PAVITROTSAVAMS IN JAMMALAMADUGU TEMPLE_ సెప్టెంబరు 8 నుండి 10వ తేదీ వరకు జమ్మలమడుగులోని శ్రీ నరపుర వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు

Tirupati, 6 Sep. 19: The annual three day Pavitrotsavams in Sri Narapura Venkateswara Swamy temple in Jammaladugu of YSR Kadapa district will be observed from September 8-10 with Ankurarpanam on September 7.

DyEO Sri Govindarajan is supervising the arrangements for the festival.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

సెప్టెంబరు 8 నుండి 10వ తేదీ వరకు జమ్మలమడుగులోని శ్రీ నరపుర వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు

తిరుపతి, 2019 సెప్టెంబ‌రు 06: టిటిడికి అనుబంధంగా ఉన్న వైఎస్‌ఆర్‌ కడప జిల్లా జమ్మలమడుగులోని శ్రీ నరపుర వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో సెప్టెంబరు 8 నుండి 10వ తేదీ వరకు పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. శ‌నివారం సాయంత్రం 6 నుండి రాత్రి 9 గంటల వరకు విష్వక్సేనపూజ, అంకురార్పణంతో పవిత్రోత్సవాలు ప్రారంభమవుతాయి.

వైదిక సంప్రదాయం ప్రకారం జాతాశౌచం, మృతాశౌచం వంటి వేళల్లో ఆలయ ప్రవేశం నిషిద్ధం. అయినా యాత్రీకుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలిసీతెలియక ఇటువంటి దోషాలు జరుగుతుంటాయి. ఇలాంటి వాటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు ప్రతి ఏడాదీ మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు.

సెప్టెంబరు 8న ఉదయం చతుష్ఠార్చ‌న, పుణ్యాహవచనం, యాగశాలపూజ, పవిత్రప్రతిష్ఠ, సాయంత్రం 6 నుండి రాత్రి 9 గంటల వరకు నిత్య హోమం నిర్వహిస్తారు. సెప్టెంబరు 9న‌ ఉదయం పవిత్ర సమర్పణ, సాయంత్రం పవిత్ర హోమం చేప‌డ‌తారు. సెప్టెంబరు 10న ఉదయం 6 నుండి మ‌ధ్యాహ్నం 1 గంట వరకు మహాపూర్ణాహుతి, సాయంత్రం స్వామి, అమ్మవార్ల వీధి ఉత్సవం, పవిత్ర వితరణ కార్యక్రమాలు నిర్వహిస్తారు.

ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భక్తి సంగీతం, హరికథ, దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భజన కార్యక్రమాలు నిర్వహిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.