TIRUMALA SHOULD REVERBERATE WITH ”GOVINDA NAMA” ALONE- AP CM _ తిరుమల గిరులపై గోవింద నామాలు మాత్రమే ప్రతిధ్వనించాలి – సి.ఎం.

TAKES PART IN PEDDA SESHA VAHANA SEVA

TIRUMALA, 04 OCTOBER 2024: The sacred Hills of Tirumala should reverberate with ”Govinda Nama Smarana” alone, stongly wished the Honourable CM of AP Sri N Chandrababu Naidu.

After darshan, speaking on the occasion he said, he prayed Sri Venkateswara Swamy for the wellbeing of the humanity. 

Adding further he said, lakhs of devotees are being anticipated to participate in the ongoing nine day annual Brahmotsavam. 

Appreciating the efforts of TTD officials, in improving Annaprasadam, cleanliness, various other pilgrim initiatives.

Later he participated in the Pedda Sesha Vahana Seva.

Endowments Minister Sri A Ramnarayana Reddy, local MLA Sri A Srinivasulu, EO Sri J Syamala Rao, Additional EO Sri Ch Venkaiah Chowdary and others were present.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరుమల గిరులపై గోవింద నామాలు మాత్రమే ప్రతిధ్వనించాలి – సి.ఎం.

తిరుమల, 2024 అక్టోబ‌రు 04: పవిత్రమైన తిరుమల దివ్య క్షేత్రంలో నిరంతరం గోవింద నామస్మరణ మాత్రమే ప్రతిధ్వనించాలని, గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు అన్నారు.

తిరుమల పర్యటన సందర్భంగా శుక్రవారం సాయంత్రం దర్శనానంతరం మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలపై స్వామివారి అనుగ్రహం ఎప్పుడూ ఉండాలని ప్రార్థించాలన్నారు.

భక్తుల కొరకు టీటీడీ యాజమాన్యం ఎన్నో ఏర్పాట్లను చేస్తున్నదన్నారు. అన్న ప్రసాదం, పారిశుద్ధ్యం, వంటి అనేక సౌకర్యాలను భక్తుల కొరకు కల్పించింది.
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో లక్షలాదిమంది భక్తులు పాల్గొంటారు. ఈ సౌకర్యాలను వారందరూ వినియోగించుకోవాలని కోరారు.

అనంతరం శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటిరోజైన శుక్ర‌వారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఏడుతలల స్వర్ణశేషవాహనంపై(పెద్ద శేషవాహనం) తిరుమాడ వీధులలో భక్తులను అనుగ్రహించారు.

ఈ వాహ‌న సేవ‌లో రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌ|| శ్రీ నారా చంద్ర‌బాబు నాయుడు కుటుంబ స‌మేతంగా పాల్గొన్నారు.

మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీ ఆరని శ్రీనివాసులు, టిటిడి ఈవో శ్రీ శ్యామల రావు, అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది