీ నారా చంద్ర‌బాబునాయుడు చేతుల‌మీదుగా ఆగ‌మోక్తంగా భూకర్షణం, బీజావాపనం కార్య‌క్ర‌మాలు జ‌రిగాయి. ఉదయం 9.15 నుండి 9.40 గంటల మధ్య మీనలగ్నంలో ఈ కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టారు. వేదిక వ‌ద్ద‌కు చేరుకున్న గౌ.. ముఖ్య‌మంత్రి ముందుగా ఆల‌య నిర్మాణ విశిష్ట‌త‌, మాస్ట‌ర్ ప్లాన్‌తో రూపొందించిన ప‌వ‌ర్‌పాయింట్ ప్ర‌జంటేష‌న్‌ను తిల‌కించారు. ఆల‌య నిర్మాణ న‌మూనాను సంద‌ర్శించారు.

ఈ సంద‌ర్భంగా ఉదయం చతుర్వేద పారాయణం, యాగశాల కార్యక్రమాలు జ‌రిగాయి. ఆ త‌రువాత గ‌ర్భాల‌య నిర్మాణ స్థ‌లం వ‌ద్ద‌ నాగ‌ళి పూజ‌, వృషభపూజలు చేప‌ట్టారు. గ‌ర్భాల‌య నిర్మాణ స్థ‌లంలో నాగ‌ళితో దున్ని మొల‌కెత్తిన న‌వ‌ధాన్యాల‌ను చ‌ల్లారు. ఆ త‌రువాత యాగ‌శాల‌లో పూర్ణాహుతి జ‌రిగింది. అనంత‌రం గౌ.. ముఖ్య‌మంత్రికి వేదాశీర్వ‌చ‌నం చేశారు. ఈ సంద‌ర్భంగా టిటిడి పెద్ద‌జీయ‌ర్‌స్వామి అనుగ్ర‌హ‌భాష‌ణం చేశారు. నిర్మాణం పూర్త‌యిన త‌రువాత శ్రీ‌వారి ఆల‌యం త‌ర‌హాలో ఇక్క‌డి ఆల‌యంలో సుప్ర‌భాతం నుండి ఏకాంత‌సేవ వ‌ర‌కు అన్ని కైంక‌ర్యాలు నిర్వ‌హిస్తామ‌న్నారు. ఆలయ ప్రాంగ‌ణంలో శ్రీ యోగ‌న‌ర‌సింహ‌స్వామి, శ్రీ విష్వ‌క్సేనులవారు, శ్రీ రామానుజాచార్యులు, శ్రీ బేడి ఆంజ‌నేయ‌స్వామివారి విగ్ర‌హాల‌ను ప్ర‌తిష్ఠిస్తామ‌న్నారు.

వైభ‌వంగా శ్రీ‌నివాస క‌ల్యాణం

భూకర్షణ, బీజావాపన కార్య‌క్ర‌మాల అనంత‌రం ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు శ్రీనివాస కల్యాణం వైభవంగా జ‌రిగింది. శ్రీ‌నివాస క‌ల్యాణాన్ని క‌ల్యాణాన్ని వీక్షించిన అమ‌రావ‌తి ప్ర‌జ‌లు త‌న్మ‌య‌త్వంతో పుల‌కించిపోయారు. భ‌క్తుల గోవింద‌నామ‌స్మ‌ర‌ణ‌తో ఆల‌య నిర్మాణ స్థ‌లం ప‌రిస‌రాలు మారుమోగాయి.

శ్రీ‌నివాస క‌ల్యాణంలో భాగంగా విష్వ‌క్సేనారాధ‌న‌, పుణ్యాహ‌వ‌చ‌నం, అంకురారోప‌ణ‌, ర‌క్షాబంధ‌నం – కంక‌ణ‌ధార‌ణ‌, అగ్నిప్ర‌తిష్ట‌, మ‌ధుప‌ర్కం, మ‌హాసంక‌ల్పం – గోత్ర‌నామాలు చెప్పుకోవ‌డం, క‌న్యాదానం, మాంగ‌ళ్య‌ధార‌ణ‌, హోమాలు, పూల‌మాల‌లు మార్చుకోవ‌డం, అక్ష‌తారోప‌ణం, నీరాజనం ఘ‌ట్టాల‌ను శాస్రోక్తంగా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా టిటిడి అన్న‌మాచార్య ప్రాజెక్టు క‌ళాకారులు ఆయా ఘ‌ట్టాల‌కు అనుగుణంగా అన్న‌మ‌య్య సంకీర్త‌న‌ల‌ను ర‌స‌ర‌మ్యంగా ఆల‌పించారు.

