TTD TAKES CARE OF HUMAN HAIR PROCESSING OPERATION_ త‌ల‌నీలాల సేక‌ర‌ణ‌, నిల్వపై టిటిడి ప్ర‌త్యేక శ్ర‌ద్ధ‌

* Daily Transport to Tirupati
* Processing on Global standards
* cc camera vigilance in TTD godowns

Tirumala, 18 Jun. 19: To facilitate devotees to redeem their vows to Lord Venkateswara by tonsuring their heads in a gesture of Saranagati, TTD has set up Kalyanakattas in Tirumala and offering free tonsuring to multitude of visiting pilgrims everyday in Tirumala.

In fact the average percentage of pilgrims who tonsure their hair ranges between 35% and 50% depending on the season.

TTD also set up exclusive infrastructure for processing and e-auction of tonsured hair and earns annual revenue of ₹100-120 crores.

PROCESS OF SEGREGATION

As per tradition the tonsured hair is first put in TTD hundi and later segregated in sizes and cuts before they are transported everyday in lorries to TTD warehouses on the Hare Rama temple Road at Tirupati.

A daily collection of 700-900 kgs are kept in 30 kgs sealed bags first in Godown-1. The hair is later taken to processing in Godown-2 and waste is removed after initial inspection before shifting to drying halls above.

After drying they are segregated in into five categories on sizes of 27 inches, 19-26 inches, 10-18 inches, 5-9 inches and less than five inches respectively. The first two categories of hair are kept in 20 kg bags, while 3,4,5 categories of hair is stored in 30 kg bags.

The Government of India concern firm, the Vishakhapatnam based M/s MSTC conducts e-auction of processed hair once in a month on first Thursday under the supervision of TTD JEO of Tirumala Sri KS Sreenivasa Raju.

CC CAMERA VIGILANCE IN GODOWNS

The Godown complex which is on CC camera watch on 24 x7 basis comprised of loading and unloading in halls, GM (auction) and Deputy GM (auction) halls on ground floor. There are 3 storage rooms on first floor and three halls for drying and processing in second floor. The TTD appointed 70 member staff for maintenance and provided them free masks, gloves and aprons besides regular Medical check-ups at the TTD central hospital.

The TTD Health department cleans the godowns every day and big exhaust fans and air purifiers are also installed to avoid foul smell emit from storage of hairs. The TTD canteen also provided lunch, snacks and beverages etc. to workers. The entire activity of storage, segregation, processing and auctioning is being looked after by TTD General Manager (Auctions) Sri D Nageswar Rao and Deputy GM Sri MAV Satyam.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

త‌ల‌నీలాల సేక‌ర‌ణ‌, నిల్వపై టిటిడి ప్ర‌త్యేక శ్ర‌ద్ధ‌

తిరుమ‌ల నుండి ప్ర‌తిరోజూ తిరుప‌తికి త‌ర‌లింపు

అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌తో సైజుల‌వారీగా విభ‌జ‌న

గోడౌన్‌లో సిసి కెమెరాల నిఘా

తిరుమ‌ల‌, 2019 జూన్ 18: తిరుమలలో త‌ల‌నీలాల స‌మ‌ర్పించ‌డాన్ని యాత్రికులు అత్యంత ప‌విత్రంగా భావిస్తారు. త‌ల‌నీలాల స‌మ‌ర్ప‌ణ ద్వారా స్వామివారి నిండైన దీవెన‌ల‌ను అందుకుంటున్నారు. ఇందుకు అనుగుణంగా తిరుమ‌ల‌లోని ప్ర‌ధాన క‌ల్యాణ‌క‌ట్ట‌తోపాటు మినీ క‌ల్యాణ‌క‌ట్ట‌ల్లో యాత్రికులు ఉచితంగా త‌ల‌నీలాలు స‌మ‌ర్పించేలా టిటిడి ఏర్పాట్లు చేప‌ట్టింది. అంతేగాక యాత్రికులు భ‌క్తితో స‌మ‌ర్పించిన త‌ల‌నీలాల‌ను టిటిడి ప్ర‌త్యేక‌శ్ర‌ద్ధ‌తో సేక‌రించి నిల్వ చేస్తోంది. త‌ల‌నీలాల విక్ర‌యం ద్వారా సంవ‌త్స‌రానికి రూ.100 కోట్ల నుండి రూ.120 కోట్ల వ‌ర‌కు ఆదాయం స‌మ‌కూరుతోంది.

