శ్రీ శేషాద్రి స్వామి మరణం తీర్చలేని లోటు : టిటిడి అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి _ THE DEMISE OF SHESHADRI SWAMY IS IRREVOCABLE -ADDITIONAL EO
TIRUMALA, 29 NOVEMBER 2021: The sudden demise of Srivari Temple Officer on Special Duty Sri P Seshadri is irrevocable and irreplaceable, asserted TTD Additional EO Sri AV Dharma Reddy.
Sharing his personal association with Seshadri Swamy to media persons at Tirumala on Monday the Additional EO said, Seshadri Swamy will be remembered as a most dedicated, devoted, sincere, selfless and hardworking person who always wished to breath his last while in service. He recalled the impeccable services of Sri Seshadri in Tirumala Tirupati Devasthanams since his entry into the service in 1978 till his last breath.
“Sri Venkateswara Swamy also fulfilled his wish and Sri Seshadri Swamy breathed his last while he was on duty to take part in Karthika Deepotsavam at Visakhapatnam on Monday evening. His death is an irreplaceable loss to all of us and personally for me. But Srivaru has given him sadgati on the auspicious Karthika Somavaram”, he maintained.
The Additional EO also said, Sri Seshadri Swamy has documented all the rituals, festivals, religious events that takes place in Srivari temple with every minute detail including allotment of duties in five volumes. “It will act as an encyclopedia in future related to temple affairs. So far two books got published and remaining three volumes will get ready in next two or three months time”, he said.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
శ్రీ శేషాద్రి స్వామి మరణం తీర్చలేని లోటు : టిటిడి అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి
తిరుమల, 2021 నవంబరు 29: శ్రీవారి ఆలయ ఓఎస్‌డి శ్రీ శేషాద్రిస్వామి మరణం తీర్చలేని లోటు అని టిటిడి అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి అన్నారు. తిరుమలలోని గోకులం విశ్రాంతిగృహంలో గల తన కార్యాలయంలో సోమవారం ఆయన శ్రీ శేషాద్రి స్వామితో ఉన్న వ్యక్తిగత అనుబంధాన్ని మీడియాతో పంచుకున్నారు.
శ్రీ శేషాద్రి స్వామి ఎంతో అంకితభావంతో, భక్తితో, క్రమశిక్షణతో, నిజాయితీగా టిటిడిలో సేవలు అందించారని, శ్రీవారి సేవలో ఉండగానే తుదిశ్వాస విడవాలని కోరుకునేవారని అదనపు ఈవో చెప్పారు. 1978లో టిటిడిలో ఉద్యోగంలో చేరినప్పటినుండి చివరి వరకు ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. సోమవారం సాయంత్రం విశాఖపట్నంలో కార్తీక దీపోత్సవంలో పాల్గొనేందుకు వెళ్లిన శ్రీ శేషాద్రి స్వామి విధి నిర్వహణలో ఉండగానే తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారని, ఈ మేరకు శ్రీ వేంకటేశ్వరస్వామివారు ఆయన కోరికను తీర్చారని చెప్పారు. వారి మరణం తనకు వ్యక్తిగతంగా ఎంతో బాధ కలిగించిందన్నారు. పవిత్రమైన కార్తీక సోమవారం నాడు స్వామివారు వారికి సద్గతిని కలిగించారని చెప్పారు.
శ్రీవారి ఆలయంలో కైంకర్యాలు ఇతర క్రతువుల నిర్వహణపై శ్రీ శేషాద్రి స్వామికి అపారమైన జ్ఞానం ఉందని చెప్పారు. శ్రీవారి ఆలయంలో కైంకర్యాలు, సేవలు, ఉత్సవాల నిర్వహణ, విధుల కేటాయింపు తదితర అంశాలపై ఎంతో వివరణాత్మకంగా శ్రీ శేషాద్రి స్వామి 5 సంపుటాలు రచించారని తెలిపారు. ఈ పుస్తకాలు భవిష్యత్ తరాలకు కరదీపికలా ఉపయోగపడతాయన్నారు.ఎస్వీబీసీ నిర్వహించిన వివిధ కార్యక్రమాల్లో స్వామి, అమ్మవార్లకు విశేషంగా సమర్పణ చేసేవారని, వినూత్న కార్యాచరణతో కార్యక్రమాలను విజయవంతం చేశారని వివరించారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.