అక్టోబ‌రు 4న వస్త్రాలు టెండర్‌ కమ్‌ వేలం

అక్టోబ‌రు 4న వస్త్రాలు టెండర్‌ కమ్‌ వేలం

తిరుపతి, 2018 సెప్టెంబ‌రు 25: తిరుపతి, 2018 సెప్టెంబ‌రు 25: తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించిన వస్త్రాలను అక్టోబ‌రు 4వ తేదీన టెండర్‌ కమ్‌ వేలం వేయనున్నారు. కొత్తవి/ఉపయోగించిన/పాక్షికంగా దెబ్బతిన్న వస్త్రాలు 226 లాట్లు ఉన్నాయి. ఇందులో ప‌ట్టు చీర‌లు, ప‌ట్టు ఉత్త‌రీయాలు, పాలిస్ట‌ర్, కాట‌న్‌ పంచ‌లు, ఉత్త‌రీయాలు, ట‌ర్కీ ట‌వ‌ళ్లు, లుంగీలు, శాలువ‌లు, బెడ్‌షీట్లు, దిండుక‌వ‌ర్లు, రేడీమేడ్ వ‌స్త్రాలు, హుండీ గ‌ల్లేబులు, ర‌వికె గుడ్డ‌లు ఉన్నాయి.

ఇతర వివరాలకు తిరుపతిలోని టిటిడి మార్కెటింగ్‌ కార్యాలయాన్ని 0877-2264429 నంబరులో గానీ, టిటిడి వెబ్‌సైట్‌ www.tirumala.org, లేదా ఎమ్‌.ఎస్‌.టి.సి. లిమిటెడ్‌ వెబ్‌సైట్‌ www.mstcecommerce.com /www.mstcindia.co.in నువెబ్‌సైట్‌ను గానీ సంప్రదించగలరు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.