SWAMINI KALIJI’S TRIYOGA DRAWS HUGE CROWD _ స్వామినీ కాళీజీ యోగాకు విశేషస్పందన

TIRUPATI, DECEMBER 16:  The “Triyoga” style presented by internationally renowned Yoga Maestro, Swamini Kaliji has casted its magic in the temple city of Tirupati as thousands of Yoga-lovers are mused by the extraordinary performance.

 

The Education wing of the temple administration of Tirumala Tirupati Devasthanams(TTD) along with SV Yoga Kendra organised Triyoga, for the first time in Tirupati on Thursday. Addressing the inaugural session, Swamini Kaliji said, the concept of Triyoga manifest on all levels including physical, mental and spiritual. She said, the effects of performing this yoga will improve health, increase life energy, mental clarity, intuitive knowledge and offer blissful happiness. “The practice of Triyoga culminates in higher levels of awareness”, she added.

 

The renowned Yoga master said that Triyoga broadly means the realisation of Sat-Chit-Ananda(Sachidananda) which means Consciousness, Knowledge and Bliss-the universal trinity.  She said, Triyoga unites pranayama and mudra with dynamic and sustained Asana and the flow of energy is characterised by rhythmic pacing, relaxation in action, wake-like spine movements and economy of motion.

 

Addressing the occasion, TTD Educational Officer Sri Vidyaranya Swami said Swamini who founded Triyoga style aims at awakening the spontaneous flow of Prana(Life-Force) by joining postures, breath and with a series of energy-driven hand mudras. “TriYoga is complete method of yoga that includes the full spectrum of traditional yogic practice”, he added.

 

Later TTD PRO Sri T.Ravi in his address said, Baba Ramdev is a renowned figure in the country for Yoga. But with a noble intention to introduce a renowned person like Swamini, the TTD EO Sri IYR Krishna Rao has directed the officials to arrange this programme so that the denizens of Tirupati will become aware of Triyoga style also. He said Swamini has devoted her life to universal teachings of Triyoga and so far she has presented over 33 key note addresses in 31 countries across the world. Kaliji’s presence, her mastery of flow, and the ageless wisdom inherent in TriYoga have inspired and transformed countless lives across the globe. He said, being a disciple of Sri Mata Jaya Lakshmi and his holiness Sri Sri Ganapathi Sachidananda Swamy, Kaliji received the title of “Vishwa Bandhu” in recognition of her invaluable service in the field of Yoga across the universe. Apart from this, she was also honoured as one of the most inspirational women among the top 208 list in the prestigeous National portrait Gallery at London in England.

Later swamini performed Yoga Asanas and Yoga Hatha Mudras including Mayurasan, Sarvangasan, Chakrasan etc with much ease with out interruption for 15minutes and enthralled the specatators.

 

TTD special grade deputy EO (Services) Smt A.Surya Kumari, SV Yoga Kendra Principal Sri R.Subba Reddy, former principal Sri Ramakrishna Reddy, Yoga Tunes representative R.Ravi were also present.

 

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

 

స్వామినీ కాళీజీ యోగాకు విశేషస్పందన

తిరుపతి, 2010 డిశెంబర్‌-16: తితిదే విద్యావిభాగం ఆధ్వర్యంలో తొలిసారిగా ప్రఖ్యాత అంతర్జాతీయ యోగా గురువులు, స్వామినీ కాళీజీ గారిచే ”త్రియోగ” పై అవగాహన సదస్సు గురువారం నాడు తిరుపతిలోని త్యాగరాజ మండపంలో తితిదే విద్యావిభాగం-ఎస్‌.వి. యోగా కేంద్ర అధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి విశేష సంఖ్యలో పుర ప్రజలు, విద్యార్థులు పాల్గొని త్రియోగ ప్రక్రియలోని మెళకువలను ఉత్సుకతతో తెలుసుకొన్నారు.

