TIRUMALA DAMS SHOWS PROGRESS _ తిరుమలలో పెరిగిన జలాశయాల‌ నీటిమట్టం

Tirumala, 20 Oct. 19: Due to the recent rainfall,  the various dams in Tirumala have shown progress in water levels. 

The current water position in various dams at Tirumala including Kalyani Dam at Tirupati will suffice the needs for the next 295days. 

While the total capacity of water storage in different dams at Tirumala is 5, 047 million litres, the present capacity is 2, 164 million litres. 

The average consumption of water everyday in Tirumala is 14million litres which will be reached by the water sources including Papavinasanam,  Akasa Ganga,  Kumaradhara and Pasupudhara, Gobarbham dams at Tirumala besides Kalyanidam at Tirupati.

With the recent rains over 50 percent of water needs have been met out.  When the total capacity of all dams is 5,312 lakh gallons, the present level in all dams is 3,892 lakh gallons.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరుమలలో పెరిగిన జలాశయాల‌ నీటిమట్టం

అక్టోబ‌రు 20, తిరుమల, 2019:   తిరుమలలోని జలశయాల్లో నీటిమట్టం పెరిగింది. తిరుప‌తిలోని క‌ల్యాణి డ్యామ్‌, తిరుమ‌ల‌లోని జ‌లాశ‌యాల్లో క‌లిపి రానున్న 295 రోజుల‌కు స‌రిప‌డా నీటి నిల్వ‌లున్నాయి. శ్రీవారి ఆశీస్సులతో ఇటీవల విస్తారంగా వర్షాలు కురిశాయి. తిరుమలలోని జలాశయాల్లో మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 5,047 మిలియన్‌ లీటర్లు కాగా, ప్రస్తుతం 2,164 మిలియన్‌ లీటర్ల నీరు నిల్వ ఉంది.

 ప్రస్తుతం తిరుమలలో భక్తులకు సరాసరిన రోజుకు 14 మిలియన్‌ లీటర్ల నీరు అవసరమవుతోంది. తిరుమలలో గోగర్భం, పాపవినాశనం, ఆకాశగంగ, కుమారధార మరియు పసుపుధార జలాశయాలు ప్రధాన నీటి వనరులుగా ఉన్నాయి. తిరుపతిలోని కల్యాణి డ్యామ్‌లో 700 ఎంసిఎఫ్‌టి(మిలియ‌న్ క్యూబిక్ ఫీట్‌) నీరు నిల్వ ఉంది.

గోగర్భం డ్యామ్‌ పూర్తి నిల్వ సామర్థ్యం 2,683 లక్షల గ్యాలన్లు కాగా, ప్రస్తుతం 539 లక్షల గ్యాలన్ల నీరు నిల్వ ఉంది. పాపవినాశనం డ్యామ్‌ పూర్తి నిల్వ సామర్థ్యం 5,215 లక్షల గ్యాలన్లు కాగా ప్రస్తుతం 1,128 లక్షల గ్యాలన్ల నీరు నిల్వ ఉంది. ఆకాశగంగ డ్యామ్‌ పూర్తి నిల్వ సామర్థ్యం 670 లక్షల గ్యాలన్లు కాగా, ప్రస్తుతం 390 లక్షల గ్యాలన్ల నీరు నిల్వ ఉంది. కుమారధార మరియు పసుపుధార డ్యామ్‌ పూర్తి నిల్వ సామర్థ్యం 5,312 లక్షల గ్యాలన్లు కాగా, ప్రస్తుతం 3,892 లక్షల గ్యాలన్ల నీరు నిల్వ ఉంది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.