SURPRISE INSPECTION BY EO ALONG WITH FSSAI TEAM TO A HOTEL _ శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తుల ఆరోగ్య భద్రతకు టీటీడీ పెద్దపీట

PUTRID VEGGIES AND GROCERIES IDENTIFIED

EO WARNS STERN ACTION AGAINST THE HOTEL FOR DEVIATING FOOD SAFETY NORMS

MORE RANDOM RAIDS – FSSAI CHIEF

TIRUMALA, 18 JULY 2024: TTD EO Sri J Syamala Rao along with the Food Safety and Standards Authority of India(FSSAI) team did a surprise inspection to Balaji Bhavan Hotel located near Koustubham Rest House in Tirumala on Thursday.

The EO and FSSAI Director of AP Sri Purnachandra Rao verified the storage, cleaning, and food processing methods being carried out in the hotel. They found that most of the vegetables including potatoes, cauliflower and some groceries are putrid and become mouldy. Even the hygiene and sanitation measures are found shabby. 

Later speaking to the media, the EO said following a series of emails and complaints from the pilgrims who stated that they had fallen ill after consuming food in the hotel, he along with the FSSAI team came for a surprise check to the hotel to find the facts. And the cooking and sanitation conditions prevailing in the hotel are horrible as the organisers of the Hotel have thrown into the wind the food safety norms in every area, he asserted.

The EO also said, that the health safety and security of the multitude of visiting pilgrims to Tirumala is one of the top most priorities of TTD. With an aim to provide them a hygienic and tasty food in all the eateries in Tirumala, more such raids will be carried out in future. If the hotels and eateries are found violating rules, stern action will be initiated against them”, he reiterated.

Putting his observations, the FSSAI AP Chief said, the Hotel has completely floated the Food Safety norms. He said, that during our checking, we identified that the hotel is using rotten, mouldy veggies, a day-old boiled food, Public Distribution System(PDS) rice, reused oil, taste enhancer and food colour which is also against our FSSAI norms. Adding further he said, the kitchen will be closed down immediately and after conducting a thorough probe, appropriate action will be taken against the hotel.

FOOD SAFETY ON WHEELS:

Later the EO along with the FSSAI Director flagged off a mobile Lab, “Food Safety on Wheels”. The unique vehicle has a lab with the necessary equipment to check the food and water quality. Eighty ingredients shall be checked for its quality in this mobile lab and this is completely dedicated to serve the purpose in Tirumala, Sri Purnachandra Rao added. 

SE 2 Sri Jagadeeshwar Reddy, Estates Officer Tirumala, Smt Vijaya Lakshmi, DE Electrical Sri Ravishankar Reddy, AEO Revenue Sri Chowdary, FSSAI officials were also present.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తుల ఆరోగ్య భద్రతకు టీటీడీ పెద్దపీట

•⁠ ⁠ఎఫ్‌ఎస్‌డి అధికారుల బృందంతో కలిసి హోటల్‌లను ఆకస్మికంగా తనిఖీ చేసిన
టీటీడీ ఈవో

– నాసిరకం కూరగాయలు మరియు ముడి సరుకుల గుర్తిపు

•⁠ ⁠ఆహార భద్రత నిబంధనలను ఉల్లంఘించిన హోటల్‌లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన – ఈవో శ్రీ జె.శ్యామలరావు.

-త్వరలో మరిన్ని తనిఖీలు ఎఫ్‌ఎస్‌డి- డైరెక్టర్

తిరుమల, 2024 జూలై 18: తిరుమలకు వచ్చే యాత్రికుల ఆరోగ్య భద్రతకు టీటీడీ పెద్దపీట వేస్తోందని ఈవో శ్రీ జె. శ్యామలరావు చెప్పారు. తిరుమలలోని కౌస్తుభం విశ్రాంతి భవనం సమీపంలో ఉన్న బాలాజీ భవన్ హోటల్‌ను ఫుడ్ సేఫ్టీ విభాగం (ఎఫ్‌ఎస్‌డి) అధికారుల బృందంతో కలిసి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా ఈవో, ఎఫ్‌ఎస్‌డి డైరెక్టర్ శ్రీ పూర్ణచంద్రరావుతో కలిసి హోటల్‌లో తయారు చేస్తున్న ఆహార పదార్థాలు, ముడి సరుకుల నిల్వ, శుభ్రపరచడం తదితర పద్ధతులను పరిశీలించారు. బంగాళదుంపలు, కాలీఫ్లవర్ మరియు కొన్ని కిరాణా సామాగ్రితో సహా చాలా కూరగాయలు కుళ్ళిపోయినట్లు వారు గుర్తించారు. పరిశుభ్రత, పారిశుద్ధ్య చర్యలు కూడా నాసిరకంగా ఉన్నాయన్నారు.

అనంతరం ఈవో మీడియాతో మాట్లాడుతూ, కొందరు శ్రీవారి భక్తులు తిరుమల హోటల్‌లో భోజనం చేసి అస్వస్థతకు గురయ్యారని, యాత్రికుల నుంచి వరుసగా వచ్చిన ఇ- మెయిల్‌ల ఫిర్యాదుల నేపథ్యంలో తాను ఎఫ్‌ఎస్‌డి బృందంతో కలిసి హోటల్‌ను ఆకస్మికంగా తనిఖీలు చేశామని చెప్పారు. హోటల్ నిర్వాహకులు ఆహార భద్రతా నిబంధనలను పాటించడం లేదని, అపరిశుభ్రత పరిస్థితుల మధ్య హోటల్‌లో ఆహార పదార్థాలు తయారు చేస్తున్నట్లు తెలిపారు.

తిరుమలలోని హోటల్‌ లు పరిశుభ్రమైన మరియు రుచికరమైన ఆహార ఆహారాన్ని అందించాలనే లక్ష్యంతో, భవిష్యత్తులో ఇలాంటి దాడులు మరిన్ని నిర్వహించనున్నట్లు తెలియజేశారు. హోటల్‌లోని తినుబండారాల తయారీలో నిబంధనలను ఉల్లంఘించినట్లు గుర్తిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని పునరుద్ఘాటించారు.

అనంతరం ఎఫ్‌ఎస్‌డి డైరెక్టర్ మాట్లాడుతూ, తనిఖీలలో ఈ హోటల్‌లో పూర్తిగా ఆహార భద్రతా నిబంధనలను పాటించనట్లు తెలిందన్నారు. హోటల్‌లో కుళ్ళిన కూరగాయలు, ముందు రోజు తయారు చేసిన ఆహారం, పలుమార్లు ఉపయోగించిన నూనె, ఎఫ్‌ఎస్‌డి నిబంధనలకు విరుద్ధమైన రంగు, రుచి పెంచే ముడి పదార్థాలను ఉపయోగిస్తున్నట్లు మా తనిఖీలో గుర్తించామని ఆయన చెప్పారు. ఇక్కడి వంటగదిని వెంటనే మూసివేస్తామని, క్షుణ్ణంగా విచారణ జరిపిన తర్వాత, హోటల్‌పై తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

మొబైల్ ల్యాబ్ ప్రారంభం:

అనంతరం ఎఫ్‌ఎస్‌డి డైరెక్టర్‌తో కలిసి ఈవో మొబైల్ ల్యాబ్, “ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్”ను ప్రారంభించారు. ప్రత్యేకమైన ఈ వాహనం ఆహారం మరియు నీటి నాణ్యతను తనిఖీ చేయడానికి అవసరమైన పరికరాలతో కూడిన ల్యాబ్‌ను కలిగి ఉంది. ఈ మొబైల్ ల్యాబ్‌లో 80 రకాల పదార్థాల నాణ్యతలను తనిఖీ చేస్తారు. దీనిని ప్రత్యేకంగా తిరుమలలో ఆహారం, నీరు నాణ్యత ప్రమాణాలను పరిశీలించేందుకు వినియోగిస్తారు.

ఈ తనిఖీల్లో ఎస్ఈ 2 శ్రీ జగదీశ్వర్ రెడ్డి, తిరుమల ఎస్టేట్స్ ఆఫీసర్ శ్రీమతి విజయ లక్ష్మి, డీఈ ఎలక్ట్రికల్ శ్రీ రవిశంకర్ రెడ్డి, ఏఈవో రెవెన్యూ శ్రీ చౌదరి ఉన్నారు. అదే విధంగా తిరుపతి జిల్లా ఫుడ్ కంట్రోలర్
శ్రీ వెంకటేశ్వరరావు, ఎన్టీఆర్ జిల్లా ఫుడ్ కంట్రోలర్ శ్రీ గౌస్ మొహియుద్దీన్ , పశ్చిమ గోదావరి జిల్లా ఫుడ్ కంట్రోలర్,. శ్రీ శ్రీనివాసరావు, తిరుమల ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ శ్రీ జగదీష్ పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.