172nd ARADHANA OF SRI THYAGARAJA ON JAN 25 AT TIRUPATI AND KAKARLA (PRAKASAM DIST)_ జనవరి 25న తిరుపతి, కాకర్లలో శ్రీత్యాగరాజస్వామి 172వ ఆరాధనోత్సవాలు
Tirupati, 22 Jan. 19: 172nd Aradhana of Sri Thyagaraja on January 25 that Tirupati and Kakarla (Prakasam Dist)
TTD plans to grandly celebrate the 172nd Aradhana of saint Poet Sri Thyagaraja Swamy on January 25 at Tirupati and Kakarla (Prakasam Dist.).
The Jayanti of Saint Poet Sri Thyagaraja Swamy is organised by the TTD Sri Venkateswara Sangeet and dance college on the Pushpa bahujana Panchami day every year to highlight his contributions and also pay tributes to counties top most Carnatic music exponent of yesteryears.
AT TIRUPATI
At the SV Sangeet and Dance College the Panchaloha idol of Sri Thyagaraja Swamy will be ceremonially garlanded and puja, abhisekam is performed to the idol along with that of? Sri Seetha Ramalakshmana and Hanuman Idols.
The Vrinda Ganjam of the sankeertans of the exponent by prominent classical singers, utsava sampradayam, Divya Nama sankeertans will follow.
AT KAKARLA
Special classical music programs are planned by TTD at the Sri Thyagarajaswamidhyana mandir from morning to evening by the artists of Annamacharya project and faculty of SV Sangeet and Dance College and present sankeertans of Sri Thyagaraja Swamy.
Smt YS Padmavati, principal of SV Sangeet and dance coll is supervising all arrangements.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI
జనవరి 25న తిరుపతి, కాకర్లలో శ్రీత్యాగరాజస్వామి 172వ ఆరాధనోత్సవాలు
తిరుపతి, 2019 జనవరి 22: సుప్రసిద్ధ వాగ్గేయకారుడు, కర్ణాటక సంగీత సామ్రాట్ శ్రీత్యాగరాజస్వామివారి 172వ ఆరాధనోత్సవాలను జనవరి 25వ తేదీ శుక్రవారం వారి స్వస్థలమైన ప్రకాశం జిల్లా కాకర్లలోనూ, తిరుపతిలోనూ టిటిడి ఘనంగా నిర్వహించనుంది. శ్రీత్యాగరాజస్వామివారు పుష్యబహుళ పంచమి నాడు పరమపదించారు. టిటిడి శ్రీవేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో ఇందుకోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. వాగ్గేయకార వైభవం కార్యక్రమంలో భాగంగా టిటిడి ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
తిరుపతిలో…
తిరుపతిలోని ఎస్వీ సంగీత, నృత్య కళాశాలలో ఉదయం 8.30 గంటల నుండి సద్గురు శ్రీత్యాగరాజస్వామివారి పంచలోహవిగ్రహానికి పంచామృతాభిషేకం, శ్రీ హనుమత్ సమేత సీతారామలక్ష్మణ విగ్రహాలకు పూజలు నిర్వహిస్తారు. ఆ తరువాత ప్రముఖ సంగీత కళాకారులతో త్యాగరాజ కృతుల బృందగానం చేస్తారు. అదేవిధంగా, ఉత్సవ సంప్రదాయ, దివ్యనామ సంకీర్తనలు, పంచరత్న కృతులను ఆలపిస్తారు.
కాకర్లలో…
ప్రకాశం జిల్లా కాకర్లలోని శ్రీత్యాగరాజస్వామివారి ధ్యానమందిరంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా టిటిడి అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు, ఎస్వీ సంగీత కళాశాల అధ్యాపకులు కలిసి శ్రీ త్యాగరాజస్వామివారి పంచరత్న కృతులను గానం చేస్తారు.
శ్రీవేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి వైవిఎస్.పద్మావతి ఆధ్వర్యంలో ఇందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.