VICE PRESIDENT ON A THANKS GIVING VISIT TO TIRUMALA_ ప్రజలు సిరి సంపదలు, సుఖసంతోషాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్థించా : భారత ఉప రాష్ట్రపతి గౌ|| శ్రీ వెంకయ్యనాయుడు

Tirumala, 25 September 2018: The Honourable Vice President of India, Sri M Venkaiah Naidu offeren prayers in the temple of Lord Venkateswara at Tirumala on Tuesday.

The Vice President, speaking to media after darshan outside Tirumala shrine said that he came along with his family to thank the presiding deity on the succeessful completion of his one year tenure in the coveted post.

“I have been coming to Tirumala like a common man since my childhood. It gives me new energy and instill confidence in me to execute my responsibilities with more commitment. I prayed Lord for the well-being of the nation and prosperity of the people”, he added.

The Vice President had darshanam of Lord through Vaikuntham Queue Complex like common pilgrims.

Earlier he was accorded warm welcome by TTD EO Sri Anil Kumar Singhal and Tirumala JEO Sri KS Sreenivasa Raju on his arrival at Mahadwaram. The temple pundits offered the dignitary the traditional Isthikaphal swagatham.

After darshan, the Vice President and his entourage were offered Vedasirvachanam in Ranganayakula Mandapam. Later Teertha prasadams, 2019 calendar, diaries and lamination photo of Lord were also presented.

AP Minister Sri Amarnath Reddy, District Collector Sri Pradyumna, Incharge CVSO Sri Sivakumar Reddy, Temple DyEO Sri Haridranath, Reception Officials Sri Balaji, Sri Lokanadham and others were present.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ప్రజలు సిరి సంపదలు, సుఖసంతోషాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్థించా : భారత ఉప రాష్ట్రపతి గౌ|| శ్రీ వెంకయ్యనాయుడు

తిరుమల, 2018 సెప్టెంబరు 25: భారతదేశ ప్రజలందరూ సిరి సంపదలతో, సుఖశాంతులతో ఉండేలా అశీర్వదించాలని శ్రీవేంకటేశ్వరస్వామివారిని ప్రార్థించానని భారత ఉపరాష్ట్రపతి గౌ|| శ్రీ వెంకయ్యనాయుడు తెలిపారు. గౌ|| ఉప రాష్ట్రపతి కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

ముందుగా సామాన్య భక్తుడి లాగా వైకుంఠం క్యూకాంప్లెక్స్‌ నుండి మహద్వారం వద్దకు వద్దకు చేరుకున్న గౌ|| ఉపరాష్ట్రపతికి టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, తిరుమల జెఈవో శ్రీకె.ఎస్‌.శ్రీనివాసరాజు, అర్చకులు కలిసి ఇస్తికఫాల్‌ స్వాగతం పలికారు. గౌ|| ఉపరాష్ట్రపతి కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ తరువాత శ్రీవకుళామాత, విమాన వేంకటేశ్వరస్వామి, భాష్యకార్లు, శ్రీ యోగ నరసింహస్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, తిరుమల జెఈవో శ్రీకె.ఎస్‌.శ్రీనివాసరాజు కలిసి శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటం, 2019 టిటిడి డైరీ, క్యాలెండర్‌ను గౌ|| ఉపరాష్ట్రపతికి అందజేశారు.

శ్రీవారి దర్శనానంతరం ఆలయం వెలుపల ఉపరాష్ట్రపతి గౌ|| శ్రీ వెంకయ్యనాయుడు మీడియాతో మాట్లాడుతూ తన ఇష్టదైవమైన శ్రీ వేెంకటేశ్వరస్వామివారి దర్శనం సంతోషాన్ని, ఆనందాన్ని ఇస్తుందన్నారు. ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించి ఒక సంవత్సరం రోజులు పూర్తయిన సందర్భంగా తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శించుకున్నట్టు చెప్పారు. భారత ప్రజలకు సేవలందించేందుకు మరింత శక్తిని, సామర్థ్యాన్ని, ఓర్పును ప్రసాదించాలని స్వామివారిని కోరుకున్నానన్నారు. అనేక సంవత్సరాలుగా సామాన్య భక్తుడిలాగా తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నానని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా నానాటికీ శ్రీవేంకటేశ్వరస్వామివారి దర్శనం కోసం ఆసక్తి పెరుగుతోందన్నారు. ప్రముఖులు, నాయకులు, ప్రజాప్రతినిధులు తమ రాకపోకలను కొంత తగ్గించుకొని సామాన్య ప్రజలకు ఎక్కువ అవకాశం కల్పించేలా చర్యలు తీసుకోవాలని టిటిడి యాజమాన్యానికి, అధికారులకు సూచించానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ ఎన్‌.అమరనాథరెడ్డి, జిల్లా కలెక్టర్‌ శ్రీ పి.ఎస్‌.ప్రద్యుమ్న, తిరుపతి అర్బన్‌ ఎస్‌పి శ్రీ అభిషేక్‌ మహంతి, టిటిడి ఇన్‌చార్జి సివిఎస్‌వో శ్రీశివకుమార్‌రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.