ELABORATE ARRANGEMENTS FOR RATHASAPTHAMI_ JEO RAJU_ రథసప్తమికి విస్తృత ఏర్పాట్లు – తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు

Tirumala, 22 Jan. 19: Tirumala JEO Sri KS Sreenivasa Raju today directed the TTD officials to make elaborate arrangements for convenience of thousands of devotees likely to visit Tirumala on February 12, holy festival of Ratha Sapthami.

Speaking to reporters after a review meeting at the Annamaiah Bhavan here the JEO directed the officials of Annaprasadam, Engineering, Health, Garden, Sri Vari Temple, Srivari Sevakulu, Vigilance, SVBC, HDPP to take several steps for smooth and successful conduction of all seven vahanams on the day.

He all essential services like medical, medicine and ambulance be kept ready at mada streets for devotees convenience as their number has been ever spiralling from 25,000 of past to about one lakh these dates for the festival.

He said engineering department should install 20 LED screens at mada streets and Annaprasadam department to provide drinking water, buttermilk, sambar rice, curd rice, pulihara, pongal etc. in the galleries. The health department should ensure supply of drinking water etc. through Srivari Sevakulu and scouts and guides.

He also directed the garden department to decorate the shrine with flowers green and banana plants all around.

He said in order to extend the number of food counters the existing kitchen at PAC-2 Would day be expanded. The health officer was directed to gear up additional ECI all staff for service to devotees at the holy Thirthams of Tirumala on auspicious festivities.

He said in view of devotees rush on Ratha sapthami day all Arjitha sevas and special entry fir aged, challenged and parents within fats were cancelled. The TTD vigilance officials were also directed to take efficient steps for fool proof security to devotees at both the mada street galleries and Swami Pushkarani.

The JEO review meeting also condoled death of one Assistan Engineer Sri Venugopal while making arrangements for Sri Ramakrishna Thirtham Mukkoti festival.

FACAO Sri O Balaji, CE Sri Chandrasekhar Reddy, SE-2 Sri Ramachandra Reddy, Heath officer Dr Sharmista, SE Electrical Sri Venkateshwarlu, DyEO Srivari temple Sri Harindranath, and others participated.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

రథసప్తమికి విస్తృత ఏర్పాట్లు – తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు

తిరుమల, 22 జనవరి 2019: సూర్య జయంతి సందర్భంగా ఫిబ్రవరి 12వ తేదీ రథసప్తమి పర్వదినానికి విచ్చేసే వేలది మంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా విస్తృత ఏర్పాట్లు చేయాలని టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు అధికారులను ఆదేశించారు. తిరుమల అన్నమయ్య భవనంలో టిటిడి అధికారులతో మంగళవారం నాడు తిరుమల జెఈవో సమీక్షాసమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ రథసప్తమి సంబంధించిన ఏర్పాట్లపై అన్నప్రసాదం, ఆరోగ్యశాఖ, ఇంజనీరింగ్‌ విభాగం, ఆలయం, ఉద్యానవనశాఖ, శ్రీవారి సేవ, భద్రతా విభాగం, ఎస్వీబీసి, ధర్మప్రచారపరిషత్‌ తదితర విభాగాధిపతులకు పలు సూచనలు చేశారు. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని సూర్యోదయం నుండి చంద్రోదయం వరకు తిరుమలలో ఏడు వాహనాలపై స్వామివారి ఉరేగింపును తిలకించడానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వివిధ విబాగాధిపతులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ఆయన ఆదేశించారు. అత్యవసర సేవలందించడానికి వీలుగా వైద్య సిబ్బంది, మందులు, అంబులెన్సు వాహనాలను కూడా సిద్ధంగా ఉంచుకోవాలని ఆయన వైద్యాధికారులకు సూచించారు.

