TIRUMALA JEO AND TIRUPATI URBAN SP INSPECTS V-DAY ARRANGEMENTS_ వైకుంఠ ఏకాదశి క్యూలైన్లను పరిశీలించిన తిరుమల జెఈవో, అర్బన్‌ ఎస్పీ

Tirumala, 22 December 2017: Tirumala JEO Sri KS Sreenivasa Raju along with Tirupati Urban SP Sri Abhishek Mohanty inspected the queue line arrangements on Friday evening in Tirumala for the upcoming mega religious event of Vaikuntha Ekadasi which falls on December 29.

As a part of it they inspected the 2.35km queue line laid starting from Gogarbham dam junction near Kalyana Vedika to VQC to junction.

Later speaking to media, the JEO said, after Garuda Seva among the major religious events in Tirumala temple, pilgrims throng in large numbers on this auspicious day of Vaikuntha Ekadasi to have “Uttara Dwara Darshanam”.

“Earlier we had provided darshan to nearly 1.70 lakh pilgrims on Vaikuntha Ekadasi and Dwadasi. As the auspicious day is falling on Friday this year, due to Dhanurmasa Pujas and Abhisheka Kainkaryam, we can provide darshan to common pilgrims for 39-40 hours on Ekadasi and Dwadasi. As the pilgrims wants to have Uttara Dwara darshan on Vaikuntha Ekadasi on first day itself we will allow the pilgrims into the compartments by 10am on wards on December 28. To cope up the rush we have laid queue lines stretching up to 1.8km in Narayanagiri Gardens, Alwar Tank and a new line of 2.35km from Gogarbham Junction to VQC 2 junction for the sake of multitude of visiting pilgrims. We have also planned food and water arrangements in a big way for this important occasion”, he added.

SNAKE CATCHERS ENGAGED

To provide security cover to pilgrims from venomous snakes near Gogarbham Forest area, we are also engaging snake catchers. Apart from this snake repellent chemical powders will be sprayed all along the queue line by health department on regular basis, the JEO added.

1400 POLICE TO VIGIL EKADASI

As tens of thousands of pilgrims are expected to converge for Vaikuntha Ekadasi Dwara Darshan, over 1400 police from different parts of the districts and also from neighbouring states are going to be engaged for the mega religious event, said, Tirupati Urban SP Sri Abhishek Mohanty. He also said crime parties will also be deployed to prevent thefts. “We ensure foolproof security cover to pilgrims in co-ordination with TTD Vigilance department”, he maintained.

SE II Sri Ramachandra Reddy, EE Sri Prasad, Sri T Venkateswarulu, DyEO Annaprasadam Sri Venugopal and other officers were also present.

JEO INSPECTS TEMPLE

As the Vaikuntha Ekadasi is fast approaching, Tirumala JEO Sri KS Sreenivasa Raju inspected the ongoing arrangements for the big day in Tirumala on Friday.

He also inspected the ongoing works for the renovation of Vakula Mata Potu inside the temple.

SE II Sri Ramachandra Reddy, EEs Sri Prasad, Sri Srinivasa Rao and others were also present.


ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

వైకుంఠ ఏకాదశి క్యూలైన్లను పరిశీలించిన తిరుమల జెఈవో, అర్బన్‌ ఎస్పీ

డిసెంబరు 22, తిరుమల 2017: తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగే విశేష పర్వదినాల్లో ఒకటైన వైకుంఠ ఏకాదశికి పెద్దసంఖ్యలో విచ్చేసే భక్తుల సౌకర్యార్థం నూతనంగా ఏర్పాటుచేస్తున్న క్యూలైన్లను శుక్రవారం సాయంత్రం టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు, తిరుపతి అర్బన్‌ ఎస్పీ శ్రీ అభిషేక్‌ మహంతి కలిసి పరిశీలించారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌-2 నుంచి కల్యాణవేదిక వరకు 2.3 కి.మీ మేర ఏర్పాటుచేసిన నూతన క్యూలైన్‌ను పరిశీలన చేపట్టారు.

