ANKURARPANAM OF ANNUAL BTU THALLAPAKA SRI CKS AND SD TEMPLES_ జూలై 11న తాళ్లపాకలోని శ్రీ చెన్నకేశవస్వామి, శ్రీ సిద్దేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
Tirupati, 9 Jul. 19: The Ankurarpanam Of annual Brahmotsavams Of Tallapaka temples of Sri Chennakesava Swamy and Sri Siddheswara Swamy will be held on July 11.
The schedule of events at Sri Chennakesava Swamy Temple is Dwajarohanam July 12, Pallaki Seva July 15, Garuda vahanam July 16, Kalyanotsavam July 17, Rathotsavam July 18, Vasantotsavam, Chakra snanam, and Dwajavarohanam July 20.
SRI SIDDHESWARA SWAMY TEMPLE BTU
The schedule of events Dwajarohanam July 12, Pallaki Seva July 15, Kalyanotsavam July 17, Trishoola snanam July 20 and Pushpa Yagami July 21.
The artists of cultural wings of TTD HDPP, Annamacharya Project will present Bhakti sangeet, bhajans, and Kolata every day during Brahmotsavams Of both temples at Tallapaka.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDS, TIRUPATI
జూలై 11న తాళ్లపాకలోని శ్రీ చెన్నకేశవస్వామి, శ్రీ సిద్దేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
తిరుపతి, 2019 జూలై 09: టిటిడికి అనుబంధంగా ఉన్న కడప జిల్లా తాళ్లపాకలో గల శ్రీ చెన్నకేశవస్వామి, శ్రీ సిద్ధేశ్వరస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు జూలై 12 నుండి 20వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. ఈ రెండు ఆలయాల బ్రహ్మోత్సవాలకు జూలై 11వ తేదీ అంకురార్పణ నిర్వహిస్తారు.
శ్రీ చెన్నకేశవస్వామివారి వాహనసేవలు :
జూలై 12న ఉదయం 9 నుండి 10 గంటల మధ్య ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. రాత్రి చిన్నశేషవాహన సేవ నిర్వహిస్తారు. జూలై 13న ఉదయం పల్లకీ సేవ, రాత్రి హంస వాహనం, జూలై 14న ఉదయం పల్లకీ ఉత్సవం, రాత్రి సింహ వాహనం, జూలై 15న ఉదయం పల్లకీ ఉత్సవం, రాత్రి హనుమంత వాహనాలపై స్వామివారు భక్తులకు కనువిందు చేస్తారు. జూలై 16న ఉదయం మోహినీ అవతారం, గరుడసేవ, సాయంత్రం 4 గంటలకు ఏకాంతసేవ నిర్వహిస్తారు.
జూలై 17వ తేదీ ఉదయం పల్లకీ సేవ, సాయంత్రం 5 నుండి 7 గంటల వరకు ఆర్జిత కల్యాణోత్సవం జరుగనుంది. గృహస్తులు(ఇద్దరు) రూ.300/- చెల్లించి ఈ కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డూ, ఒక అప్పం, అన్నప్రసాదం బహుమానంగా అందజేస్తారు. ఆ తరువాత రాత్రి 9 గంటలకు గజ వాహనంపై స్వామివారు విహరిస్తారు. జూలై 18న ఉదయం పల్లకీసేవ, సాయంత్రం 6.30 గంటలకు రథోత్సవం, జూలై 19న ఉదయం పల్లకీసేవ, రాత్రి అశ్వవాహనం, జూలై 20న ఉదయం 9 గంటలకు వసంతోత్సవం, ఉదయం 11.15 గంటలకు చక్రస్నానం నిర్వహిస్తారు. అదేరోజు సాయంత్రం 6 గంటలకు ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.
శ్రీ సిద్ధేశ్వరస్వామివారి వాహనసేవలు :
జూలై 12న ఉదయం 6 నుండి 7 గంటల మధ్య ధ్వజారోహణంతో బ్రహ్మో త్సవాలు ప్రారంభమవుతాయి. రాత్రి హంసవాహన సేవ నిర్వహిస్తారు. జూలై 13న ఉదయం పల్లకీ సేవ, రాత్రి చంద్రప్రభ వాహనం, జూలై 14న ఉదయం పల్లకీ ఉత్సవం, రాత్రి చిన్నశేష వాహనం, జూలై 15న ఉదయం పల్లకీ ఉత్సవం, రాత్రి సింహ వాహనాలపై స్వామివారు భక్తులకు కనువిందు చేస్తారు.
జూలై 16న ఉదయం పల్లకీ సేవ అనంతరం చంద్రగ్రహణం కారణంగా మరుసటిరోజు మధ్యాహ్నం వరకు ఆలయ తలుపులు మూసివేస్తారు. జూలై 17న సాయంత్రం 5 నుండి 7గంటల వరకు ఆర్జిత కల్యాణోత్సవం జరుగనుంది. గృహస్తులు(ఇద్దరు) రూ.300/- చెల్లించి ఈ కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డూ, ఒక అప్పం, అన్నప్రసాదం బహుమానంగా అందజేస్తారు. ఆ తరువాత రాత్రి 8.00 గంటలకు గజవాహనంపై స్వామివారు విహరించనున్నారు. జూలై 18న సాయంత్రం పల్లకీ సేవ, జూలై 19న రాత్రి 7.00 గంటలకు పార్వేట ఉత్సవం, జూలై 20న ఉదయం 9 గంటలకు వసంతోత్సవం, ఉదయం 10.30 గంటలకు త్రిశూలస్నానం, సాయంత్రం 6 గంటలకు ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.
జూలై 21వ తేదీన పుష్పయాగం నిర్వహిస్తారు. ఉదయం 9 గంటలకు శ్రీ చెన్నకేశవస్వామి, శ్రీసిద్ధేశ్వరస్వామివార్ల ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. అదేరోజు సాయంత్రం 5 నుండి రాత్రి 8 గంటల వరకు పుష్పయాగం ఘనంగా జరుగనుంది. బ్రహ్మోత్సవాల సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ హరికథలు, ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.