TIRUPATI DENIZENS LAUD CULTURAL PROGRAMMES _ తిరుపతిలో అలరించిన భక్తి సంగీత కార్యక్రమాలు

Tirupati, 29 September 2025: The Tirupati denizens lauded the cultural programmes organised by TTD in connection with the ongoing annual Brahmotsavams at Tirumala.
 
On Monday evening, the devotional vocals of renowned veteran Annamacharya Project artist Sri Raghunath, the classical expert duo the Malladi brothers from Vijayawada, captivated the audience at Mahati Auditorium.
 
Similarly, the programs in Annamacharya Kalamandiram and Sri Ramachandra Pushkarini also allured the art lovers.
 
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

తిరుపతిలో అలరించిన భక్తి సంగీత కార్యక్రమాలు

తిరుపతి, 2025 సెప్టెంబరు 29 ;తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆరవ రోజైన సోమవారం ఏర్పాటు చేసిన ధార్మిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు తిరుపతి పురప్రజలను విశేషంగా అలరించాయి.

మహాతి కళాక్షేత్రంలో

అన్నమాచార్య ప్రాజెక్ట్ విశ్రాంత గాయకులు శ్రీ బి. రఘునాథ్ తమ బృందం విష్ణుప్రియ, వరలక్ష్మి, భావన గార్లతో ప్రదర్శించిన గాత్ర కచేరీ సభను భక్తి పారవశ్యంలో ముంచెత్తింది.

ఇందులో భాగంగా మొదట ఆదిమూలమే మాకు అంగరక్ష, పిలువరే కృష్ణుని, సర్వాంతరాత్ముడు,వలపులు వలపులు ఒయ్యారి, పొడనిద పొక్కిల్లో, సకల లోకేశ్వరుడు, నగధర నందగోప, ఎంతవాడవయ్య, దీనుడ నేను, అఖిలలోక వంద్యుడ మొదలైన కీర్తనలతో సభను అలరించారు.

అనంతరం విజయవాడ కు చెందిన శ్రీ రాంప్రసాద్, డా. రవికుమార్ (మల్లాది బ్రదర్స్) గాత్ర సంగీతం సభను భక్తిసాగరంలో ముచ్చెత్తింది.
వీరు శరణంబితడే అనే అన్నమయ్య కీర్తన, ముత్తుస్వామి దీక్షితుల శంఖ చక్ర గదాధర మొదలైన కీర్తనలు సంప్రదాయబద్ధంగా ఆలపించారు.

వీరికి వయొలిన్ పై మల్లాదిరాజేశ్వరి, మృదంగంపై మల్లాది శివానంద్ చక్కగా సహకారమందించారు.

అన్నమాచార్య ప్రాజెక్ట్ వారి ఆధ్వర్యంలో జరిగిన ఈ
కార్యక్రమంలో తిరుపతి పురవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.