ఈ భూక‌ర్ష‌ణం కార్యక్రమానికి రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి 3 వేల మంది శ్రీవారిసేవకులు, దాస‌సాహిత్య ప్రాజెక్టు నుండి 5 వేల మంది భజన మండళ్ల సభ్యులు, హిందూ ధ‌ర్మప్ర‌చార ప‌రిష‌త్ నుండి 3500 మంది భ‌జ‌న‌మండ‌ళ్ల క‌ళాకారులు, అమ‌రావ‌తి చుట్టుప‌క్క‌ల ప్రాంతాల నుండి పెద్ద సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు. భ‌క్తులంద‌రూ భూక‌ర్ష‌ణ కార్య‌క్ర‌మాన్ని, శ్రీ‌నివాస క‌ల్యాణాన్ని తిల‌కించేలా ఎల్ఇడి డిస్‌ప్లే స్క్రీన్లు ఏర్పాటుచేశారు. టిటిడి ఇంజినీరింగ్ అధికారులు భారీ స‌భా ప్రాంగ‌ణాన్ని, హోమ వేదిక‌ను ఏర్పాటు చేశారు. విద్యుత్ అలంక‌ర‌ణ‌లు, పుష్పాలంక‌ర‌ణ‌లు ఆక‌ట్టుకున్నాయి.

భ‌క్తులంద‌రికీ అన్న‌ప్ర‌సాదాలు…

ఈ భూక‌ర్ష‌ణం కార్యక్రమానికి విచ్చేసిన భ‌క్తుల‌కు, శ్రీ‌వారి సేవ‌కుల‌కు, భ‌జ‌న మండ‌ళ్ల స‌భ్యుల‌కు, క‌ళాకారుల‌కు టిటిడి ఉచితంగా అన్న‌ప్ర‌సాదాలు అందించింది. సాంబార‌న్నం, పెరుగ‌న్నం త‌దిత‌ర అన్న‌ప్ర‌సాదాలు, చ‌ట్ని, సాంబారుతో క‌లిపి పొంగ‌ళి, ఉప్మా త‌దిత‌ర అల్పాహారం, తాగునీటి వ‌స‌తి క‌ల్పించారు.

ఫొటో ఎగ్జిబిష‌న్‌

టిటిడి ప్ర‌జాసంబంధాల విభాగం ఆధ్వ‌ర్యంలో ఏర్పాటుచేసిన ఫొటో ఎగ్జిబిష‌న్‌ను ఎక్కువ‌మంది భ‌క్తులు తిల‌కించారు. పెద్ద సైజుల్లో క‌నువిందు క‌లిగేలా స్వామివారి ఫొటోల‌ను ఏర్పాటు చేశారు. ఇందులో ఆనంద‌నిల‌యం, పంచ‌బేరాలు, అలిపిరి, శ్రీ‌వారి సేవ‌లు, టిటిడి ట్ర‌స్టులు, శ్రీ‌వారి సేవ‌కులు తదిత‌ర ఫొటోలున్నాయి. అదేవిధంగా టిటిడి వైద్య విభాగం ఆధ్వ‌ర్యంలో ఉచితంగా వైద్య శిబిరాన్ని ఏర్పాటుచేశారు.

ఈ కార్యక్రమంలో టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్, ఈఓ శ్రీ అనిల్ కుమార్ సింఘాల్, ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీ రుద్రరాజు పద్మరాజు, శ్రీ పెద్దిరెడ్డి, శ్రీ ర‌మేష్‌బాబు, శ్రీ డొక్కా జ‌గ‌న్నాథం, శ్రీ బోండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు, శ్రీ బికె.పార్థ‌సార‌ధి, ప్రత్యేక ఆహ్వానితులు శ్రీ రాఘవేంద్రరావు, టిటిడి తిరుమల జెఈఓ శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు, తిరుపతి జెఈఓ శ్రీ పోల భాస్కర్, సివిఎస్వో శ్రీ గోపీనాథ్ జెట్టి, చీఫ్ ఇంజినీర్ శ్రీ చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి, ఎస్ఇలు శ్రీ రాములు, శ్రీ వేంక‌టేశ్వ‌ర్లు, డిఎఫ్వో శ్రీ ఫ‌ణికుమార్ నాయుడు, ఎస్టేట్ అధికారి శ్రీ విజ‌య‌సార‌ధి, ర‌వాణా విభాగం జిఎం శ్రీ శేషారెడ్డి, అన్న‌ప్ర‌సాదం ప్ర‌త్యేకాధికారి శ్రీ వేణుగోపాల్‌, డెప్యూటీ ఈవో శ్రీ రాజేంద్రుడు, హిందూ ధ‌ర్మ‌ప్ర‌చార ప‌రిష‌త్ కార్య‌ద‌ర్శి డా..ర‌మ‌ణ‌ప్ర‌సాద్‌, దాస‌సాహిత్య ప్రాజెక్టు ప్ర‌త్యేకాధికారి శ్రీ ఆనంద‌తీర్థాచార్యులు, అన్న‌మాచార్య ప్రాజెక్టు డైరెక్ట‌ర్ ఆచార్య‌ బి.విశ్వ‌నాథ్‌ ఇతర అధికారులు పాల్గొన్నారు.

