TIRUNAKSHATRAM HONOURS RENDERED TO TIRUMALA PEDDA JIYAR SWAMY AT TIRUPATI _ టిటిడి స్థానిక ఆల‌యాల్లో శ్రీశ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్ స్వామిజీకి పెద్దమర్యాద

Tirupati, 30 Dec. 20: In connection with the Tirunkashatram (Birthday) of HH Sri Sri Pedda Jiyar Swamy of Tirumala on 31st December, the temple honours to the Chief Pontiff of Tirumala were offered to him along with his disciples in Tirupati on Wednesday.

As part of this, the senior pontiff of Tirumala was given honours at Sri Padmavathi Ammavari temple at Tiruchanoor, Sri Govindaraja Swamy and Sri Kodanda Rama Swamy temples at Tirupati.

Speaking on this occasion, Tirupati JEO Sri P Basanth Kumar said, it’s an honour to be a part in the Tirunakshatram of Sri Pedda Jiyar Swamy who was extended the Birthday Greetings in a traditional way at all the three major temples in the pilgrim city.

Meanwhile, there will be temple honours to Sri Pedda Jiyar Swamy at Tirumala temple, after the Second bell on December 31. He will have darshan of Lord Venkateswara on his 71st Tirunakshatram along with his disciples.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDS, TIRUPATI

టిటిడి స్థానిక ఆల‌యాల్లో శ్రీశ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్ స్వామిజీకి పెద్దమర్యాద

తిరుప‌తి, 2020 డిసెంబరు 30: శ్రీ పెరియకోయిల్‌ కేల్వి అప్పన్‌ శ్రీ శఠగోప రామానుజ పెద్దజీయర్‌స్వామివారికి బుధ‌వారం టిటిడి స్థానిక ఆల‌యాల్లో పెద్దమర్యాదలు జ‌రిగాయి.

స్వామీజీకి టిటిడి జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్ ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి స్వామివారి దర్శనం చేయించి తీర్థప్రసాదాలు అందచేశారు.

ఈ సంద‌ర్భంగా జెఈవో మాట్లాడుతూ తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌యం, తిరుప‌తిలోని శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌యం, శ్రీ కోదండ‌రామ‌స్వామివారి ఆల‌యాల‌లో పెద్దమర్యాద జ‌రిగిన‌ట్లు తెలిపారు.

శ్రీ గోవింద‌రాజ‌స్వామివారికి బంగారు ఆభ‌ర‌ణాలు బ‌హూక‌ర‌ణ‌

శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఉత్స‌వ‌ర్ల‌కు బుధ‌వారం శ్రీశ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్ స్వామివారు రూ. 50 వేల విలువైన బంగారు ఆభ‌ర‌ణాలు బ‌హూక‌రించారు.
 
విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని ప్ర‌తిపాదించిన భ‌గ‌వ‌ద్ రామానుజాచార్యుల కాలంలో తిరుమ‌ల‌లో పెద్ద‌జీయర్ మఠం ఏర్పాటైంది. శ్రీవారి ఆలయం, ఇత‌ర అనుబంధ ఆల‌యాలలో వైఖానస ఆగమం ప్రకారం శ్రీ రామానుజాచార్యులు ప్రవేశపెట్టిన కైంకర్యాలు, క్రతువులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి.
శ్రీ రామానుజాచార్యుల ప‌రంప‌ర‌లో వ‌స్తున్న జీయ‌ర్‌స్వాములు తిరుమల శ్రీ‌వారి ఆల‌యంతో పాటు అనుబంధ ఆల‌యాలలో కైంక‌ర్యాలు, సేవ‌లు, ఉత్స‌వాల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్నారు.

శ్రీశ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్ స్వామివారి 71వ తిరున‌క్ష‌త్రం సంద‌ర్భంగా గురువారం తిరుమ‌ల‌లో పెద్దమర్యాద జ‌రుగ‌నుంది.
 
ఈ కార్యక్రమంలో స్థానిక ఆలయ ప్ర‌త్యేక శ్రేణి డెప్యూటీ ఈవోలు శ్రీ రాజేంద్రుడు, శ్రీ‌మ‌తి పార్వ‌తి, శ్రీ‌మ‌తి ఝూన్సీరాణి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
           
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.