CLEANLINESS IN TIRUMALA IS EVERYONE’S RESPONSIBILITY – TTD ADDITIONAL EO _ తిరుమల పరిశుభ్రత మనందరి బాధ్యత
తిరుమల పరిశుభ్రత మనందరి బాధ్యత
స్వచ్ఛాంధ్రా కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి
తిరుమల, 2025 మే 17: తిరుమల పరిశుభ్రత మనందరి బాధ్యత అని టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి అన్నారు. స్వచ్ఛాంధ్ర మిషన్ లో భాగంగా శనివారం తిరుమలలో స్ఛచ్ఛాంధ్ర-స్వచ్ఛ తిరుమల కార్యక్రమాన్ని స్థానిక బాలాజీ నగర్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అదనపు ఈవో తిరుమల స్థానికులకు పారిశుద్ధ్యం, పరిశుభ్రతపై అవగాహన కల్పించి వారి చేత స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతిరోజూ లక్షలాదిమంది విచ్చేసే తిరుమల క్షేత్రంలో పరిశుభ్రత కాపాడుకోవాల్సిన బాధ్యత స్థానికులపై ఉందన్నారు. స్థానికులు వ్యాపారం చేసే క్రమంలో స్వచ్ఛతకు తిలోదకాలు ఇవ్వకుండా భక్తులకు పరిశుభ్రమైన ఆహారం అందిచాలన్నారు. వేసవిలో తగిన జాగ్రత్తలు తీసుకుని భక్తులకు దుకాణాల వద్ద విరివిగా మంచినీరు అందించి పరోపకారం చేయాలన్నారు.
స్థానికులు పరిసరాల పట్ల అవగాహన పెంచుకోవాలని సూచించారు. టీటీడీ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలంటే స్థానికుల సహకారం తప్పనిసరి అని తెలిపారు. స్థానికులందరూ కూడా టీటీడీ మార్గదర్శకాలను పాటిస్తూ స్వచ్ఛ తిరుమలలో భాగస్వామ్యం కావాలని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో శ్రీ సోమన్ నారాయణ, సీపీఆర్వో డాక్టర్ టి.రవి, ఆరోగ్యాధికారి శ్రీ మధుసూదన్, వీజీవో శ్రీ సురేంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టిటిడి ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.
Tirumala, 17 May 2025: As part of the Swachh Andhra Mission, TTD Additional Executive Officer Sri Ch.Venkayya Chowdary stated that maintaining cleanliness in Tirumala is a shared responsibility.
On Saturday, he participated in the Swachh Andhra – Swachh Tirumala program conducted at Balaji Nagar in Tirumala.
During the event, the Additional EO raised awareness among the local residents on sanitation and cleanliness, and administered the Swachh Andhra pledge.
He emphasized that since lakhs of devotees visit Tirumala every day, it is the responsibility of the locals to ensure the area remains clean. He urged local shopkeepers to provide hygienic food to pilgrims without compromising on cleanliness, and to offer safe drinking water generously, especially during summer, as a service to devotees.
He further advised residents to develop awareness about their surroundings and noted that public cooperation is essential to strengthen the functioning of TTD. He appealed to all locals to follow TTD guidelines and take part in maintaining a Swachh Tirumala.
Deputy EO Health Sri Soman Narayana, CPRO Dr. T. Ravi, Health Officer Sri Madhusudan, VGO Sri Surendra, and other officials also participated in the program.
ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI