TIRUMALA NAMBI AVATAROTSAVAM HELD_ శ్రీవారికి తీర్థ కైకర్యం చేసిన తిరుమల ప్రథమ పౌరుడు శ్రీ తిరుమలనంబి – టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పి.బసంత్‌కుమార్
Tirumala, 6 Sep. 19: The 1046th Avatarotsavam of Sri Tirumala Nambi was held in Tirumala on Friday with utmost devotion and religious fervour.
The descendants of Tirumala Nambi observed the fete from 9am to 6pm by means of religious discourses by scholarly persons.
Sri Nambi was the maternal uncle of Saint Sri Ramanujacharya who pioneered kainkaryams in Tirumala temple.
While Sri Tirumala Nambi is known for having introduced Theertha Kainkaryam in the hill shrine some centuries ago which is continuing till today.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
శ్రీవారికి తీర్థ కైకర్యం చేసిన తిరుమల ప్రథమ పౌరుడు శ్రీ తిరుమలనంబి – టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పి.బసంత్‌కుమార్
తిరుమల, 2019 సెప్టెంబర్ 06: శ్రీవేంకటేశ్వరస్వామివారికి తీర్థ కైకర్యం చేసిన తిరుమల ప్రథమ పౌరుడు శ్రీ తిరుమలనంబి అని తిరుపతి జెఈవో శ్రీ పి.బసంత్‌కుమార్ అన్నారు. శ్రీవారి ఆలయ దక్షిణ మాడ వీధిలో గల శ్రీ తిరుమలనంబి 1046వ అవతారోత్సవాలలో శుక్రవారం ఉదయం తిరుపతి జెఈవో పాల్గొన్నారు. ఇందులో భాగంగా తిరుమలనంబి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ శ్రీవారి కైంకర్యాలు చేసేందుకు శ్రీ తిరుమలనంబి 973వ సంవత్సరంలో తిరుమలకు చేరుకున్నారని తెలిపారు. ఆయన తన తాతగారు అయిన యమునాచార్యుల ఆజ్ఞతో తిరుమలకు వచ్చి పాపవినాశనం తీర్థం నుండి ప్రతిరోజూ జలాన్ని తీసుకువచ్చి శ్రీవారిని అభిషేకించేవారన్నారు. వృద్ధాప్యంలో కూడా పాపనాశనం తీర్థం నుండి తీసుకువస్తునప్పుడు స్వామివారు జాలిపడి అంజనాద్రిలో ఉద్భవింపచేసిన ఆకాశగంగ తీర్థంతో అభిషేకం చేయవలసిందిగా ఆజ్ఞాపించినట్లు పురాణాల ద్వారా తెలుస్తొందన్నారు.
తిరుమలనంబి స్వామివారికి పుష్పకైంకర్యం, మంత్రపుష్పకైంకర్యం, వేదపారాయణ కైకర్యం, ఇతర కైంకర్యాలను చేస్తూ తిరుమలలో ఉంటూ అపరభక్తుడిగా నిలిచాడని, శ్రీమద్ రామానుజాచార్యులకు రామాయణంలోని 18 రహస్యార్థాలను చెప్పి, విశిష్టాద్వైత మతానికి పునాది వేశారని తెలియజేశారు. శ్రీవారి వైభవాన్ని నలుదిశలా చాటడానికి కృషి చేసిన పరమ భక్తుల జన్మదినాల సందర్భంగా ప్రతి సంవత్సరం వారి పేరుపై ఉన్న ఉప ఆలయాల్లో వార్షికోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు.
అనంతరం ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్నాటక, కేరళ రాష్ట్రాల నుండి విచ్చేసిన 16 మంది ప్రముఖ పండితులు శరణాగతి తత్వాన్ని గురించి ప్రసంగించారు.
ఈ కార్యక్రమంలో శ్రీ తిరుమలనంబి వంశీకులు శ్రీ తాతాచార్య కృష్ణమూర్తి, శ్రీ సి.రంగనాథన్, ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు అధికారులు, ఇతర అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.