శ్రీ వేదనారాయణస్వామివారి ఆలయానికి పుష్పాల సరఫరాకు జూన్ 24 వరకు రీటెండర్లు
శ్రీ వేదనారాయణస్వామివారి ఆలయానికి పుష్పాల సరఫరాకు జూన్ 24 వరకు రీటెండర్లు
తిరుపతి, 2019 జూన్ 18: టిటిడికి అనుబంధంగా ఉన్న నాగలాపురంలోని శ్రీ వేదనారాయణస్వామివారి ఆలయానికి 2019-20 సంవత్సరానికి గాను పుష్పాల సరఫరాకు జూన్ 24 వరకు రీటెండర్లు ఆహ్వానించడమైనది.
జూన్ 13వ తేదీ నుండి టెండరు షెడ్యూళ్ల దరఖాస్తులు జారీ చేస్తున్నారు. తిరుపతి ప్రకాశం రోడ్డులోని పాత ఎస్వీ హైస్కూల్ భవనంలో గల శ్రీ కోదండరామాలయ గ్రూపు ఆలయాల డెప్యూటీ ఈవో కార్యాలయంలో జూన్ 24వ తేదీన మధ్యాహ్నం 3.00 గంటల వరకు టెండర్లు స్వీకరిస్తారు. అదేరోజు మధ్యాహ్నం 3.30 గంటలకు సీల్డ్ టెండర్లు తెరుస్తారు. మరిన్ని వివరాలకు డెప్యూటీ ఈవో కార్యాలయాన్ని 0877-2264736 నంబరులో సంప్రదించగలరు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.