తిరుమ‌ల‌లోని ప్ర‌ధాన క‌ల్యాణ‌క‌ట్ట‌తోపాటు మినీ క‌ల్యాణ‌క‌ట్ట‌ల్లో యాత్రికులు స‌మ‌ర్పించిన త‌ల‌నీలాల‌ను ముందుగా హుండీల్లో వేస్తారు. ముడులు( వివిధ సైజుల్లో ఉన్న‌వి), తుక్కు(5 అంగుళాల కంటే త‌క్కువ ఉన్న‌వి)ను వేరువేరుగా సేక‌రిస్తారు. తిరుమ‌ల నుండి ప్ర‌తిరోజూ సాయంత్రం టిటిడి వాహ‌నంలో భ‌ద్ర‌త న‌డుమ తిరుప‌తిలోని హ‌రేరామ ఆల‌యం రోడ్డులో గ‌ల గోడౌన్‌కు త‌ర‌లిస్తారు. ముడులు, తుక్కు క‌లిపి రోజుకు 700 నుండి 900 కిలోల త‌ల‌నీలాలు గోడౌన్‌కు చేరుతుంటాయి. వీటి తూకాన్ని న‌మోదు చేసుకుని అనుమ‌తిస్తారు. గోడౌన్‌-1లో తుక్కును ఆర‌బెట్టి 30 కిలోల సంచుల్లో సీల్ చేస్తారు. గోడౌన్‌-2లో ముడుల‌ను ప్రాసెసింగ్ చేస్తారు. ముడుల‌ను ప్రాథ‌మికంగా ప‌రిశీలించి చెత్త‌ను తొల‌గిస్తారు. ఆ త‌రువాత డ్ర‌యింగ్ షెడ్‌కు పంపి ఆర‌బెడ‌తారు. త‌గినంత‌గా ఆరిన త‌రువాత అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌కు అనుగుణంగా టిటిడి నిర్దేశించిన సైజుల వారీగా విభ‌జిస్తారు. మొదటి రకం(27 ఇంచుల పైన), రెండో రకం(19 నుండి 26 ఇంచులు), మూడో రకం(10 నుండి 18 ఇంచులు), నాలుగో రకం(5 నుండి 9 ఇంచులు), ఐదో రకం(5 ఇంచుల కన్నా తక్కువ) త‌ల‌నీలాలు ఉంటాయి. మొద‌టి ర‌కం, రెండో ర‌కం త‌ల‌నీలాల‌ను 20 కిలోల సంచుల్లో, 3, 4, 5 ర‌కాల త‌ల‌నీలాల‌ను 30 కిలోల సంచుల్లో నిల్వ చేస్తారు. కేంద్ర ప్ర‌భుత్వ సంస్థ అయిన వైజాగ్‌కు చెందిన ఎంఎస్‌టిసి లిమిటెడ్ ఈ ప్లాట్‌ఫామ్‌పై ప్ర‌తి నెలా మొద‌టి గురువారం ఇ-వేలం నిర్వ‌హిస్తారు. టిటిడి తిరుమ‌ల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీ‌నివాస‌రాజు ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఇ-వేలం జ‌రుగుతుంది.

గోడౌన్‌లో సిసి కెమెరాల నిఘా

తిరుప‌తిలోని హ‌రేరామ ఆల‌యం రోడ్డులో గ‌ల గోడౌన్‌లో సిసి కెమెరాల నిఘాలో త‌ల‌నీలాలను భ‌ద్ర‌ప‌రుస్తున్నారు. 24 గంట‌ల పాటు భ‌ద్ర‌తా సిబ్బంది విధుల్లో ఉంటారు. ఈ గోడౌన్‌లో గ్రౌండ్ ఫ్లోర్‌లో లోడింగ్‌, అన్‌లోడింగ్ హాళ్లు, జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్‌(వేలం), డెప్యూటీ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్‌(వేలం) కార్యాల‌యాలు ఉన్నాయి. మొద‌టి అంత‌స్తులో 3 స్టోరేజి గ‌దులు, రెండో అంత‌స్తులో త‌ల‌నీలాల‌ను ఆర‌బెట్టేందుకు 3 హాళ్లు ఉన్నాయి. త‌ల‌నీలాల‌ను వేరు చేయ‌డం, ఆరబెట్ట‌డం త‌దిత‌ర ప‌నులు చేప‌ట్టేందుకు ఇక్క‌డ రోజుకు 70 మంది సిబ్బంది విధుల్లో ఉంటారు. వీరికి చేతుల‌కు గ్లౌజులు, ముఖానికి మాస్కులు, ఆఫ్రాన్లను టిటిడి అందిస్తోంది. టిటిడి కేంద్రీయ వైద్య‌శాల‌లో వీరికి క్ర‌మం త‌ప్ప‌కుండా ఆరోగ్య ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తారు. ఆరోగ్య శాఖ సిబ్బంది గోడౌన్ల‌లో మెరుగ్గా పారిశుద్ధ్య చ‌ర్య‌లు చేప‌డుతున్నారు. హాళ్ల‌లో వాస‌న రాకుండా ఉండేందుకు ఎగ్జాస్ట్ ఫ్యాన్లు, ఎయిర్ ప్యూరిఫ‌య్య‌ర్లు ఏర్పాటు చేశారు. టిటిడి ఉద్యోగుల క్యాంటీన్ నుండి ఇక్క‌డి సిబ్బందికి ఉద‌యం అల్పాహారం, మ‌ధ్యాహ్నం భోజ‌నం, సాయంత్రం స్నాక్స్ అందిస్తారు. టిటిడి జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్‌(వేలం) శ్రీ డి.నాగేశ్వ‌ర‌రావు, డెప్యూటీ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్‌(వేలం) శ్రీ ఎంఎవి.స‌త్యం ప‌ర్య‌వేక్ష‌ణ‌లో గోడౌన్ కార్య‌క‌లాపాలు సాగుతున్నాయి.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.