CHATTISGARH AND GUJARAT ARTISTS PERFORM AT BRAHMOTSAVAM_ గ‌రుడ‌సేవ‌లో ఛత్తీస్ ఘర్, గుజరాత్ క‌ళాబృందాలు

Tirumala, 14 October 2018: Artists from Chhattisgarh and Gujarat have now joined the cultural pageant showcased at the vahana sevas during the Navaratri Brahmotsavams at Srivari temple in Tirumala.

The Chhattisgarh artists team led by Sukhdev Das will present popular Panti dance in which the dancers will keep swirling their hands and steap on all sides in a unique song and dance sequence. Highlight of the dance drum beating dancers jumping high and touching grounds.

The unique dance format showcased in many national events has been sponsored by the Sangeet Natak Academy of Delhi.

The artists from Gujarat are presenting a dance ballet – Panchal GAs Madal – choreography by M M Ramachandra Babu .The popular folk dance of Gujarat is representative of intrinsic religious beliefs and art styles of the region.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

గ‌రుడ‌సేవ‌లో ఛత్తీస్ ఘర్, గుజరాత్ క‌ళాబృందాలు

శ్రీ‌వారి న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాల్లో భాగంగా ఆదివారం గ‌రుడ‌సేవ‌లో ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇచ్చేందుకు ఛత్తీస్ ఘర్ రాష్ట్రం నుండి శ్రీ సుఖ్‌దేవ్ దాస్ నేతృత్వంలో కళాకారులు పంతి డ్యాన్స్ ప్రదర్శించారు. ఇందులో ప్రత్యేకశైలిలో గిర గిరా చేతులు తిప్పుతూ ముందుకు వెనకకు అడుగులు వేస్తూ నృత్యం చేస్తారు. మధ్యలో మృదంగం వాయిస్తూ భూమిని తాకడం, తిరిగి పైకి లేవడం ప్రత్యేకత. న్యూఢిల్లీకి చెందిన సంగీత నాటక అకాడమీ ఈ కళాబృందాన్ని పంపింది.

గుజరాత్ నుండి….

గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం పంచల్ రాస్ మదల్ తంగధ్ అనే కళారూపాన్ని పంపింది. శ్రీ ఎంఎం.రామ‌చంద్ర‌భాయి నేతృత్వంలో ఈ కళాకారులు ప్రత్యేక వేషధారణతో సాంప్రదాయ జానపద నృత్యం చేశారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.