TIRUMALA JEO REVIEWS RATHA SAPTHAMI ARRANGEMENTS _ రథసప్తమి ఏర్పాట్లపై అధికారులతో తిరుమల జెఈవో సమీక్ష

TIRUMALA, FEB 6:  Tirumala Tirupati Devasthanams JEO Tirumala, Sri KS Sreenivasa Raju on Wednesday reviewed with the heads of various departments over the ongoing arrangements for Ratha Sapthami which falls on February 17.
 
The JEO called upon the officers of TTD not to compromise on arrangements in the pilgrim front as there heavy influx of pilgrims is being expected for the annual event. “As the processional deity of Lord Malayappa Swamy will take a celestial ride on seven vahanams from desk to dawn on a single day giving a rare glimpse to the multitude of devotees who converge to witness the grandeur of Lord, we should not compromise on arrangements including security, providing annaprasadams, water etc.”, he added.   
 
Speaking on this occasion the JEO said “The vahana vaibhavam begins at 5.30am with Surya Prabha Vahanam and concludes by 9pm with Chandra Prabha vahanam with Chakra Snanam being performed to Sudarshana Chakrattalwar between 1pm to 2pm. There will be around 300 Sulabh workers and 400 Srivari Sevaks rendering services to pilgrims in galleries the entire day”, he added.
 
He asked the Vigilance department to make necessary security arrangements even to Swamy Pushkarini as heavy pilgrim crowd is expected.
 
The JEO said VIP beginning break darshan will commence on that day by 3.30am itself and there will be no privilege darshan for aged and physically handicapped pilgirms.”The Vedic Students will form Vaidika Haram like in annual brahmotsavams in front of every vahanam during procession”, he maintained.
 
CVSO Sri GVG Ashok Kumar, Additional CVSO Sri Siva Kumar Reddy, SE II Sri Ramesh Reddy, GM Transport Sri Sesha Reddy and other officials were also present.
 
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
 
రథసప్తమి ఏర్పాట్లపై అధికారులతో తిరుమల జెఈవో సమీక్ష

తిరుమల, ఫిబ్రవరి 06, 2013: మాఘమాసం శుద్ధ సప్తమినాడు సూర్య జయంతి సందర్భంగా ఫిబ్రవరి 17వ తేదీ ఆదివారం నాడు తిరుమలలో వేడుకగా నిర్వహించే రథసప్తమి పండుగ ఏర్పాట్లపై తిరుమల అన్నమయ్య భవనంలో తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు తితిదే అధికారులతో బుధవారం నాడు సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన ఆరోగ్యశాఖ, ఇంజినీరింగ్‌ విభాగం, ఆలయ, ఉద్యానవనశాఖ, శ్రీవారి సేవ, భద్రతా విభాగం తదితర విభాగాధిపతులకు రథసప్తమి ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని ఉదయం 5.30 గంటల నుండి రాత్రి 9.00 గంటల వరకు శ్రీ మలయప్పస్వామివారు సప్తవాహనాలపై ఊరేగుతూ భక్తులను అనుగ్రహిస్తారని తెలిపారు.  ఒకేరోజు ఏడు వాహనాలపై స్వామివారి వైభవాన్ని తిలకించేందుకు వచ్చే వేలాది మంది భక్తులకు  ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. 300 మంది సులభ్‌ కార్మికులు, 400 మంది శ్రీవారి సేవకులతో గ్యాలరీల్లోని భక్తులకు అన్నప్రసాదం, తాగునీరు, మజ్జిగ పంపిణీ చేయాలని ఆదేశించారు. స్వామివారి వాహనాల ముందు రక్షణ కవచంగా వేద విద్యార్థులతో వైదికహారం ఏర్పాటు చేయాలన్నారు.
ఫిబ్రవరి 17వ తేదీ ఆదివారం కావడంతో ఉదయం 3.30 గంటలకే విఐపి బ్రేక్‌ దర్శనం ప్రారంభమవుతుందని, ఉదయం 5.30 గంటలకు సూర్యప్రభ వాహనం మొదలవుతుందని, సాయంత్రం బ్రేక్‌ దర్శనం ఉండదని జెఈవో తెలిపారు. ఇతర ఆర్జితసేవలన్నీ రద్దు చేస్తున్నట్టు వివరించారు. సుప్రభాతం, తోమాల, అర్చన సేవలను ఏకాంతంలో నిర్వహిస్తారని వెల్లడించారు. తిరుమాడ వీధుల్లో స్వామివారి ఊరేగింపు సమయంలో సర్కారు హారతి మాత్రమే ఉంటుందని, ఇతర హారతులు ఉండవని తెలిపారు. రథసప్తమి నాడు వృద్ధులు, వికలాంగులకు ప్రత్యేక దర్శనం రద్దు చేస్తున్నట్టు చెప్పారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తితిదే భద్రతా విభాగం, పోలీసు అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య నిఘా మరియు భద్రతాధికారి శ్రీ జివిజి.అశోక్‌కుమార్‌, అదనపు సివిఎస్‌ఓ శ్రీ శివకుమార్‌రెడ్డి, ఎస్‌ఈ-2 శ్రీ రమేష్‌రెడ్డి, ఎస్‌ఈ ఎలక్ట్రికల్స్‌ శ్రీ వేంకటేశ్వర్లు, ట్రాన్స్‌పోర్టు జిఎం శ్రీ శేషారెడ్డి, అన్నదానం డెప్యూటీ ఈఓ శ్రీమతి సంపతి, ఆలయ పేష్కారు శ్రీ కోదండరామారావు, క్యాటరింగ్‌ ఆఫీసర్‌ శ్రీ శాస్త్రి ఇతర అధికారులు పాల్గొన్నారు.
    
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.