TELANGANA FOLKLORE SHINES AT GARUDA SEVA DAY_ గరుడసేవలో తెలంగాణ కళాబృందాలు
Tirumala, 14 October 2018: The Srivari Navaratri Brahmotsavam has become a harbinger of Telagnana culture once again with tribal folk dancers from Aliabad displaying their skills at Mada street Vahana sevas on Sunday.
The Aliabad tribal dancers performed folk dances of Telangana- Voggu Dolu, Kommu Koya, Gusssadi dances on the Mada streets before the Mohini vahanam this morning It is said that Voggu Dolu was a favorite of Padmavati Ammavaru
The highlight of their performance was with the Gussadi dance form in which wearing colorful peacock feathers tribal dancers worshiped Forest Goddess. Sri Ravi led the Vogga dolu team and Mettam Rajaiah led the Komma Khoya team.
The Sangeet Natak Academy and Telangana Government jointly sponsored the Telangana folk teams.
ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI
గరుడసేవలో తెలంగాణ కళాబృందాలు
అక్టోబరు 14, తిరుమల 2018: శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం గరుడసేవలో ప్రదర్శనలు ఇచ్చేందుకు తెలంగాణ రాష్ట్రం నుండి వచ్చిన కళాకారులు ఒగ్గు డోలు, కొమ్ము కోయ, గుస్సాడి నృత్యం చేశారు. ఒగ్గు డోలు తెలంగాణ జానపద కళ. అమ్మవారికి బోణాలు సమర్పించేటప్పుడు ఈ కళా రూపాన్ని ప్రదర్శిస్తారు. అమ్మవారికి ఈ కళారూపం చాలా ప్రీతికరమైనది. గుస్సాడి నృత్యం ఆదిలాబాద్ గిరిజన ప్రాంతానికి చెందిన కళారూపం. గిరిజనులు నెమలి పించాలను ధరించి అడవి తల్లిని ఆరాధిస్తూ ప్రత్యేకంగా నృత్యం చేస్తారు. న్యూఢిల్లీకి చెందిన సంగీత నాటక అకాడమి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ బృందాలు పంపాయి. కొమ్ము కోయ బృందానికి శ్రీ మెట్టెం రాజయ్య, ఒగ్గుడోలు బృందానికి శ్రీ రవి నేతృత్వం వహించారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.