TIRUMALA JEO INSPECTS SSD COUNTERS COUNTERS ARE BEING CONTEMPLATED AT TIRUPATI ALSO-JEO _ సమయ నిర్దేశిత సర్వదర్శనం కౌంటర్లను పరిశీలించిన జెఈవో భవిష్యత్తులో తిరుపతిలోనూ సర్వదర్శనం కౌంటర్లు
TIRUMALA JEO INSPECTS SSD COUNTERS
COUNTERS ARE BEING CONTEMPLATED AT TIRUPATI ALSO-JEO
Tirumala 15 December 2017 ; With just two days lefts for the prestigious and innovative scheme of issuing time slotted tokens to Sarva Darshan pilgrims also on the lines of Rs.300 and footpath pilgrims which is set to commence from December 18 to 23 on an experimental basis, the Tirumala JEO Sri KS Sreenivasa Raju inspected the counters in Tirumala on Friday evening.
Speaking to media persons on this occasion the JEO said, TTD has deputed 80 senior officers, 300 employees, 75 Trilok and 50 Bank of Baroda employees to maintain the 117 counters located in 14 locations at Tirumala. “Following the feed back received from the pilgrims, we will take further initiative to implement this revolutionary scheme in February or March next in a full-fledged manner”, he maintained.
Adding further he said, based on the observations, we are contemplating to set up the Slotted Sarva Darshan (SSD) counters in Tirupati also to facilitate pilgrims to visit sub-temples in and around Tirupati.
ORIENTATION PROGRAMME HELD:
Earlier, orientation programme to the deputed employees was held in Annamaiah Bhavan in Tirumala. The IT wing explained the issuance of SSD tokens to pilgrims through power point presentation. Later the Temple Dy EO Sri Kodanda Rama Rao, Annaprasadam DyEO Sri Venugopal and Catering Officer Sri GLN Shastry, IT and Transport wing head Sri Sesha Reddy, VGO Sri Ravindra Reddy explained the employees about the various arrangements made to them.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
సమయ నిర్దేశిత సర్వదర్శనం కౌంటర్లను పరిశీలించిన-జెఈవో_భవిష్యత్తులో తిరుపతిలోనూ సర్వదర్శనం కౌంటర్లు
డిసెంబరు 15, తిరుమల, 2017 సర్వదర్శనం భక్తులకు నిర్దేశిత సమయంలో స్వామివారి దర్శనం కల్పించేందుకు తిరుమలలో ఏర్పాటుచేసిన కౌంటర్లను శుక్రవారం సాయంత్రం టిటిడి తిరుమల జెఈవో శ్రీకె.ఎస్.శ్రీనివాసరాజు పరిశీలించారు. సిఆర్‌వో, సప్తగిరి సత్రాల ప్రాంతంలో కౌంటర్ల పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా జెఈవో మీడియాతో మాట్లాడుతూ నడకదారి భక్తులకు, రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తుల తరహాలోనే సర్వదర్శనం భక్తులకు టైమ్‌స్లాట్ విధానాన్ని అమలుచేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. డిసెంబరు 18 నుంచి 23వ తేదీ వరకు ఆరు రోజుల పాటు ప్రయోగాత్మకంగా టోకెన్లు జారీ చేసి భక్తులకు నిర్దేశిత సమయంలో శ్రీవారి దర్శనం కల్పిస్తామన్నారు. ఇందుకోసం మొత్తం 117 కౌంటర్లలో 80 మంది అధికారులు, 300 మంది టిటిడి సిబ్బంది, 75 మంది త్రిలోక్ సిబ్బంది, 50 మంది బ్యాంక్ ఆఫ్ బరోడా సిబ్బందికి మూడు షిప్టుల్లో విధులు కేటాయించినట్లు తెలిపారు. సోమవారం ఉదయం 6 గంటల నుంచి కౌంటర్లలో టోకెన్లు మంజూరుచేస్తామన్నారు. టైమ్‌స్లాట్ సమయం, టోకెన్ల లభ్యత సమాచారాన్ని ప్రదర్శనాబోర్డుల ద్వారా భక్తులకు తెలియజేస్తామని చెప్పారు. భక్తుల నుంచి, పర్యవేక్షణ అధికారుల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకుని లోటుపాట్లను సవరించుకుంటామని, ఫిబ్రవరి, మార్చి నెలల్లో పూర్తిస్థాయిలో అమలుచేస్తామని వెల్లడించారు. రానున్న కాలంలో తిరుపతిలోనూ సమయ నిర్దేశిత సర్వదర్శనం కౌంటర్లు ఏర్పాటుచేసి భక్తులు స్థానికాలయాలను సందర్శించే అవకాశం కల్పిస్తామన్నారు.
అంతకుముందు తిరుమలలోని అన్నమయ్య భవనంలో అధికారులకు, సిబ్బందికి అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఐటి విభాగం అధికారులు టోకెన్లు మంజూరులో తీసుకోవాల్సిన జాగ్రత్తలను పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం అన్నప్రసాదం, ఆలయం, విజిలెన్స్, ట్రాన్స్‌పోర్టు అధికారులు తమ విభాగాల ఆధ్వర్యంలో చేపట్టిన ఏర్పాట్లను తెలియజేశారు. అనంతరం పలు కౌంటర్లలో టోకెన్ల జారీని ప్రయోగాత్మకంగా పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ కోదండరామారావు, అన్నదానం డెప్యూటీ ఈవో శ్రీ వేణుగోపాల్, ఐటి మరియు రవాణా విభాగాధిపతి శ్రీ శేషారెడ్డి, క్యాటరింగ్ అధికారి శ్రీజిఎల్‌ఎన్.శాస్త్రి, విజివో శ్రీ రవీంద్రారెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.