MAHA PURNAHUTI HELD _ శ్రీ కపిలేశ్వరాలయంలో మహాపూర్ణాహుతితో ముగిసిన పవిత్రోత్సవాలు
TIRUPATI, 02 JULY 2023: The three-day Pavitrotsvams concluded with Purnahuti in Sri Kapileswara Swamy temple on Sunday.
The Panchamurthies were rendered the grand Tiruchi procession in the evening.
DyEO Sri Devendra Babu and others were present.
Grihasta devotees were offered Pavitra Mala and Prasadams.
ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీ కపిలేశ్వరాలయంలో మహాపూర్ణాహుతితో ముగిసిన పవిత్రోత్సవాలు
తిరుపతి, 2023, జూలై 02: తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన పవిత్రోత్సవాలు ఆదివారం మహాపూర్ణాహుతితో వైభవంగా ముగిశాయి. ఉదయం యాగశాలపూజ, హోమం, మహాపూర్ణాహుతి, కలశోధ్వాసన, మూలవర్లకు కలశాభిషేకం, పట్టుపవిత్ర సమర్పణ చేపట్టారు.
సాయంత్రం పంచమూర్తులైన శ్రీసోమస్కందమూర్తి, శ్రీ కామాక్షి అమ్మవారు, శ్రీ విఘ్నేశ్వరస్వామి, వళ్లి దేవసేన సమేత శ్రీసుబ్రమణ్యస్వామి, శ్రీ చండికేశ్వరస్వామివారి వీధి ఉత్సవం ఘనంగా నిర్వహించారు. పవిత్రోత్సవాల్లో పాల్గొన్న భక్తులకు పవిత్రమాల, తీర్థప్రసాదాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ దేవేంద్రబాబు, ఏఈఓ శ్రీ కె.సుబ్బరాజు, కంకణభట్టార్ శ్రీ ఉదయకుమార్ గురుకుల్, సూపరింటెండెంట్ శ్రీ భూపతి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు శ్రీ రవికుమార్, శ్రీ బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.