THREE DAY ARTHOPLASTY SUMMIT CONCLUDES AT BIRRD _ బర్డ్ లో ప్రపంచస్థాయి వైద్యప్రమాణాలు

* MORE SUMMITS IN FUTURE -JEO (H&E)

Tirupati, 02 July 2023: TTD JEO for  (Health & Education) Smt Sada Bhargavi called upon Orthopaedic patients from all over the country to take the benefit of world-class medical infrastructure facilities available in TTD-run BIRRD hospital at affordable cost.

Addressing the concluding session of the three-day Operative Arthoplasty Summit at the grand Ridge Hotel on Sunday she said during the summit live operations were performed including critical cases like kneecap, implants etc. on 22 patients which were watched virtually by over 200 doctors across the country.

She complimented doctors who performed a kneecap transplant on a 14-year-old girl on the last day.

She also complimented BIRRD OSD Dr Reddappa Reddy, his team comprising Dr Pradip, Dr  Venugopal, Dr Deepak who had successfully conducted the summit with the support of TTD Chairman Sri YV Subba Reddy and EO Sri AV Dharma Reddy for making the maiden event in the four decades history of BIRRD possible.

Dr Reddappa Reddy said TTD has been providing free accommodation, transport, boarding, Srivari Darshan etc. for the expert doctors who are performing free service at BIRRD hospital.

Hip replacement expert Dr Krishna Kiran, HoD at Medicare Hospital of Hyderabad said the experience of interacting with young doctors was educative and thanked TTD management for the opportunity.

Dr Rajkumar Natesan, Secretary  of Indian Arthoplasty Association, Dr Sunandakumar Reddy, President of AP Orthopaedic Society, Dr Subba Reddy-Observer from Indian Medical Council, doctors from BIRRD and 

Dr Vivek representatives of the Meril organisation were also present.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

బర్డ్ లో ప్రపంచస్థాయి వైద్యప్రమాణాలు

– ఎక్కువ మంది రోగులు వినియోగించుకోవాలి

– భవిష్యత్తులో మరిన్ని జాతీయ సదస్సులు

– టీటీడీ జేఈవో శ్రీమతి సదా భార్గవి

– ముగిసిన ఆపరేటివ్ ఆర్థో ప్లాస్టీ జాతీయ సదస్సు

తిరుపతి, 2023, జూలై 02: బర్డ్ ఆసుపత్రిలో ప్రపంచ స్థాయి వైద్య ప్రమాణాలు అమలవుతున్నాయని టీటీడీ జేఈవో శ్రీమతి సదా భార్గవి చెప్పారు . ఆర్థోపెడిక్స్ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్న రోగులు ఇక్కడికి విచ్చేసి మెరుగైన చికిత్సలు పొందాలనిఆమె కోరారు. తిరుపతిలోని గ్రాండ్ రిడ్జ్ హోటల్ లో బర్డ్ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు జరిగిన జాతీయ స్థాయి ఆర్థో ప్లాస్టీ సదస్సు ఆదివారం ముగిసింది.

ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జేఈవో మాట్లాడుతూ మోకీలు మార్పిడి, తుంటి మార్పిడికి సంబంధించి బర్డ్ ఆసుపత్రిలో అత్యుత్తమ వైద్య సేవలు అందుతున్నాయన్నారు. ఎంపిక చేసిన 22 మంది పేద రోగులకు క్లిష్టమైన సర్జరీలు చేసేందుకు దేశవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన వైద్యులను పిలిపించి లైవ్ లో ఆపరేషన్లు చేశారన్నారు. దేశవ్యాప్తంగా దాదాపు 200 మంది యువ సర్జన్లు విచ్చేసి ఈ లైవ్ ఆపరేషన్లను చూసి సీనియర్ల వద్ద నుంచి తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారని వివరించారు. మూడు రోజుల్లో 22 క్లిష్టమైన ఆపరేషన్లు నిర్వహించడం గొప్ప విషయమన్నారు. చివరి రోజు 14 ఏళ్ల బాలికకు మోకీలు మార్పిడి శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించిన డాక్టర్లను అభినందించారు. ఈ సదస్సును చక్కగా నిర్వహించిన బర్డ్ ప్రత్యేకాధికారి డాక్టర్ రాచపల్లి రెడ్డెప్ప రెడ్డి, డాక్టర్ ప్రదీప్, డాక్టర్ వేణుగోపాల్, డాక్టర్ దీపక్ బృందాన్ని జేఈవో అభినందించారు. ఆర్థోపెడిక్స్ లోని వివిధ విభాగాలకు సంబంధించి భవిష్యత్తులో మరిన్ని జాతీయ సదస్సులు నిర్వహించాలని కోరారు. ఇంత చక్కటి సదస్సును నిర్వహించేందుకు ఆమోదం తెలిపిన టీటీడీ చైర్మన్ శ్రీ వైవి.సుబ్బారెడ్డికి, ఈవో శ్రీ ఏవి.ధర్మారెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు.

బర్డ్ ప్రత్యేకాధికారి డాక్టర్ రాచపల్లి రెడ్డెప్ప రెడ్డి మాట్లాడుతూ దేశంలోని వివిధ ప్రాంతాల నుండి అనేక మంది వైద్య నిపుణులు బర్డ్ కు వచ్చి పేదలకు ఉచితంగా ఆపరేషన్లు చేస్తున్నారని తెలిపారు. సదస్సులో పాల్గొన్న సర్జన్లు కూడా బర్డ్ లో పేదలకు ఉచితంగా ఆపరేషన్లు చేయడానికి ముందుకు రావాలని పిలుపు నిచ్చారు. ఇలా ఉచిత సేవ చేయడానికి ముందుకొచ్చే డాక్టర్లకు వసతి, రవాణా, భోజనం, తిరుమల స్వామివారి దర్శనం ఉచితంగా కల్పిస్తామని చెప్పారు.

హిప్ రీప్లేస్ మెంట్ నిపుణులు, హైదరాబాద్ మెడికవర్ ఆసుపత్రి హెచ్ఓడి డాక్టర్ కృష్ణ కిరణ్ మాట్లాడుతూ ఈ సదస్సులో యువ వైద్యులకు సందేహాలను నివృత్తి చేయడం సంతోషకరమన్నారు. ఈ సదస్సులో పాల్గొనే అవకాశం కల్పించినందుకు బర్డ్ ఆసుపత్రి యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ఇండియన్ ఆర్థో ప్లాస్టీ అసోసియేషన్ కార్యదర్శి డాక్టర్ రాజ్ కుమార్ నటేషన్, ఏపీ ఆర్థోపెడిక్ సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ సునందకుమార్ రెడ్డి, మెడికల్ కౌన్సిల్ అబ్జర్వర్ డాక్టర్ సుబ్బారెడ్డి, బర్డ్ వైద్యులు డాక్టర్ ప్రదీప్, డాక్టర్ వేణుగోపాల్, డాక్టర్ దీపక్, మెరిల్ సంస్థ ప్రతినిధి డాక్టర్ వివేక్ తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.