TEPPOTSAVAMS IN EKANTAM HELD _ శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి క‌టాక్షం

Tirupati, 12 Feb. 22: On the third day of Teppotsavams, Sri Kalyana Venkateswara Swamy appeared on Tiruchi to bless the devotees along with His consorts.

 

Due to Covid restrictions this fete was observed in Ekantam.

 

Spl Gr DyEO Sri Rajendrudu and others were present.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

 

శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి క‌టాక్షం

తిరుప‌తి, 2022 ఫిబ్ర‌వ‌రి 12: శ్రీ గోవిందరాజ స్వామివారి తెప్పోత్సవాలలో భాగంగా మూడ‌వ‌ రోజైన శ‌నివారం సాయంత్రం శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారు ఆల‌య ప్రాంగ‌ణంలో తిరుచ్చిపై విహరించారు. కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో పుష్కరిణిలో కాకుండా ఆలయంలో ఏకాంతంగా తెప్పోత్సవాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

ఇందులో భాగంగా ఉద‌యం 10.30 నుండి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఉత్స‌వ‌మూర్తుల‌కు వేడుక‌గా స్న‌ప‌న‌తిరుమంజ‌నం నిర్వ‌హించారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బ‌రి నీళ్ళు, చంద‌నం, ప‌సుపు త‌దిత‌ర సుగంధ ద్ర‌వ్యాల‌తో అభిషేకం చేశారు.

కాగా నాలుగో రోజైన ఫిబ్ర‌వ‌రి 13న శ్రీ కృష్ణ‌స్వామివారు, శ్రీ ఆండాళ్ అమ్మ‌వారిని వేంచేపు చేసి ఆలయంలో ఏకాంతంగా తెప్పోత్సవాలు నిర్వహిస్తారు.

ఈ కార్య‌క్రమంలో ఆల‌య ప్ర‌త్యేక‌శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీ‌రాజేంద్రుడు, ఏఈవో శ్రీ ర‌వికుమార్ రెడ్డి, ఆల‌య ప్ర‌ధాన అర్చ‌కులు శ్రీ ఎపి. శ్రీ‌నివాస దీక్షితులు, సూపప‌రింటెండెంట్లు శ్రీ నారాయ‌ణ‌, శ్రీ వెంక‌టాద్రి, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్‌ శ్రీ కామ‌రాజుపాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.