భూక‌ర్ష‌ణంలో ఉత్సాహంగా పాల్గొన్న శ్రీ‌వారి సేవ‌కులు, భ‌జ‌న‌మండ‌ళ్లు

అమ‌రావ‌తిలోని వెంక‌ట‌పాళెంలో శ్రీ‌వారి ఆల‌య నిర్మాణం కోసం గురువారం నాడు నిర్వ‌హించిన‌ భూక‌ర్ష‌ణం కార్య‌క్ర‌మంలో గుంటూరు, కృష్ణా జిల్లాల‌తో పాటు రాష్ట్రం న‌లుమూల‌ల నుండి శ్రీ‌వారి సేవ‌కులు, భ‌జ‌న‌మండ‌ళ్ల స‌భ్యులు, క‌ళాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. స‌భావేదిక వ‌ద్ద ఉద‌యం 5 గంట‌ల నుండి భ‌జ‌న‌లు, గోవింద‌నామాల‌తో మారుమోగించారు. ఈ కార్య‌క్ర‌మానికి విచ్చేసిన భ‌క్తులు కూడా వారితో గ‌ళం క‌లిపి త‌న్మ‌య‌త్వానికి లోన‌య్యారు.

గౌ.. ముఖ్య‌మంత్రివ‌ర్యులు త‌మ ప్ర‌సంగంలో శ్రీ‌వారి సేవ‌కుల సేవ‌ల‌ను ప్ర‌త్యేకంగా కొనియాడారు. డాక్ట‌ర్లు త‌దిత‌ర వృత్తి నిపుణులతోపాటు మ‌రింత మంది టిటిడిలో శ్రీ‌వారి సేవ‌కు రావాల‌ని పిలుపునిచ్చారు. గౌ.. ముఖ్య‌మంత్రి ప్ర‌సంగంపై శ్రీ‌వారి సేవ‌కులు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. కాగా, టిటిడిలో 2000వ సంవ‌త్స‌రంలో ప్రారంభ‌మైన శ్రీ‌వారి సేవ‌లో ఇప్ప‌టివ‌ర‌కు దేశంలోని 18 రాష్ట్రాల నుండి 10 ల‌క్ష‌ల మందికిపైగా శ్రీ‌వారి సేవకులు సేవ‌లందించారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి 6.33 లక్షల మంది, తెలంగాణ నుంచి 1.06 లక్షల మంది శ్రీవారి సేవకులు ఉన్నారు. తిరుమలలో సాధారణ రోజుల్లో ప్రతిరోజూ 1500 మంది, పర్వదినాలలో నిత్యం మూడు వేల మంది శ్రీవారి సేవకులు సేవలు అందిస్తున్నారు. శ్రీవారి ఆలయం, వైకుంఠ క్యూకాంప్లెక్స్‌, క్యూలైన్లు, కల్యాణకట్ట, అన్నప్రసాద భవనం, ఫుడ్‌ కౌంటర్లు, తిరునామధారణ తదితర విభాగాల్లో శ్రీవారి సేవకులు చ‌క్క‌గా భక్తులకు సేవలందిస్తున్నారు. శ్రీవారి సేవకుల కోసం తిరుమలలో దాదాపు రూ.100 కోట్లతో నూతన భవనం త్వరలో ప్రారంభం కానుంది.

కాగా, సనాతన ధర్మ పరిరక్షణ, పరివ్యాప్తి కోసం టిటిడి హిందూ ధర్మ ప్రచార పరిషత్‌ను ఏర్పాటుచేసింది. ఆంధ్రప్రదేశ్‌లో 86,925 మంది, తెలంగాణలో 26,670 మంది ఇందులో సభ్యులుగా ఉన్నారు. ఈ భూక‌ర్ష‌ణం కార్యక్రమానికి రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి 3 వేల మంది శ్రీవారిసేవకులు, దాస‌సాహిత్య ప్రాజెక్టు నుండి 5 వేల మంది భజన మండళ్ల సభ్యులు, హిందూ ధ‌ర్మప్ర‌చార ప‌రిష‌త్ నుండి 3500 మంది భ‌జ‌న‌మండ‌ళ్ల క‌ళాకారులు, అమ‌రావ‌తి చుట్టుప‌క్క‌ల ప్రాంతాల నుండి పెద్ద సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.