TAKE FORWARD HINDU DHARMA PRACHARA IN A BIG WAY-GIVE WIDE PUBLICITY TO ANNAMACHARYA SANKEERTANS-TTD EO _ అపరిష్కృత అన్నమయ్య సంకీర్తనల పరిష్కారానికి చర్యలు • టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు
TIRUPATI, 13 JULY 2024: TTD EO Sri. J. Shyamala Rao instructed the officials concerned to take forward Hindu Sanatana Dharma Prachara in a wide spread manner and also bring to the lime light many unresolved Annamacharya Sankeertans.
Reviewing on the All Projects of TTD at the Conference Hall of TTD Administrative Building on Saturday along with the JEO for Health and Education Smt Goutami, the EO told the Heads of various projects that the programes should imbibe Dharmic philosophy among the public and should reach wider prospective of people by organizing unique Dharmic programmes.
Later he also inquired that of the 32 thousand sankirtans written by Annamayya, how many solved so far and how much time it will take to resolve the rest and bringing them to the public fore.
After that, the EO also reviewed on the Dharmic programs being conducted in the states of Andhra Pradesh, Karnataka, Telangana and Tamil Nadu under the Dasa Sahitya Project, Alwar Divya Prabandha Project, Nalayara Divya Project, Srinivasa Kalyanam and Vaibhotsavam Project, SV Veda Adhyayana Samstha, SV Recording Project, Purana Itihasa Project, Matrusri Tarigonda Vengamamba Project, Sarangapani project, TTD publication department and Heads of the concerned departments briefed the EO about their respective activities through power point presentations.
ISSUED BY THE CHIEF PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
అపరిష్కృత అన్నమయ్య సంకీర్తనల పరిష్కారానికి చర్యలు
• టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు
తిరుమల, 2024 జూలై 13: పద కవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారు రచించిన 32 వేల సంకీర్తనలలో, కొన్ని వేల సంకీర్తనలు మాత్రమే పరిష్కరించబడ్డాయని, ఇంకను అపరిష్కృతంగా ఉన్న సంకీర్తనలను పరిష్కరించి జన బాహుళ్యం లోనికి తీసుకురావాలని టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు అధికారులను కోరారు. తిరుపతి టీటీడీ పరిపాలన భవనంలోని సమావేశ మందిరంలో టీటీడీ ఆల్ ప్రాజెక్టుల అధికారులతో ఈవో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్ని కార్యక్రమాలను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. అన్నమాచార్య సంకీర్తనలకు మరింత ప్రాచుర్యం కల్పించాలన్నారు.
ఇప్పటివరకు అన్నమయ్య రచించిన 32 వేల సంకీర్తనలలో ఎన్ని సంకీర్తనలు పరిష్కరించారు, ఇంకా ఎన్ని సంకీర్తనలు పరిష్కరించాలి, పరిష్కరించడానికి ఎంత సమయం పడుతుంది అనే అంశాలను ఆయన అడిగి తెలుసుకున్నారు.
అనంతరం దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో నిర్వహిస్తున్న ధార్మిక కార్యక్రమాలను, ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు, నాలాయర దివ్య ప్రబంధ ప్రాజెక్టు, శ్రీనివాస కళ్యాణం మరియు వైభోత్సవాల ప్రాజెక్ట్, ఎస్వీ ఉన్నత వేద అధ్యయన సంస్థ, ఎస్వీ రికార్డింగ్ ప్రాజెక్టు, పురాణ ఇతిహాస ప్రాజెక్టు, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ ప్రాజెక్టు, శ్రీ సారంగపాణి ప్రాజెక్టు, టీటీడీ ప్రచురణ విభాగంపై సంబంధిత అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఈవోకు వివరించారు.
ఈ సమీక్ష సమావేశంలో జేఈఓ శ్రీమతి గౌతమి, హెచ్ డిపిపి ప్రోగ్రాం అధికారి శ్రీ రాజగోపాల్, దాస సాహిత్య ప్రాజెక్ట్ ప్రత్యేక అధికారి శ్రీ ఆనంద తీర్థ చార్యులు, అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు శ్రీ విభీషణ శర్మ, సంబంధిత ప్రాజెక్టుల అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.