TARIGONDA BTUs IN EKANTAM _ మార్చి 10 నుండి 18వ తేదీ వరకు ఏకాంతంగా తరిగొండ శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

Tirupati, 6 March 2022: The annual Brahmotsavams in Sri Lakshmi Narasimha Swamy temple at Tarigonda in Chittoor district are scheduled from March 10-18 with Ankurarpana on March 9.

 

Due to Covid restrictions, this fete is taking pace in Ekantam.

 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

 

మార్చి 10 నుండి 18వ తేదీ వరకు ఏకాంతంగా తరిగొండ శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

తిరుపతి, 2022 మార్చి 06: తరిగొండ శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయంలో మార్చి 10 నుండి 18వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా నిర్వ‌హించ‌నున్నారు. మార్చి 9వ తేదీ సాయంత్రం 5 నుండి రాత్రి 7 గంటల మధ్య అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 8 నుండి 9 గంటల వరకు, రాత్రి 7 నుండి 8 గంటల వరకు ఏకాంతంగా వాహనసేవలు నిర్వహిస్తారు.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :

10-03-2022 (గురువారం)         ధ్వజారోహణం            హంసవాహనం,

11-03-2022(శుక్రవారం)        ముత్యపుపందిరి వాహనం హనుమంత వాహనం

12-03-2022(శనివారం)         కల్పవృక్ష వాహనం              సింహ వాహనం

13-03-2022(ఆదివారం)        తిరుచ్చి ఉత్స‌వం                  పెద్దశేష వాహనం

14-03-2022(సోమవారం)             తిరుచ్చి ఉత్స‌వం                    గజవాహనం    

15-03-2022(మంగళవారం)         తిరుచ్చి ఉత్స‌వం   సర్వభూపాల వాహనం,  కల్యాణోత్సవం, గరుడ వాహనం
             
16-03-2022 (బుధవారం)           రథోత్సవం                  ధూళి ఉత్సవం

17-03-2022(గురువారం)         సూర్యప్రభవాహనం    చంద్రప్రభ వాహనం, పార్వేట ఉత్స‌వం,అశ్వ వాహనం

18-03-2022(శుక్రవారం)     వసంతోత్సవం, చక్రస్నానం         ధ్వజావరోహణం

కాగా, మార్చి 15వ తేదీ సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు కల్యాణోత్సవం ఏకాంతంగా జరుగనుంది. అదేవిధంగా మార్చి 19వ తేదీ సాయంత్రం 5 నుండి రాత్రి 7 గంటల వరకు పుష్పయాగం నిర్వ‌హించ‌నున్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.