వాహనాలు తిలకించడానికి తిరుమాఢ వీధులలో భక్తులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు గ్యాలరీలపై పాక్షిక షెడ్‌ ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్‌ అధికారులకు సూచించారు. అదేవిధంగా గ్యాలరీలోని భక్తులు వాహనసేవలు వీక్షించేందుకు 20 ఎల్‌ఇడి స్క్రీన్‌లు ఏర్పాటు చేయాలన్నారు. అన్నప్రసాదం అధికారులు ఉదయం 4.00 నుండి రాత్రి 9.00 గంటల వరకు గ్యాలరీలలో వాహనాలను తిలకించడానికి వేచి ఉండే భక్తులకు తాగునీరు, మజ్జిగ, సాంబారు అన్నం, పెరుగు అన్నం, పులిహోర, పొంగలి వంటి అన్న ప్రసాదాలను నిరంతరాయంగా పంపిణీ చేయాలని ఆదేశించారు. శ్రీవారి భక్తుల దాహార్తిని తీర్చడానికి శ్రీవారి సేవకులు మరియు స్కౌట్‌ అండ్‌ గైడ్సు సహకారంతో ఎప్పటికప్పుడు తాగునీరు అందించాలని ఆరోగ్యశాఖ అధికారులకు సూచించారు. మాడవీధులలో భక్తులకు అందుతున్న సౌకర్యాలను సీనియర్‌ అధికారులు పర్యవేక్షిస్తారన్నారు. రథసప్తమి సందర్భంగా వివిధ రకాల ఫలపుష్పాలతో, పచ్చని తోరణాలతో, అందమైన అరటి చెట్లతో పందిళ్ళను ఏర్పాటు చేసి తిరుమాడ వీధులను అందంగా అలంకరించాలని ఉద్యానవన విభాగం అధికారులను జెఈవో ఆదేశించారు.

అదేవిధంగా తిరుమలలోని వివిధ ప్రాంతాలలోని ఫుడ్‌కౌెంటర్ల ద్వారా వేలాదిమంది భక్తులకు అన్నప్రసాదాలు అందిస్తున్నట్లు తెలిపారు. ఇందుకొరకు పిఏసి-2లోని వంటశాలను విస్తరించడానికి చర్యలు తీసుకుంటునట్లు తెలిపారు. తిరుమలలోని పద్మావతి అతిథి గృహల సమూదాయంలో నూతనంగా హరిహర సదన్‌, సన్నిదానం దగ్గర మరొక అతిథి గృహం భక్తులకు అందుబాటులోనికి తీసుకురానున్నట్లు తెలిపారు. తిరుమలలోని పుణ్య తీర్థ్థాలలో జరిగే ప్రత్యేక పర్వదినాలలో అత్యవసర వైద్య సిబ్బందిని ఏర్పాటు చేయాలని ముఖ్య వైద్యాధికారిని ఆదేశించారు.

రథసప్తమిని పురస్కరించుకొని ఆర్జిత సేవలను రద్దు చేసినట్టు తెలిపారు. ఆ రోజున ఎటువంటి ప్రత్యేక దర్శనాలు (వయోవృద్ధులు, వికలాంగులు మరియు చంటిపిల్లల తల్లిదండ్రులకు) ఉండవని తెలిపారు. అదే విధంగా భక్తుల రద్దీ దృష్టిలో ఉంచుకొని టిటిడి భద్రతా విభాగం మరియు పోలీసు అధికారులను గ్యాలరీల చెంత, అదేవిధంగా చక్రస్నానం జరిగే స్వామివారి పుష్కరిణి చెంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని జెఈవో ఆదేశించారు. అంతకుముందు శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి ఏర్పాట్లలో విధులు నిర్వహిస్తు ఆకస్మికంగా మృతి చెందిన ఎఇ శ్రీ వేణుగోపాల్‌కు సంతాపం తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో టిటిడి ఎఫ్‌ఏ అండ్‌ సిఎవో శ్రీ బాలాజి, సిఇ శ్రీ చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్‌.ఇ-2 రామచంద్రరెడ్డి, ఆరోగ్యవిభాగం అధికారి డా|| శర్మిష్ఠ, ఎస్‌.ఇ ఎలక్ట్రికల్‌ శ్రీ వెంకటేశ్వర్లు, డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాధ్‌, ఇతర విభాగాధిపతులు పాల్గొన్నారు.

రథసప్తమి నాడు వాహనసేవల వివరాలు :

సూర్యప్రభ వాహనం ఉదయం 5.30 గం||ల నుంచి 8.00 గం||ల వరకు

చిన్నశేష వాహనం ఉదయం 9.00 గం||ల నుంచి 10.00 గం||ల వరకు

గరుడ వాహనం ఉదయం 11.00 గం||ల నుంచి 12.00 గం||ల వరకు

హనుమంత వాహనం మధ్యాహ్నం 1.00 గం||ల నుంచి 2.00 గం||ల వరకు

చక్రస్నానం మధ్యాహ్నం 2.00 గం||ల నుంచి 3.00 గం||ల వరకు

కల్పవృక్ష వాహనం సాయంత్రం 4.00 గం||ల నుంచి 5.00 గం||ల వరకు

సర్వభూపాల వాహనం సాయంత్రం 6.00 గం||ల నుంచి 7.00 గం||ల వరకు

చంద్రప్రభ వాహనం రాత్రి 8.00 గం||ల నుంచి 9.00 గం||ల వరకు

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.