MAHAKUMBHABHISHEKAM IN HYDERABAD TEMPLE ON MARCH 13_ హైదరాబాద్‌లో శాస్త్రోక్తంగా శ్రీవారి ఆలయ మహాకుంభాభిషేకం కార్యక్రమాలు

Tirupati, 11 Mar. 19: The Mahakumbhabhishekam to Sri Venkateswara Swamy temple which is constructed in Jubilee Hills in Hyderabad, will be performed on March 13 as per the tenets of Agama Shastra by TTD.

The series of religious events in connection with Mahakumbhabhishekam commenced with Ankurarpanam on March 8 followed by Panchagavyadhivasam on March 9, Ksheeradhivasam on March 10, Jaladhivasam on March 11.

On Monday, Purnahuti and Bimbasthapana Homam were also performed.

While on Tuesday, March 12 religious rituals like Bimba Vaastu, Navakalasa Snapanam, Maha shanti Purnahuti, Rakshabandhanam, Kumbharadhanam, Sarvadevatarchana and Homam will be performed.

MAHAKUMBHABHISHEKAM IN MEENA LAGNAM

In the auspicious Meena Lagnam, Maha Kumbhabhishekam will be observed between 6am and 7.30am. This will be followed by Brahma Ghosha, Veda Sattumora, Dhwajarohanam and other religious ceremonies between 7.30am and 9am.

Later, the devotees will be allowed for Sarva Darshanam. In the evening there is procession of Utsava Murthies. Dhwajavarohanam will also observed followed by Ekanta Seva in the night.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

హైదరాబాద్‌లో శాస్త్రోక్తంగా శ్రీవారి ఆలయ మహాకుంభాభిషేకం కార్యక్రమాలు

మార్చి 11, హైదరాబాద్‌, 2019: హైదరాబాద్‌లోని జూబ్లీ హిల్స్‌లో టిటిడి నిర్మించిన శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ, మహాకుంభాభిషేకం కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి.

మార్చి 8వ తేదీన అంకురార్పణతో ఈ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. మార్చి 9న పంచగవ్యాధివాసం, అగ్నిప్రతిష్ఠ, కుంభావాహనం, మార్చి 10న క్షీరాధివాసం, హోమం చేపట్టారు.

మార్చి 11వ తేదీ సోమవారం ఉదయం హోమం, జలాధివాసం, పూర్ణాహుతి, మధ్యాహ్నం బింబస్థాపనం, హోమం, పూర్ణాహుతి నిర్వహించారు.

మార్చి 12వ తేదీన మంగళవారం ఉదయం బింబవాస్తు, నవకలశ స్నపనం, చతుర్దశ కలశ స్నపనం, హోమం, పూర్ణాహుతి, మహాశాంతి తిరుమంజనం, మహాశాంతి పూర్ణాహుతి, రక్షాబంధనం, కుంభారాధనం, నివేదనం, శయనాధివాసం, హౌత్రం, సర్వదేవతార్చన, హోమం నిర్వహిస్తారు.

మహాకుంభాభిషేకం :

మార్చి 13వ తేదీ బుధవారం ఉదయం 6 నుండి 7.30 గంటల నడుమ మీన లగ్నంలో మహాకుంభాభిషేకం నిర్వహిస్తారు. ఆ తరువాత ఉదయం 7.30 నుండి 9 గంటల వరకు బ్రహ్మఘోష, వేదశాత్తుమొర, ధ్వజారోహణం, అర్చక బహుమానం, ఉదయం 9 నుండి 10.30 గంటల వరకు నిత్యకైంకర్యాల అనంతరం సాయంత్రం 4 గంటల వరకు సర్వదర్శనం కల్పిస్తారు. సాయంత్రం 4 నుండి 5.30 గంటల వరకు శ్రీనివాస కల్యాణం, సాయంత్రం 5.30 నుండి 6.30 గంటల వరకు ఉత్సవమూర్తుల ఊరేగింపు, ధ్వజావరోహణం, సాయంత్రం 6.30 నుండి 7.30 గంటల వరకు నిత్య కైంకర్యాలు, రాత్రి 7.30 నుండి 8.30 గంటల వరకు సర్వదర్శనం, రాత్రి 8.45 గంటలకు ఏకాంత సేవ నిర్వహిస్తారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.