TIRUNAMA DHARANA COMMENCES IN TIRUMALA _ తిరుమలలో భక్తులకు తిలక ధారణ ప్రారంభించిన టిటిడి ఈవో
TIRUMALA, 06 SEPTEMBER 2024: The “Tirunama Dharana” – applying Tirunamam on the overhead of devotees, resumed at Tirumala on Friday evening.
The Tirunama Dharana commenced by TTD in 2017 and was stopped after the advent of Covid. Almost after a gap of four years, under the instructions of TTD EO Sri J Syamala Rao, the Tirunama Dharana commenced again in Tirumala.
Speaking on the occasion, the TTD EO said, Srivari Sevaks will render this service everyday at Supadham, VQC entries, Rs.300 line, KKC Main, Varaha Swamy opposite.
Meanwhile, the pilgrims expressed immense happiness over the resuming of Tirunama Dharana by TTD while the Srivari Sevaks who participated in Tirunama Seva convey their pleasure in the seva.
Additional EO Sri Ch Venkaiah Chowdary, JEO Sri Veerabrahmam, CVSO Sri Sreedhar, Chief PRO Dr T Ravi, PRO(FAC) Kum P Neelima and others were also present.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
తిరుమలలో భక్తులకు తిలక ధారణ ప్రారంభించిన టిటిడి ఈవో
తిరుమల, 2024 సెప్టెంబరు 06: తిరుమలలో శ్రీవారి భక్తులకు తిలక ధారణ కార్యక్రమాన్ని టిటిడి ఈవో శ్రీ జె.శ్యామల రావు శుక్రవారం ప్రారంభించారు. తిరుమల ఏటీసీ సర్కిల్ వద్ద ఈవోకు, భక్తులకు శ్రీవారి సేవకులు తిలక ధారణ చేశారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, తిరుమలలో భక్తులకు తిలక ధారణ కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. శ్రీవారి సేవకులు తిరుమలలోని ఏటిసి, సుపథం, శ్రీ వరాహస్వామి ఆలయం, కళ్యాణకట్ట, విక్యూసి 1 మరియు 2 ల వద్ద నిరంతరాయంగా తిలక ధారణ చేస్తారని చెప్పారు.
ఈ కార్యక్రమంలో టిటిడి అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓ శ్రీ వీరబ్రహ్మం, సివిఎస్ఓ శ్రీ శ్రీధర్, సిపిఆర్ఓ డాక్టర్ టి.రవి, పిఆర్ఓ (ఎఫ్ ఏసి) కుమారి పి.నీలిమ, ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.