VONTIMITTA BTU POSTERS RELEASED_ ఒంటిమిట్ట శ్రీకోదండరామాలయ వార్షిక బ్రహ్మోత్సవాల గోడపత్రికలు ఆవిష్కరణ
Tirupati, 11 Mar. 19: The posters related to annual brahmotsavams of Sri Kodandarama Swamy temple at Vontimitta in YSR Kadapa district were released on Monday evening by Tirupati JEO Sri B Lakshmikantham.
Speaking on the occasion the JEO said, all the arrangements are going on in a fast pace for the mega religious event which will he observed from April 13 to 21.
He said Dhwajarohanam is on April 13 in the auspicious Vrishabha Lagnam and other important days includes Hanumantha Vahanam on April 16, Sita Rama Kalyanam on April 18, Rathotsavam on April 19 and Chakrasnanam on April 21, he added.
In the release event which took place at the Chamber’s of Tirupati JEO in TTD administrative building in Tirupati, DyEO of the temple Sri Natesh Babu, AEO Sri Rama Raju and others were also present.
ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
ఒంటిమిట్ట శ్రీకోదండరామాలయ వార్షిక బ్రహ్మోత్సవాల గోడపత్రికలు ఆవిష్కరణ
మార్చి 11, తిరుపతి, 2019: తిరుమల తిరుపతి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న కడప జిల్లా ఒంటిమిట్టలోని శ్రీకోదండరామస్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల గోడపత్రికలు, కరపత్రాలను టిటిడి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం సోమవారం ఆవిష్కరించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల జెఈవో కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ ఏప్రిల్ 13 నుంచి 22వ తేదీ వరకు ఒంటిమిట్ట శ్రీకోదండరామాలయ శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగనున్నాయని తెలిపారు. ఏప్రిల్ 13న వృషభలగ్నంలో ధ్వజారోహణం, సాయంత్రం పోతన జయంతి, ఏప్రిల్ 16న హనుమంత వాహనం, ఏప్రిల్ 18న శ్రీ సీతారాముల కల్యాణం, ఏప్రిల్ 19న రథోత్సవం, ఏప్రిల్ 21న చక్రస్నానం, ఏప్రిల్ 22న పుష్పయాగం జరుగనున్నాయని తెలిపారు. ఉదయం 8 నుండి 10 గంటల వరకు, రాత్రి 8 నుండి 9.30 గంటల వరకు వాహనసేవలు నిర్వహిస్తామన్నారు. స్వామివారి కల్యాణాన్ని వీక్షించేందుకు విశేష సంఖ్యలో విచ్చేసే భక్తులకు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఇంజినీరింగ్ పనులను సకాలంలో పూర్తి చేస్తామన్నారు. కడప జిల్లావ్యాప్తంగా గోడపత్రికలు, కరపత్రాలను పంపిణీ చేసి విస్తృతంగా ప్రచారం చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. స్థానికుల కోరిక మేరకు రెండో శనివారం తిరుమల శ్రీవారి లడ్డూలు 2 వేలు, నాలుగో శనివారం 2 వేల లడ్డూలను కలుపుకుని నెలకు మొత్తం 4 వేల లడ్డూలను విక్రయించేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
ఏప్రిల్ 18న శ్రీ సీతారాముల కల్యాణం :
ఏప్రిల్ 18న శ్రీ సీతారాముల కల్యాణానికి లక్ష మందికిపైగా భక్తులు విచ్చేసే అవకాశముందని, అందుకు తగ్గట్లు విస్తృతంగా ఏర్పాట్లు చేపడుతున్నామని జెఈవో తెలిపారు. కల్యాణవేదిక వద్ద దాదాపు లక్ష మంది భక్తులు కూర్చునేలా వేగంగా పనులు జరుగుతున్నాయన్నారు. భక్తులకు తలంబ్రాలు, అన్నప్రసాదాలు, తాగునీరు, మజ్జిగ అందించేలా చర్యలు చేపట్టామన్నారు. సమీపంలోని చెరువు మధ్యలో శ్రీకోదండరామ విగ్రహ ప్రతిష్ట, బోటింగ్, చుట్టూ పచ్చదనం, చెరువు పక్కన టిటిడి బస్ షెల్టర్ నిర్మించేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. బ్రహ్మోత్సవాలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీరాముని కృపకు పాత్రులు కావాలని కోరారు.
బ్రహ్మోత్సవాల్లో వాహనసేవలు :
తేదీ ఉదయం రాత్రి
13-04-2019(శని) ధ్వజారోహణం(ఉ|| 8-9గం||ల) పోతన జయంతి, శేషవాహనం.
14-04-2019(ఆది) వేణుగాన అలంకారం హంస వాహనం
15-04-2019(సోమ) వటపత్రసాయి అలంకారం సింహ వాహనం
16-04-2019(మంగళ) నవనీతకృష్ణ అలంకారం హనుమంత వాహనం
17-04-2019(బుధ) మోహినీ అలంకారం గరుడసేవ
18-04-2019(గురు) శివధనుర్భాణ అలంకారం శ్రీ సీతారాముల కల్యాణం (రా|| 8 గం||లకు), గజవాహనం.
19-04-2019(శుక్ర) రథోత్సవం —–
20-04-2019(శని) కాళీయమర్ధన అలంకారం అశ్వవాహనం
21-04-2019(ఆది) చక్రస్నానం ధ్వజావరోహణం(రా|| 7 గం||)
22-04-2019(సోమ) ——– పుష్పయాగం(సా|| 6 గం||).
ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో శ్రీ నటేష్ బాబు, ఏఈవో శ్రీ రామరాజు తదితర అధికారులు కాల్గొన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.