అనంతరం జెఈవో మీడియాతో మాట్లాడుతూ ఏకాదశి, ద్వాదశి రెండు రోజులు కలిపి సుమారు 1.70 లక్షల మంది భక్తులకు వైకుంఠద్వార దర్శనం చేయించే సామర్థ్యం టిటిడికి ఉందని, వైకుంఠ ఏకాదశి శుక్రవారం రావడంతో శ్రీవారికి అభిషేకాది కైంకర్యాలు, ధనుర్మాస పూజల కారణంగా సర్వదర్శనం భక్తులకు 40 గంటల సమయం మాత్రమే మిగిలిందన్నారు. డిసెంబరు 28వ తేదీ ఉదయం 10 గంటల నుంచి భక్తులను కంపార్ట్‌మెంట్లలోకి అనుమతిస్తామని, కంపార్ట్‌మెంట్లు నిండిన తరువాత వచ్చే భక్తుల కోసం ఆళ్వార్‌ ట్యాంకు, నారాయణగిరి ఉద్యానవనాలు, వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-2, కర్ణాటక సత్రాలు, అహోబిల మఠం, ఉత్తర మాడ వీధి పైభాగాన, ఎ టైప్‌ క్వార్టర్స్‌, బాట గంగమ్మ గుడి వద్ద రింగ్‌ రోడ్డు నుంచి కల్యాణవేదిక వరకు క్యూలైన్‌ ఏర్పాటుచేసినట్టు చెప్పారు. ఈ క్యూలైన్‌లో 42 వేల మంది, నారాయణగిరి ఉద్యానవనాల్లో ఏర్పాటుచేసిన 20 తాత్కాలిక షెడ్లలో 20 వేల మంది, వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-2లో 16 వేల మంది, వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-1లో 16 వేల మంది భక్తులు ఉండేందుకు వీలుగా ఏర్పాట్లు చేపట్టామన్నారు.

డిసెంబరు 27వ రాత్రి నుంచి పోలీసులు బయటి క్యూలైన్లలో భక్తుల రద్దీని క్రమబద్ధీకరిస్తారని జెఈవో తెలిపారు. డిసెంబరు 28న కంపార్ట్‌మెంట్లు, క్యూలైన్లలోకి ప్రవేశించే భక్తులు 24 గంటలకు పైగా వేచి ఉండాల్సి వస్తుందని, ఈ సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమయానుసారం అన్నప్రసాదాలు, తాగునీరు పంపిణీ చేయాలని, మరుగుదొడ్లు, వైద్యసౌకర్యాలు కల్పిస్తామని జెఈవో తెలిపారు. ఈ పర్వదినాల కారణంగా ఆర్జితసేవలను, దివ్యదర్శనం టోకెన్లను, ఇతర ప్రత్యేక దర్శనాలను రద్దు చేశామని చెప్పారు. పాములు రాకుండా ఆరోగ్య విభాగం ఆధ్వర్యంలో తగిన చర్యలు చేపట్టామని, అవసరమైన చోట్ల పాములు పట్టేవారిని అందుబాటులో ఉంచుతామని వివరించారు.

అర్బన్‌ ఎస్పీ శ్రీ అభిషేక్‌ మహంతి మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల్లో భక్తుల రద్దీని క్రమబద్ధీకరించేందుకు 1400 మంది పోలీసులను అందుబాటులో ఉంచుతామన్నారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా వాహనాల పార్కింగ్‌ కోసం ఏర్పాట్లు చేపట్టినట్టు తెలిపారు. దొంగతనాలను అరికట్టేందుకు క్రైమ్‌ పోలీసులను ఏర్పాటుచేస్తామన్నారు. టిటిడి నిఘా, భద్రత అధికారులతో సమన్వయం చేసుకుని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా భద్రతా ఏర్పాట్లు చేపడతామన్నారు.

జెఈవో వెంట టిటిడి ఎస్‌ఇ-2 శ్రీ రామచంద్రారెడ్డి, ఇఇలు శ్రీ ప్రసాద్‌, శ్రీ టి.వేంకటేశ్వర్లు, డెప్యూటీ ఈవో శ్రీ వేణుగోపాల్‌ ఇతర అధికారులు ఉన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.