ప్రారంభోత్సవ సభలో గౌరవ అతిథిగా పాల్గొన్న యోగినీ కాళీజీ మాట్లాడుతూ మనిషి యొక్క జీవితం శాశ్వతం కాదని కాని ఈ విశ్వమానవ ప్రపంచంలోచిరస్థాయిగా నిలిచిపోయేది యోగసాధనేనని అన్నారు. అయితే మనిషి బ్రతికివున్నంతలో ”సచ్చిదానంద” (సత్‌-చిత్‌-ఆనంద) తత్త్వాన్ని అలవరచుకోవాలంటే అది కేవలం యోగ విద్యతోనే సాధ్యమవుతుందన్నారు. యోగ సాధనలో ఐదు ప్రక్రియలు వుంటాయని అవి యోగఆసనం- యోగనిద్ర- ప్రాణాయామం- హస్తముద్ర- ధ్యానం అని అన్నారు. తాను అవిష్కరించిన ”త్రియోగ” ప్రక్రియ సాక్షాత్తు లక్ష్మీ-సరస్వతి-శక్తి మాతల కలయిక అన్నారు. క్రియావతి సిద్ది ద్వారా కుండలినీ శక్తిని జాగృతం చేసి యోగశాలలలో చేసేవాళ్ళలో తమ శరీరంపై పూర్తి స్థాయి నియంత్రణా శక్తిని సాధించవచ్చని తెలిపారు.

అంతకు పూర్వం దేవస్థానము విద్యాశాఖ అధికారి శ్రీ విద్యారణ్యస్వామి మాట్లాడుతూ భారతీయులకు పతంజలి యోగ విద్యను అనుగ్రహించారన్నారు. ప్రతి వ్యక్తిసమాజంలో రాణించాలంటే మంచిమాట, చిత్తశాంతి, ఆరోగ్యం అవసరమన్నారు. స్వామినీ కాళీజీ త్రియోగ పద్ధతిని కనిపెట్టడమే కాకుండా ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 31 దేశాల్లో ఈ యోగ సాధన వైశిష్ట్యం పై సదస్సులు, శిక్షణా తరగతులు, అవగాహనా కార్యక్రమాలు గత 30 ఏళ్ళుగా నిర్వహిస్తూ ఉన్నారని అన్నారు.  యోగా విద్యలో ఆమె ప్రాణాయామ – ఆసన ప్రక్రియలతో పాటు, 1000కి పైగా హస్త ముద్రికలను కనిపెట్టి కుండలినిని జాగృతం చేయడంలో విశేష కీర్తిని గడించారని తెలిపారు.

అనంతరం తితిదే ప్రజాసంబంధాల అధికారి శ్రీ టి. రవి మాట్లాడుతూ ఇప్పటి వరకు భారతదేశంలో యోగ సాధనలో విశేష కీర్తిని గడించిన వారిలో బాబారాందేవ్‌ మాత్రమే అధికశాతం ప్రజలకు సుపరిచితులని తెలిపారు. అయితే అమెరికా వంటి విదేశంలో పుట్టి భారతీయ ప్రాచీన విద్య అయిన యోగాపై సాధన చేయడమే కాకుండా త్రియోగ వంటి నూతన ప్రక్రియను సైతం కనుగొని ప్రపంచ వ్యాప్తంగా అనేక మందికి శిక్షణ ఇస్తూ ఆరోగ్యవంతుల్ని చేస్తున్న యోగిని కాళీజీ ప్రశంసనీయులన్నారు. వయస్సు మాయ యోగలో వుందని ఆమెను చూస్తే ప్రతి ఒక్కరికి అవగతమవుతుందన్నారు. ఐదు పదుల వయస్సు దాటిన యుక్తవయస్కురాలిగా ఆమె కనబడటానికి కారణం యోగ సాధనేనని ఆయన తెలిపారు. అటువంటి ప్రఖ్యాత యోగినిని తితిదే కార్యనిర్వహణ అధికారి శ్రీ ఐ.వై.ఆర్‌.కృష్ణారావు తిరుపతి ప్రజలకు ఈ సదస్సు ద్వారా పరిచయం గావించారని అన్నారు.

