TIRUPPAVAI IN LOCAL  TEMPLES _ టీటీడీ స్థానికాల‌యాల్లో ధనుర్మాసం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు

TIRUPATI, 14 DECEMBER 2024: As Dhanurmasam is commencing on December 16 at 6:57am, the local temples are gearing up for Tiruppavi Pasura Parayanam.

At Sri GT, KRT, PAT and Narayanavanam temples, these Pasurams will be recited every day from  till January 14.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

టీటీడీ స్థానికాల‌యాల్లో ధనుర్మాసం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు

తిరుపతి, 2024 డిసెంబరు 14: టీటీడీ స్థానికాల‌యాల్లో ధనుర్మాసం సందర్భంగా డిసెంబరు 16 నుండి జనవరి 14వ తేదీ వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వ‌హించ‌నున్నారు.

డిసెంబరు 16వ తేదీ ఉదయం 6.57 గంట‌ల‌కు ధనుర్మాసం ప్రారంభమవుతుంది.

శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో డిసెంబ‌రు 16 నుండి జ‌న‌వ‌రి 14వ తేదీ వ‌ర‌కు ప్ర‌తిరోజూ ఉదయం 4 నుండి 6 గంటల వరకు సుప్ర‌భాతం స్థానంలో తిరుప్పావై పారాయ‌ణం, భక్తులకు ధనుర్మాస దర్శనం కల్పిస్తారు. ఈ కార‌ణంగా సుప్ర‌భాతం సేవా టికెట్లు జారీ చేయ‌రు. భ‌క్తులు ఈ విష‌యాన్ని గ‌మ‌నించాల‌ని కోర‌డ‌మైన‌ది.

తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌యంలో…

తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌యంలో ధనుర్మాసం సందర్భంగా డిసెంబరు 16 నుండి జనవరి 14వ తేదీ వరకు నెల రోజుల పాటు ఉద‌యం 4.30 నుండి 5.30 గంట‌ల వ‌ర‌కు ధ‌నుర్మాస ద‌ర్శ‌నం క‌ల్పిస్తారు.

అదేవిధంగా, తిరుప‌తిలోని శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌యంలో ఉద‌యం 4 నుండి 5.30 గంట‌ల వ‌ర‌కు సుప్ర‌భాతం స్థానంలో తిరుప్పావై పారాయ‌ణం, భ‌క్తుల‌కు ధ‌నుర్మాస ద‌ర్శ‌నం క‌ల్పిస్తారు.

తిరుప‌తిలోని శ్రీ కోదండ‌రామాల‌యంలో ఉద‌యం 4 నుండి 5 గంట‌ల వ‌ర‌కు ధ‌నుర్మాస కైంక‌ర్యాలు, ఉద‌యం 5.30 నుండి 8 గంట‌ల వ‌ర‌కు భ‌క్తుల‌కు ధ‌నుర్మాస ద‌ర్శ‌నం క‌ల్పిస్తారు.

నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా ఉదయం 5 నుండి 6 గంటల వరకు తిరుప్పావై, ధనుర్మాస కంకర్యాలు నిర్వహిస్తారు. ఉదయం 6 నుండి 7 గంటల వరకు భక్తులకు ధనుర్మాస దర్శనం కల్పించనున్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.