అనంతరం స్వామినీ కాళీజీ 15 నిమిషాలపాటు ఏకధాటిగా ప్రదర్శించిన త్రియోగ  ప్రక్రియ ఆహుతుల్ని విశేషంగా ఆకట్టుకుంది. చిరునవ్వుతో ఏమాత్రం అలసట ప్రదర్శించకుండా మయూరాసనం, వజ్రాసనం, చక్రాసనం మొదలైన క్లిష్టమైన ఆసనాలను కూడా సునాయాసంగా ఆమె ప్రదర్శించిన తీరు సభలోని వారిని అబ్బురపరచింది. అనంతరం ఆమె విద్యార్థులకు కూడా కొన్ని హస్తముద్రికలను నేర్పించారు.

కాగా మాతా మహాలక్ష్మీ, శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి ప్రియ శిష్యురాలైన స్వామినీ కాళీజీ, పూజ్య గురువులచే ”విశ్వబంధు” బిరుదునుకకూడా 2006 సంవత్సరంలో పొందారు. అదేవిధంగా ఫిబ్రవరి 2010లో యోగ విద్యారంగంలో ఆమె చేస్తున్న విశేషసేవలకు గాను ప్రతిష్టాత్మక ”భారత సాంస్కృతిక రాయభారి” పురస్కారాన్ని కూడా పొందారు.

ఒక్క భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా యోగ సిద్ధితో ప్రజలను విశేషంగా ఆకర్షిస్తున్న స్వామినీ కాళీజీకి ఇంగ్లాండులోని లండన్‌ మహానగరంలో ప్రతిష్టాత్మక నేషనల్‌ పోట్రైట్‌ గ్యాలరీ వారు ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్న 208 మంది శక్తివంతమైన మహిళల్లో స్థానం కల్పించి గౌరవించింది.

ఇప్పటికే భారతదేశంతో పాటుగా అమెరికా, స్విట్జర్‌ ల్యాండ్‌, ఆస్ట్రియా, డెన్‌మార్క్‌, రష్యా, జర్మనీ, ఉక్రేన్‌ వంటి దేశాలలో కూడా స్వామినీ కళీజీ ఇప్పటికే 30కి పైగా త్రియోగా కేంద్రాలను ఏర్పాటు చేసి భారతీయ ప్రాచీన హతయోగ విద్యలో శిక్షణ ఇస్తున్నారు. అంతేగాకుండా ” క్రియావతి సిద్ధి” ద్వారా కుండలినీ శక్తిని జాగృతం చేసి యోగ సాధన చేసే వారిలో తమ శరీరంపై పూర్తి స్థాయి నియంత్రణా శక్తిని సాధించే దిశగా శిక్షణ ఇప్పిస్తున్నారు.

ఈ కార్యక్రమంలో స్పెషల్‌గ్రేడ్‌ డిప్యూటి ఇఓ (సర్వీసస్‌) శ్రీ మతి సూర్యకుమారి, ఎస్‌.వి. యోగాకేంద్ర ప్రిన్సిపాలు శ్రీ ఆర్‌. సుబ్బారెడ్డి, యోగాట్యూన్స్‌ సంస్థకు చెందిన శ్రీ  రెంటిచింతల రవి, ఎస్‌.వి. ఆర్ట్స్‌ కాలేజీ ప్రిన్సిపాలు శ్రీ నాగేంద్రసాయి, ఎస్‌.వి. యోగాకేంద్ర విశ్రాంత ప్రిన్సిపాలు శ్రీ రామకృష్ణారెడ్డి తదితర అధికారులు, పెద్ద సంఖ్యలో పుర ప్రజలు, యోగ అభ్యాసకులు, విద్యార్థులు పాల్గొన్నారు.     


తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.